breaking news
iPhone 18 Pro Max
-
IPHONE DUO లో అదిరిపోయే ఫీచర్లు..!
-
వైరల్ వీడియో: మరిగే చాయ్‌లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్!
కొత్త ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌పై ఓ వింత పరీక్షకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరిగే చాయ్‌లో ఐఫోన్‌ను దాదాపు మూడు నిమిషాల పాటు ఉంచారు. ఆ తర్వాత ఫోన్ పరిస్థితి ఎలా ఉందో చూపించారు. యాపిల్ సంస్థ ఇటీవల ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లు ఉన్నాయి. తొలి విక్రయాలు ప్రారంభమైన సమయంలోనే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన ఈ వింత పరీక్ష వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. This is actually WILD... Bro literally dipped the brand new iPhone 18 Pro Max into boiling hot tea.💀 https://t.co/M8FpA1WjFV— Bhuvan (@Bhuvan_RJ46) September 19, 2026వైరల్ వీడియోలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపక్కన ఉన్న చాయ్ దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ను కెమెరా ఆన్ చేసి పరీక్షించారు. అనంతరం మరుగుతున్న చాయ్‌లో ఫోన్ ఉంచారు. కొత్త ఐఫోన్లో థర్మల్ ప్రొటెక్షన్ ఎలా పనిచేస్తుందో చూడటమే ఈ పరీక్ష ఉద్దేశమని వీడియోలో తెలిపారు. మూడు నిమిషాల అనంతరం ఫోన్‌ను బయటకు తీశారు. ఆ ఫోన్లోకి తేమ వెళ్లినట్లు తెలియజేశారు. ఫోన్‌ను బయటకు తీసిన తర్వాత నీటితో శుభ్రం చేసి, మళ్లీ ఉపయోగించేందుకు ప్రయత్నించారు. కెమెరాను ఆన్ చేసి ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేశారు. ఈ వైరల్ వీడియోలో ఫోన్ కొంతవరకు పనిచేసినట్లు చూపించినప్పటికీ, మరిగే చాయ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచడం మంచిది కాదు. అధిక ఉష్ణోగ్రత, ద్రవం, ఆవిరి వంటి పరిస్థితులు ఎలక్ట్రానిక్ పరికరానికి నష్టం కలిగిస్తాయి. -
ఐఫోన్ల కంపెనీలో అటు ఆనందాలు.. ఇటు ఆక్రందనలు!
యాపిల్ ఉత్పత్తులు.. ముఖ్యంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం కొత్త సిరీస్ ఐఫోన్ 18 ప్రో స్మార్ట్ఫోన్లు విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా చూసినా దీని గురించి హంగామానే నడుస్తోంది. కొత్త ఐఫోన్ చేతికొచ్చిన ఆనందం చాలా మందిలో కనిపిస్తోంది. ఇదంతా ఓవైపు కథ. మరో వైపు ఇదే క్రేజీ యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు కోతలు కూడా నడుస్తున్నాయి. వందల్లో ఉద్యోగులను తొలిగించి ఇంటికి పంపుతోంది టెక్ దిగ్గజం.యాపిల్ కొత్త ఐఫోన్ 18 సిరీస్ చుట్టూ ప్రపంచవ్యాప్తంగా సందడి నెలకొన్న వేళ.. అదే కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. తాజాగా యాపిల్ తన ‘ఫిట్నెస్ ప్లస్’ (Fitnes ) సర్వీస్‌లోని ఆడియో విభాగంలో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులను తొలగించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. గత రెండు నెలల్లో యాపిల్‌లో చోటుచేసుకున్న రెండో విడత ఉద్యోగాల కోత ఇది.తాజా కోతల్లో టైమ్ టు వాక్, టైమ్ టు రన్ వంటి ఆడియో ఫీచర్లపై పనిచేసే సిబ్బంది ఉన్నట్లు సమాచారం. యాపిల్ వాచ్ వినియోగదారులు వీడియోను చూడాల్సిన అవసరం లేకుండా నడక లేదా పరుగు సమయంలో గైడెడ్ ఆడియో కంటెంట్‌ను వినేందుకు ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి.ఆగస్టులో 200కుపైగా ఉద్యోగాల కోతతాజా పరిణామానికి కొద్ది వారాల ముందు, ఆగస్టులో యాపిల్ 200కుపైగా ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వచ్చాయి. ఈ కోతల్లో విజన్ ప్రో, సిరి, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన బృందాలు ప్రభావితమైనట్లు సమాచారం. విజన్ ప్రో విభాగంలో సుమారు 100 ఉద్యోగాలు, సిరితో పాటు ఇతర సాఫ్ట్వేర్ బృందాల్లో మరో 100 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు తగ్గినట్లు అప్పట్లో నివేదికలు వచ్చాయి.. యాపిల్ మాత్రం వ్యాపార వృద్ధి, వినియోగదారులకు కొత్త అనుభవాలు అందించడం కోసం కొన్ని బృందాలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు పేర్కొంది. -
బంగారం అమ్మేసి కొత్త ఐఫోన్!
కొత్త ఐఫోన్ ఫీవర్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇటీవలె విడుదలైన యాపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ మోడళ్లు.. భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చేశాయి. శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కావడంతో, ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ తెరవడానికి ముందు నుంచే ఫ్యాన్స్ బారులు తీరారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు స్టోర్ల వద్దకు ఐఫోన్ ప్రియులు పోటెత్తారు.ఈ సందర్భంగా యాపిల్ స్టోర్ల వద్ద అనేక సిత్రాలు కనిపించాయి. పలువురు ఫ్యాన్స్ తమ పాత ఐఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. తన భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనేందుకు వచ్చిన ఓ వ్యక్తిని మీడియా పలకరించగా విస్తుపోయే విషయం చెప్పాడు. తన భార్యకు కొత్త ఐఫోన్ కొనేందుకు బంగారం అమ్మేసినట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియాను వ్యాపారవేత్త హర్ష్ గోయెంక తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కొంత మంది ఇల్లు కొనడానికి బంగారం అమ్మేస్తారు.. మరికొంత మంది పిల్లల భవిష్యత్తు కోసం పసిడిని విక్రయిస్తుంటారు. కానీ ఇతడని చూడండి భార్యకు ఐఫోన్ కొనేందుకు బంగారం అమ్మేశాడు.. అంటూ రాసుకొచ్చారు.అమెరికాలో సెప్టెంబర్ 9న ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో ధర భారత్‌లో రూ. 1,64,900 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,79,900. బ్లాక్, సిల్వర్ తదితర నాలుగు రంగుల్లో ఇవి లభిస్తాయి. యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ’డ్యుయో’ని కూడా ప్రవేశపెట్టింది. భారత్‌లో దీని ధర రూ. 2,99,900 నుంచి రూ. 4,49,900 వరకు ఉంది.Some people sell gold to buy a house. Some sell it for their children’s future. This Delhi man sold family gold passed down from his grandmother and great-grandmother to buy his wife an iPhone 18 Pro Max.🙈 pic.twitter.com/MVSUEtmfSB— Harsh Goenka (@hvgoenka) September 18, 2026 -
మార్కెట్లోకి ఐఫోన్ 18 ఎంట్రీ...స్టోర్స్ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్ (ఫొటోలు)
-
హైదరాబాద్ పంజాగుట్టలో సందడి చేసిన సినీ నటి రాశీ సింగ్ (ఫొటోలు)
-
మన దగ్గరా ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు తాజాగా భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కావడంతో, ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ తెరవడానికి ముందు నుంచే ఫ్యాన్స్ బారులు తీరారు. ముంబై, ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు చాలా ప్రాంతాల్లో చాంతాడంత క్యూలు కనిపించాయి. పలువురు ఫ్యాన్స్ తమ పాత ఐఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ‘మూడు కెమెరాలు, అప్‌గ్రేడ్ చేసిన అనేక ఫీచర్లు, మెరుగైన పనితీరుతో పాటు షో ఆఫ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. పైగా యాపిల్ అనేది చాలా పెద్ద బ్రాండ్ కూడా. సెప్టెంబర్ 12 సాయంత్రం ప్రీ–బుక్ చేసుకుంటే 18 ఉదయం 8.15 గం.కి మొదటి స్లాట్ దొరికింది. మొత్తానికి మొదటి ఫోన్ అందుకున్నా‘ అని ఓ కస్టమర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న అమెరికాలో ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో ధర భారత్‌లో రూ. 1,64,900 నుంచి, 18 ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,79,900 నుంచి ప్రారంభమవుతుంది. బ్లాక్, సిల్వర్ తదితర నాలుగు రంగుల్లో ఇవి లభిస్తాయి. యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ’డ్యుయో’ని ప్రవేశపెట్టింది. భారత్‌లో దీని ధర రూ. 2,99,900 నుంచి రూ. 4,49,900 వరకు ఉంది. -
మడతపెట్టే ఫోన్‌పై మీమ్స్.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!
ఐఫోన్ ప్రియుల కోసం టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల మడతపెట్టే ఫోన్ ‘డ్యువో’ను మార్కెట్లోకి విడుదల చేసింది. మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను దక్కించుకునేందుకు ఎప్పటిలాగే టెక్ లవర్స్ ఆసక్తి కనబరిచారు. యాపిల్ స్టోర్ల ముందు బారులు తీరి మరీ మడతపెట్టే ఫోన్లు కొన్నారు. మరోవైపు ఈ ఫోన్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొంత మంది నెటిజనులు సరదా కామెంట్లు పెట్టారు.ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ హై ఎండ్ మోడల్ ధర నాలుగున్నర లక్షల రూపాయలు ఉంది. ఈ ధరలపై సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు వేస్తున్నారు. ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ రేటుకి కారు లేదా బైకు వచ్చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా పలు రకాల వీడియోలతో నెటిజనులు నవ్వులు పూయిస్తున్నారు. ఐఫోన్ ధరల మాట ఎలా ఉన్నా ఈ మీమ్స్ మాత్రం తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. వీటిని చూసినవారంతా భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: పిల్లల్ని కనడానికి అయిష్టంగా యువతులు.. ఎందుకో తెలుసా? #Iphone18 ProMax #Effect .....😂😂 pic.twitter.com/GM1QM6zVwD— హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature) September 15, 2026 4L ki inko 1L kalipisthey Alto vachesthadi🫡#IPhone18 #IPhone17 #AppleEvent pic.twitter.com/ByMYOi8Kl5— Fukkard (@Fukkard) September 10, 2026 ₹4,50,000 for Foldable iPhone? 😳 -#iPhoneDuo #Apple #iPhone18 #iphone pic.twitter.com/d6KHsF26Pt— Ankit Uttam (@ankituttam) September 10, 2026 Rammurthy Avre and friends react to the recent #apple launch and how expensive things are getting. pic.twitter.com/4D5JOYFK3N— Danish Sait (@DanishSait) September 11, 2026 Thank you #apple pic.twitter.com/97gi9hGHbM— Pushpendra Singh (@pushpendrakum) September 11, 2026 सासऱ्याने हुंड्यात #Apple iPhone Duo कबूल केला pic.twitter.com/aH3RBdOsek सासऱ्याने हुंड्यात #Apple iPhone Duo कबूल केला pic.twitter.com/aH3RBdOsek— Sanket (@BTechComedian) September 10, 2026Me trying to justify buying iPhone 18 to my parents: 😭#iphone #Apple pic.twitter.com/e4wc92nnrU— escape.1 (@xescape18) September 10, 2026 -
దుమ్మురేపుతున్న సామ్సంగ్.. ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెస్ట్
-
ఎట్టకేలకు ఐఫోన్ డ్యూయో : సోషల్‌మీడియాలో పేలుతున్న మీమ్స్
యాపిల్ సంస్థ ఎట్టకేలకు తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను 'ఐఫోన్ డ్యూయో' (iPhone Duo) ను లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ఫీచర్లు, ఫోల్డబుల్ స్క్రీన్, ఇతర ప్రత్యేకతలపై కాకుండా సోషల్‌మీడియాలో జరుగుతున్న సంభాషణ మాత్రం విభిన్నంగా సాగుతోంది. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న జోక్‌కు IYKYK (if you know, you know) ) అనేది ట్రెండింగ్ ట్యాగ్‌లైన్‌గా మారింది.మైక్రోసాఫ్ట్ 2020లోనే తన రెండు స్క్రీన్ల ఫోల్డబుల్ డివైజ్‌ను యాపిల్ కాపీ కొట్టిందంటూ మీమ్స్, జోకులు పేలిపోతున్నాయి. మైక్రోసాఫ్ట్ తన ఫోన్‌కు 'Surface Duo' అని పేరు పెట్టింది. దీంతో 'Duo' అనేది కొత్త పేరేమీ కాదు, పాతదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాపిల్ 'Fold' అని పెట్టకుండా మైక్రోసాఫ్ట్‌ను కాపీ కొట్టిందని కొందరు ఎక్స్‌లో విమర్శించారు. మరికొందరు ఇది మైక్రోసాఫ్ట్‌దే కాకుండా, గతంలొ వచ్చిన ఇంటెల్ (Core Duo) చిప్‌ల పేరును కూడా గుర్తుచేస్తోందన్నారు. అయితే, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో కంటే ముందే, అంటే 1990లలోనే యాపిల్ తన PowerBook Duo ల్యాప్‌టాప్‌లకు ఈ పేరును వాడిందని మరికొందరు గుర్తుచేశారు.విండోస్ సెంట్రల్ ఎడిటర్ జాక్ బౌడెన్ మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్ తమ 'Duo' ప్రాజెక్ట్‌ను మధ్యలోనే వదిలేయడం వల్ల యాపిల్ ఉద్దేశపూర్వకంగానే ఈ పేరును (మరియు MacBook Neo రూపంలో 'Neo' పేరును) ఉపయోగించుకుందని నిపుణులంటున్నారు. పేర్కొన్నారు. డ్రాయిడ్ లైఫ్ అనే టెక్ సైట్ వ్యాఖ్యానిస్తూ, మైక్రోసాఫ్ట్ తయారు చేసిన అత్యంత దారుణమైన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకటైన సర్ఫేస్ డ్యూయో పేరునే యాపిల్ ఎంచుకోవడం నవ్వు తెప్పిస్తోందని రాసుకొచ్చింది.విండోస్ లేటెస్ట్ కథనం ప్రకారం, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో హార్డ్‌వేర్ అద్భుతంగా ఉన్నప్పటికీ సోఫ్ట్వేర్ పరంగా విఫలమైంది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఆ ప్రాజెక్ట్‌ను కొనసాగించి ఉంటే సర్ఫేస్ డ్యూయో ఎలా ఉండేదో, యాపిల్ ఐఫోన్ డ్యూయో ఇప్పుడు అలా వచ్చిందని విశ్లేషించింది.యాపిల్ గతంలో 'MagSafe Duo' ఛార్జర్ వంటి వాటికి ఈ పేరు వాడినప్పటికీ, ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ విఫలమైన ప్రాజెక్ట్ పేరు మళ్లీ యాపిల్ ఫోన్‌కు రావడాన్ని నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. అయితే ఈ పేర్ల సారూప్యతపై యాపిల్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.'Huawei made a foldable phone five years ago...' '"Junk, that phone will break in an instant... Chinese junk... Why do you need so much screen on a single phone? Just buy a tablet."' 'Apple makes a foldable phone...' '"Only Apple could pull this off."'😁😁😁 pic.twitter.com/kbeCGujp8d— FierceGoys (@GrahamInHell) September 10, 2026 -
రేట్లు ఎక్కువే కానీ.. ఐఫోన్ యూజర్లకు మాత్రం బంపర్ ఆఫర్..
-
కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)
-
ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్.. కెమెరాలో అదిరిపోయే మార్పులు!
ప్రీమియం ఫోన్ మేకర్ యాపిల్ తన కొత్త ప్రో సిరీస్ స్మార్ట్ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పేరుతో వచ్చిన ఈ రెండు మోడళ్లలో కెమెరా, పనితీరు, బ్యాటరీ, ఏఐ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. తాజాగా జరిగిన యాపిల్ ఈవెంట్లో వీటిని ఆవిష్కరించగా.. భారత్‌లో ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 నుంచి, సాధారణ విక్రయాలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి.వేరియబుల్ అపెర్చర్‌తో 48MP కెమెరాఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో అతిపెద్ద అప్‌గ్రేడ్ కెమెరా విభాగంలో కనిపిస్తుంది. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరాకు తొలిసారిగా ‘మెకానికల్ వేరియబుల్ అపెర్చర్’ను యాపిల్ తీసుకొచ్చింది. దీంతో పరిస్థితులకు అనుగుణంగా కాంతి ప్రవేశాన్ని మార్చడంతో పాటు ఫొటోల్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌పై ఎక్కువ నియంత్రణ లభిస్తుంది. తక్కువ వెలుతురులోనూ మెరుగైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.మెయిన్ కెమెరాతో పాటు 48MP అల్ట్రా వైడ్, 48MP టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. 8x వరకు ఆప్టికల్-క్వాలిటీ జూమ్, 40x వరకు డిజిటల్ జూమ్ లభిస్తుంది. కెమెరా యాప్‌లో అపెర్చర్, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్, హిస్టోగ్రామ్ వంటి ప్రొఫెషనల్ కంట్రోల్స్‌ను కూడా వినియోగదారులు మార్చుకోవచ్చు.వీడియో విషయానికి వస్తే 4K డాల్బీ విజన్‌ను 120fps వరకు రికార్డ్ చేయొచ్చు. 18MP సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరాను కూడా యాపిల్ అందించింది.ఫొటోలు నిజమైనవో.. మార్చినవో గుర్తించే టెక్నాలజీఐఫోన్ 18 ప్రోలో Apple Reference Image అనే కొత్త ఫీచర్‌ను యాపిల్ ప్రవేశపెట్టింది. కెమెరా నుంచి వచ్చిన పిక్సెల్ డేటాకు క్రిప్టోగ్రాఫిక్ సిగ్నేచర్ జతచేసి, అసలు చిత్రానికి సంబంధించిన రిఫరెన్స్‌ను భద్రపరచే విధంగా దీనిని రూపొందించారు. దీంతో ఫొటోపై తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయో గుర్తించడంలో సహాయపడుతుంది. AI ద్వారా రూపొందించిన లేదా మార్చిన చిత్రాలను గుర్తించే విధంగా SynthID సపోర్ట్‌ను కూడా యాపిల్ ప్రకటించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ ఫీచర్ల లభ్యత భిన్నంగా ఉండొచ్చు.A20 ప్రో చిప్రెండు కొత్త ప్రో మోడళ్లలోనూ A20 Pro చిప్ ఉంటుంది. 2nm ప్రాసెస్‌పై తయారైన ఈ చిప్‌లో సిక్స్-కోర్ CPU, న్యూరల్ యాక్సిలరేటర్లతో ఏడు-కోర్ GPU, డ్యూయల్ 16-కోర్ Neural Engine ఉన్నాయి. హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ కూడా అందుబాటులో ఉంది. మెరుగైన పనితీరును కొనసాగించేందుకు కొత్త తరం ‘వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్’ను కూడా యాపిల్ తీసుకొచ్చింది. A20 Pro, కొత్త థర్మల్ డిజైన్ కలయికతో ఐఫోన్ చరిత్రలోనే అత్యుత్తమ స్థిరమైన పనితీరును అందిస్తామని కంపెనీ పేర్కొంది.కొత్త కనెక్టివిటీ చిప్స్వైర్లెస్ కనెక్టివిటీ కోసం కొత్త N1 చిప్‌ను ఉపయోగించారు. ఇది Wi-Fi 7, Bluetooth 6, Thread నెట్‌వర్కింగ్‌కు మద్దతు ఇస్తుంది. సెల్యులార్ కనెక్టివిటీ కోసం యాపిల్ రూపొందించిన C2 మోడెమ్ ఉంది.120Hz డిస్ప్లే.. చిన్నదైన డైనమిక్ ఐలండ్ఐఫోన్ 18 ప్రోలో 6.3 అంగుళాల, ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ OLED డిస్ప్లేలు ఉన్నాయి. రెండింటిలోనూ 120Hz వరకు ప్రోమోషన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, డైనమిక్ ఐలండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈసారి డైనమిక్ ఐలండ్ పరిమాణాన్ని తగ్గిస్తూ మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దినట్లు యాపిల్ తెలిపింది. ఒకేసారి మూడు లైవ్ యాక్టివిటీస్‌ను ప్రదర్శించే సామర్థ్యం కూడా ఉంది.43 గంటల వరకు బ్యాటరీబ్యాటరీ సామర్థ్యాన్ని పెంచేందుకు అంతర్గత డిజైన్‌లో మార్పులు చేశారు. ముఖ్యంగా eSIM-ఓన్లీ వేరియంట్లలో సిమ్ ట్రే కోసం ఉపయోగించే స్థలాన్ని పెద్ద బ్యాటరీకి కేటాయించగలిగారు. యాపిల్ ప్రకారం ఐఫోన్ 18 ప్రోలో 34 గంటల వరకు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 43 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ లభిస్తుంది. MagSafe, Qi2 వైర్లెస్ ఛార్జింగ్‌తో పాటు USB-C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. 60W లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అడాప్టర్‌తో సుమారు 15 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.iOS 27తో AI ఫీచర్లుకొత్త ప్రో మోడళ్లు iOS 27తో వస్తాయి. యాపిల్ ఇంటెలిజెన్స్‌లో భాగంగా మెరుగైన సిరి ఏఐ, స్క్రీన్‌పై కనిపిస్తున్న సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం, యాప్‌ల మధ్య సందర్భాన్ని కొనసాగించే ఫీచర్లు, కెమెరా ఆధారిత విశ్లేషణ వంటి కొత్త సామర్థ్యాలను యాపిల్ అందిస్తోంది.భారత్‌లో ధరలు ఇవేఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB ధర రూ.1,89,900, 1TB ధర రూ.2,39,900, 2TB ధర రూ.3,14,900.ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB ధర రూ.1,79,900. 512GB రూ.2,04,900, 1TB రూ.2,54,900, 2TB రూ.3,29,900గా ఉన్నాయి.బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, కొత్త బర్గండీ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. భారత్‌లో సెప్టెంబర్ 12న సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమై, సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు మొదలవుతాయి.ఇదీ చదవండి: ఐఫోన్ ధరలు.. ఈ దేశాల్లో కాస్త చౌక!


