ఐఫోన్‌ల కంపెనీలో అటు ఆనందాలు.. ఇటు ఆక్రందనలు! | Apple Layoffs Again iPhone 18 Buzz fitness plus job cuts | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ల కంపెనీలో అటు ఆనందాలు.. ఇటు ఆక్రందనలు!

Sep 21 2026 5:02 PM | Updated on Sep 21 2026 5:12 PM

Apple Layoffs Again iPhone 18 Buzz fitness plus job cuts

యాపిల్‌ ఉత్పత్తులు.. ముఖ్యంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం కొత్త సిరీస్‌ ఐఫోన్‌ 18 ప్రో స్మార్ట్‌ఫోన్లు విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా చూసినా దీని గురించి హంగామానే నడుస్తోంది. కొత్త ఐఫోన్‌ చేతికొచ్చిన ఆనందం చాలా మందిలో కనిపిస్తోంది. ఇదంతా ఓవైపు కథ. మరో వైపు ఇదే క్రేజీ యాపిల్‌ కంపెనీలో ఉద్యోగాలు కోతలు కూడా నడుస్తున్నాయి. వందల్లో ఉద్యోగులను తొలిగించి ఇంటికి పంపుతోంది టెక్‌ దిగ్గజం.

యాపిల్‌ కొత్త ఐఫోన్‌ 18 సిరీస్‌ చుట్టూ ప్రపంచవ్యాప్తంగా సందడి నెలకొన్న వేళ.. అదే కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. తాజాగా యాపిల్‌ తన ‘ఫిట్‌నెస్‌ ప్లస్‌’ (Fitness+) సర్వీస్‌లోని ఆడియో విభాగంలో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులను తొలగించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ నివేదించింది. గత రెండు నెలల్లో యాపిల్‌లో చోటుచేసుకున్న రెండో విడత ఉద్యోగాల కోత ఇది.

తాజా కోతల్లో టైమ్‌ టు వాక్‌, టైమ్‌ టు రన్‌ వంటి ఆడియో ఫీచర్లపై పనిచేసే సిబ్బంది ఉన్నట్లు సమాచారం. యాపిల్‌ వాచ్‌ వినియోగదారులు వీడియోను చూడాల్సిన అవసరం లేకుండా నడక లేదా పరుగు సమయంలో గైడెడ్‌ ఆడియో కంటెంట్‌ను వినేందుకు ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి.

ఆగస్టులో 200కుపైగా ఉద్యోగాల కోత
తాజా పరిణామానికి కొద్ది వారాల ముందు, ఆగస్టులో యాపిల్‌ 200కుపైగా ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వచ్చాయి. ఈ కోతల్లో విజన్‌ ప్రో, సిరి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన బృందాలు ప్రభావితమైనట్లు సమాచారం. విజన్‌ ప్రో విభాగంలో సుమారు 100 ఉద్యోగాలు, సిరితో పాటు ఇతర సాఫ్ట్‌వేర్‌ బృందాల్లో మరో 100 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు తగ్గినట్లు అప్పట్లో నివేదికలు వచ్చాయి.. యాపిల్‌ మాత్రం వ్యాపార వృద్ధి, వినియోగదారులకు కొత్త అనుభవాలు అందించడం కోసం కొన్ని బృందాలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement