ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ ఫ్యామిలీ స్కూటర్ జూపిటర్ 110లో కొత్త డ్యూయల్-టోన్ స్పెక్ట్రల్ రేంజ్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.89,825 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. కొత్త రంగులు, ప్రీమియం డిజైన్‌తో పాటు కొన్ని అదనపు ఫీచర్లను ఇందులో అందించారు. అయితే ఇంజిన్, మెకానికల్ సెటప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
రెండు కొత్త డ్యూయల్-టోన్ కలర్స్
జూపిటర్ 110 స్పెక్ట్రల్ రేంజ్ స్పెక్ట్రల్ బ్లూ, స్పెక్ట్రల్ కాపర్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. టీవీఎస్ ప్రత్యేకంగా ఉపయోగించిన ‘స్పెక్ట్రల్ కలర్ టెక్నాలజీ’ కారణంగా వెలుతురు, చూసే కోణాన్ని బట్టి రంగుల్లో మార్పు కనిపించేలా పెయింట్ ఫినిష్‌ను రూపొందించారు.
స్పెక్ట్రల్ బ్లూ వేరియంట్‌లో తెలుపుతో పాటు బ్లూ, పర్పుల్ టోన్లు ఉండగా.. స్పెక్ట్రల్ కాపర్‌లో తెలుపుతో పాటు కాపర్, పర్పుల్ షేడ్స్ కనిపిస్తాయి. వీటికి అనుగుణంగా ఇన్నర్ ప్యానెల్స్, కొత్త సీట్ ఫినిష్, పాక్షిక క్రోమ్ మిర్రర్లను అందించారు.
సీక్వెన్షియల్ ఇండికేటర్లు.. టైప్-సీ ఛార్జింగ్
కొత్త జూపిటర్ 110లో ప్రధాన ఆకర్షణ సీక్వెన్షియల్ టర్న్ సిగ్నల్ ల్యాంప్స్. 110సీసీ స్కూటర్ విభాగంలో ఇది సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ అని టీవీఎస్ చెబుతోంది. దీంతో స్కూటర్‌కు మరింత ప్రీమియం లుక్ రావడంతో పాటు టర్న్ సిగ్నలింగ్ సమయంలో ప్రత్యేక లైటింగ్ ఎఫెక్ట్ లభిస్తుంది.
అదే విధంగా యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా కొత్త వేరియంట్‌లో చేర్చారు. SmartXonnect కనెక్టెడ్ టెక్నాలజీ కొనసాగుతుంది. దీని ద్వారా నావిగేషన్ అసిస్టెన్స్, కాల్, SMS అలర్ట్స్ వంటి ఫంక్షన్లు పొందవచ్చు.
పిలియన్‌కు బ్యాక్‌రెస్ట్.. 33 లీటర్ల స్టోరేజ్
కంఫర్ట్ పరంగా కూడా కొన్ని మార్పులు చేశారు. ప్రీమియం లాంగ్ సీట్‌కు ఇంటిగ్రేటెడ్ పిలియన్ బ్యాక్‌రెస్ట్‌ను స్టాండర్డ్‌గా అందించారు. జూపిటర్‌కు ఇప్పటికే ఉన్న 33 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ సదుపాయం కొనసాగుతుంది. ఇందులో రెండు హెల్మెట్లను పెట్టుకోవచ్చని కంపెనీ చెబుతోంది.ముందు భాగంలోనే ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఉండటం వల్ల పెట్రోల్ నింపుకోవడం కూడా సులభంగా ఉంటుంది.
ఇంజిన్‌లో మార్పుల్లేవు
కొత్త స్పెక్ట్రల్ రేంజ్‌లో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 113.3 సీసీ, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్ కొనసాగుతుంది. ఇది 5.9 kW (సుమారు 7.9 bhp) పవర్, 9.8 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. ఇంజిన్‌తో పాటు టీవీఎస్ iGO Assist టెక్నాలజీని కూడా కొనసాగించారు. ఇందులో సైలెంట్ స్టార్ట్, స్టార్ట్-స్టాప్ వంటి ఫంక్షన్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: టాటా కార్లు.. భారీ తగ్గింపు ఆఫర్లు


