స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం వివో తమ సిరీస్–టీ పోర్ట్‌ఫోలియోలో భాగంగా టీ5 హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్, 6.83 అంగుళాల 3డీ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే, 7050 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సోనీ ఐఎంక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 34,999 నుంచి ప్రారంభమవుతుంది.
సెప్టెంబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ–స్టోర్, ఇతర రిటైల్ స్టోర్స్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. రూ. 4,000 వరకు డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐ తదితర ఆఫర్లను సంస్థ అందిస్తోంది. ఆఫర్లను కూడా ఉపయోగించుకుంటే ధర దాదాపు రూ. 31,499 నుంచి ప్రారంభమవుతుంది.


