హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశంలోని మొట్టమొదటి E85 స్కూటర్ ADV160 ధరను ప్రకటించింది. ఈ అడ్వెంచర్ స్టైల్ మ్యాక్సీ స్కూటర్ ధర రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ దీని కోసం బుకింగ్స్ రూ. 5,000 టోకెన్ మొత్తంతో స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2026 అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ADV160 స్కూటర్ ప్రత్యేకత దాని E85-అనుకూల ఇంజన్. ఇందులోని 157 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్.. 16.3 bhp పవర్, 14.9 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పవర్ CVT ద్వారా వెనుక చక్రానికి డెలివరీ అవుతుంది. ఇందులోని ఇంజిన్ 85 శాతం వరకు ఇథనాల్ మరియు 15 శాతం పెట్రోల్ కలిగిన ఇంధనంతో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
ADV160 సరికొత్త డిజైన్ పొందుతుంది. షార్ప్ బాడీ వర్క్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎత్తైన, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, బ్లాక్-ప్యాటర్న్ టైర్లు ఉన్నాయి. పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద చక్రాలు ఉండటం వల్ల ఈ స్కూటర్ కఠినమైన రోడ్ల మీద కూడా సజావుగా ముందుకు సాగుతుంది. హోండా ADV160ను "సిటీ అడ్వెంచర్" స్కూటర్‌గా అభివర్ణిస్తుంది.
హోండా తన ADV160లో చాలా ప్రీమియం ఫీచర్లను పొందుపరిచింది. ఇందులో ఫుల్ కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు హోండా రోడ్‌సింక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంది. దీని ద్వారా రైడర్లు నావిగేషన్, కమ్యూనికేషన్ సంబంధిత ఫంక్షన్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఈ స్కూటర్‌లో ట్రాక్షన్-కంట్రోల్ సిస్టమ్‌గా పనిచేసే హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్‌తో పాటు, సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది. ఒక USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉండనున్నట్లు సమాచారం. సీటు కింద ఉన్న 27-లీటర్ల స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ లభిస్తుంది.
హోండా కొత్తగా ప్రకటించిన 10 ఉత్పత్తుల 'మేడ్-ఇన్-ఇండియా' పోర్ట్‌ఫోలియోలో ADV160 ఒక భాగం . భారతదేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాలకు సిద్ధంగా ఉన్న ద్విచక్ర వాహనాల దిశగా కంపెనీ తీసుకుంటున్న అతిపెద్ద అడుగులలో ఇది ఒకటి. ఈ స్కూటర్‌ను స్థానికంగా తయారు చేసి, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తారు.


