మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌: భారీ బ్యాటరీ.. పడినా పగలదు! | Vivo Y31t 5G Launched In India, 7200mAh Battery, IP68/IP69 Protection And Snapdragon 4 Gen 2 | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌: భారీ బ్యాటరీ.. పడినా పగలదు!

Aug 30 2026 2:09 PM | Updated on Aug 30 2026 4:23 PM

Vivo Y31t 5G Launched 7200mAh Battery Drop resistance

స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించడం అందరికీ అంత సులువు కాదు. ఎంత జాగ్రత్తగా ఉపయోగించినా అనుకోకుండా కిందపడటం, నీటిలో తడవడం వంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మన్నికకు ప్రాధాన్యమిచ్చేలా వివో కొత్త వై31టీ 5జీ (Y31t 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారీ బ్యాటరీతో పాటు డ్రాప్‌ రెసిస్టెన్స్, వాటర్‌ అండ్‌ డస్ట్‌ ప్రొటెక్షన్‌ ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.

డ్రాప్‌ రెసిస్టెన్స్‌కు ప్రత్యేక గుర్తింపు

వివో వై31టీ 5జీని కంపెనీ డ్రాప్‌, స్ట్రక్చరల్‌ టెస్టింగ్‌ చేసినట్లు తెలిపింది. ఈ ఫోన్‌కు ఎస్‌జీఎస్‌ 5-స్టార్‌ ప్రీమియం పర్ఫార్మన్స్‌ మార్క్‌ ఓవరాల్‌ యూనిట్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో పాటు మిలిటరీ-గ్రేడ్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్‌ ఉన్నట్లు వివో పేర్కొంది.  

ఫోన్‌కు IP68, IP69 రేటింగ్‌లు ఉన్నాయి. అంటే దుమ్ము, నీటి ప్రవేశం నుంచి అధిక స్థాయి రక్షణ లభిస్తుంది. వివో ప్రకారం, నిర్దిష్ట పరిస్థితుల్లో 1.5 మీటర్ల లోతు వరకు 30 నిమిషాల పాటు నీటిలో ముంచినా ఫోన్‌ పనిచేసేలా రూపొందించారు. అయితే లిక్విడ్‌ డ్యామేజ్‌ వారంటీ పరిధిలో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.

7200mAh బ్యాటరీ.. 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌

వివో వై31టీ 5జీలో ప్రధాన ఆకర్షణ 7200mAh బ్యాటరీ. దీనికి 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. వివో అధికారిక పరీక్షల ప్రకారం, ఒక్క ఛార్జ్‌తో 62 గంటల వరకు మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌, 32 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ వంటి సామర్థ్యాన్ని ఫోన్‌ అందించగలదని కంపెనీ చెబుతోంది.

డిస్‌ప్లే, ప్రాసెసర్‌

ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది 1608×720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 1250 నిట్స్‌ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

పనితీరు కోసం క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 4nm చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇందులో ఆక్టాకోర్‌ సీపీయూతో పాటు LPDDR4X ర్యామ్‌, UFS 3.1 స్టోరేజ్‌ ఉన్నాయి. ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఓరిజిన్‌ ఓఎస్‌ 6పై పనిచేస్తుంది.

కెమెరా..

ఫొటోగ్రఫీ కోసం ఫోన్‌ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 2MP బొకే కెమెరాతో కూడిన డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఉంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను అందించారు. ప్రధాన కెమెరాకు 90 డిగ్రీల వైడ్‌ యాంగిల్‌ సామర్థ్యం కూడా ఉంది. రియర్‌ కెమెరాతో ఫొటో, నైట్‌, పోర్ట్రెయిట్‌, వీడియో, స్లో-మో, టైమ్‌ల్యాప్స్‌, ప్రో, పనోరమా వంటి మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇతర ఫీచర్లు

ఫోన్‌లో సైడ్‌-మౌంటెడ్‌ కెపాసిటివ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, డ్యూయల్‌ సిమ్‌ సపోర్ట్‌, USB Type-C పోర్ట్‌, డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. వివో ప్రకారం స్పీకర్‌ వాల్యూమ్‌ను సాధారణ స్థాయితో పోలిస్తే 400 శాతం వరకు పెంచే మోడ్‌ కూడా ఉంది.

ధర, కలర్‌ ఆప్షన్లు

వివో వై31టీ 5జీ క్రిమ్సన్‌ రెడ్‌, సీషోర్‌ గ్రీన్‌, గోల్డెన్‌ మిస్ట్‌ రంగుల్లో లభిస్తుంది. వివో అధికారిక ఉత్పత్తి పేజీలో 4GB+128GB, 6GB+128GB, 6GB+256GB వేరియంట్లు పేర్కొనగా, ప్రస్తుతం అధికారిక ఈ-స్టోర్‌లో 6GB+128GB వేరియంట్‌ రూ.29,999 ధరతో కనిపిస్తోంది.

లాంచ్‌ సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 వరకు ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ లభిస్తుంది. వివో అధికారిక స్టోర్‌తో పాటు ఇతర ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement