సాక్షి, కోల్‌కతా : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రీ టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలకమైన నందిగ్రామ్ ఉపఎన్నికకు కేవలం నెల రోజులు ముందు మమతా బెనర్జీ శిబిరానికి చెందిన టీఎంసీ అభ్యర్థి అభ్యర్థి సంచిత ప్రధాన్ డే తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడం కలకలం రేపింది. రాష్ట్ర సచివాలయం 'నబన్నా'లో ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిసిన కొన్ని గంటల్లోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కాంగ్రెస్‌కు మద్దతు అంటున్నమమతా
దీంతో అనివార్యంగా మమత కాంగ్రెస్‌కు మద్దతుప్రకటించాల్సి వచ్చింది. సంచిత ప్రధాన్ డే అభ్యర్థిత్వం ఉపసంహరణపై స్పందించిన మమతా బెనర్జీ, జుమ్లా పార్టీ అంటూ బీజేపీపై మండిపడ్డారు. తాము INDIA కూటమితో కలిసి నడుస్తున్నామని, నందిగ్రామ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆమె ప్రకటించారు. సువేందు నందిగ్రామ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, ఆయనను కలవడం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని తొలుత వర్గాలు పేర్కొన్నప్పటికీ, రాజకీయ వర్గాలలో ఇది పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. రెజిన్‌గ్రామ్, నందిగ్రామ్ ఉపఎన్నికల కోసం ఎన్నికల సంఘం మమతా శిబిరానికి కొత్త గుర్తును కేటాయించిన రోజే సంచిత ప్రధాన్ డే తన తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం.
పార్టీ, గుర్తు రెండూ
మమత తన టీఎంసీ పార్టీ పేరు, గుర్తూ రెండు కోల్పోయారు. దీంతో గత 28 ఏళ్లుగా తమతో ఉన్న 'పువ్వులు, గడ్డి' (జోరా ఫూల్) ఎన్నికల గుర్తును, పార్టీ పేరును ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. మమతా శిబిరానికి 'ఫుట్‌బాల్ ప్లేయర్' గుర్తును, రిబ్రతా బెనర్జీ నేతృత్వంలోని ప్రత్యర్థి శిబిరానికి 'కవర్ (ఎన్వలప్)' గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.
ఇదీ చదవండి: ఐఫోన్ క్రేజ్ : భార్యామణి కోసం ఏకంగా గోల్డ్ అమ్మి మరీ!
ప్రతిష్టాత్మకంగా నందిగ్రామ్
నందిగ్రామ్ ప్రాంతం బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. గతంలో జరిగిన రైతుల తిరుగుబాటు సీపీఎం ప్రభుత్వాన్ని గద్దె దించడంలో, మమతా బెనర్జీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది.మరోవైపు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి TMCని స్థాపించిన మమతా బెనర్జీ, పార్టీ గుర్తులు కోల్పోయిన ప్రస్తుత తరుణంలో మళ్లీ కాంగ్రెస్ మద్దతు కోరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదీ చదవండి: ఐఫోన్ లేటెస్ట్ : అక్కడ చీప్‌గా కొనేస్తున్నారట!
తాజా పరిణామాల నేపథ్యంలో టీఎంసీ అభ్యర్థి తప్పుకోవడం, మమతా బెనర్జీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో నందిగ్రామ్ ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారంది. అటు సీఎం సువేందు అధికారికి, ఇటు బీజేపీకి ఈ ఎన్నిక మరింత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.


