breaking news
Nandigram
-
సీఎం సువేందు రికార్డును బద్దలు కొట్టిన పీఏ తల్లి!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి మరో భారీ విజయం దక్కింది. నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి హాసీ రాణి రాత్ తన సమీప ప్రత్యర్థిపై భారీ ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో హత్యకు గురైన సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రాత్ తల్లి ఈమె. సువేందు అధికారి పేరిట ఉన్న గత రికార్డులను బద్దలు కొడుతూ ఆమె ఈ అఖండ విజయాన్ని సాధించారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి భబానీపూర్, నందిగ్రామ్ రెండూ స్థానాల నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన భబానీపూర్ స్థానాన్ని ఉంచుకుని, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. దాంతో దివంగత తన వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రాత్ తల్లి హాసీ రాణి రాత్‌కు బీజేపీ తరఫున సువేందు అధికారి అవకాశం కల్పించారు.కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ 41,674 ఓట్లు సాధించగా, హాసీ రాణి రాత్ అత్యధికంగా 1,64,427 ఓట్లు సాధించారు.అంటే తన ప్రత్యర్థి కంటే ఏకంగా 1,22,753 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె విజయం సాధించారు. 1967 తర్వాత ఈ నియోజకవర్గంలో నమోదైన అత్యధిక విజయ ఓట్ల తేడా ఇదే కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు సువేందు అధికారి పేరు మీదే ఉండేది. ఆయన 2016లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి 81,230 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.చంద్రనాథ్ రథ్ హత్య కేసుసువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య ఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే మే 6న ఈ ఘటన జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఉత్తర 24 పరగణాల జిల్లా మాధ్యమ్గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్ తన ఎస్‌యూవీలో ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రత్య్రర్థుల కుట్రగా బీజేపీ నేతలు ఆరోపించగా, పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తొలుత బెంగాల్ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరపగా, ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రాంతాల నుంచి నిందితులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు సీబీఐకి బదిలీ అయింది. చంద్రనాథ్ రథ్ హత్య వెనుక పూర్తి రాజకీయ కక్షసాధింపు చర్యలు, కుట్ర ఉన్నాయని సువేందు అధికారి గతంలో ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల, ముఖ్యంగా ఎన్నికల్లో ప్రత్యర్థులపై సాధించిన విజయాల నేపథ్యంలోనే తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఈ హత్యకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. జేఎన్‌యూ ప్రొఫెసర్, కాంగ్రెస్ ఎంపీపై వేటు! -
మమతా ‘గాయం’పై కొత్త ట్విస్ట్.. ‘సువేందు’ కీలక ఆదేశాలు
నందిగ్రామ్ ’గాయం’ మళ్లీ రాజకీయ మంటలు రేపుతోంది.. 2021 ఎన్నికల వేళ మమతా బెనర్జీ కాలి గాయం ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాజాగా దర్యాప్తునకు ఆదేశించింది. మమత కాలికి గాయం అదంతా నటనే.. రాజకీయ ప్రయోజనాల కోసం నాటకం అంటూ సీఎం సువేందు అధికారి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతున్నాయి.2021 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీకి జరిగిన గాయంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాజాగా దర్యాప్తు చేపట్టనుందని ముఖ్యమంత్రి సువేందు అధికారి శనివారం వెల్లడించారు. దీంతో అప్పటి ఎన్నికల్లో రాజకీయ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మమతా బెనర్జీ గాయాన్ని డ్రామాగా సువేందు అభివరించారు. బంగూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో చేసిన వైద్య పరీక్షల నివేదికలో ఎముక విరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. ..నబన్నాలోని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీకి సంబంధించిన వైద్య నివేదికను ఆయన ప్రదర్శించారు. “2021లో నందిగ్రామ్‌లో ప్రచారం సందర్భంగా మమతా బెనర్జీ తన కాలికి గాయం అంటూ నాటకానికి తెరలేపారు. ఫ్రాక్చర్, డిస్లోకేషన్కు ఎలాంటి ఆధారం లేదని వైద్య నివేదికలో ఉంది. ఈ విషయంపై మేము దర్యాప్తు ప్రారంభిస్తాం. ఆమె చేసిన తప్పుడు ఆరోపణ నందిగ్రామ్ ప్రజలను అవమానించింది. అక్టోబర్ 9న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ముగిసిన తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తా’’ అని సువేందు తెలిపారు.2021లో అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్చి 10న నందిగ్రామ్‌లోని రేయాపారా, బిరులియా ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో గాయపడ్డారు. ఆ సమయంలో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు తనను కారు తెరిచి ఉన్న తలుపు వైపు నెట్టారని.. పెద్ద సంఖ్యలో ప్రజలు చుట్టుముట్టిన సమయంలో ఆ కారు తలుపు తన ఎడమ కాలికి బలంగా తగిలిందని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి విడుదల చేసిన వీడియో సందేశంలో కూడా ఆమె ఇదే తరహా వివరణ ఇచ్చారు. ప్రజలకు అభివాదం చేస్తుండగా ప్రజలు తన వాహనాన్ని చుట్టుముట్టారని.. ఆ సమయంలో తన కాలు కారు తలుపు మధ్య నలిగిపోయిందని ఆమె చెప్పారు.ఆమెను కోల్‌కతాకు తరలించి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి వైద్య నివేదికల ప్రకారం, ఆమె ఎడమ చీలమండ, పాదానికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. కుడి భుజం, ముంజేయి, మెడ, నడుము ప్రాంతాల్లో కూడా గాయాలు, నొప్పి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఎక్స్‌రే, ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించగా, బంగూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్లో కూడా ఎంఆర్ఐ చేశారు. మార్చి 12న ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె ఎడమ కాలికి ప్లాస్టర్ వేసి ఉండగా, ఆ తర్వాత వీల్‌చైర్‌లోనే ఎన్నికల ప్రచారం కొనసాగించారు.ఇదీ చదవండి: కారులో సీఎన్జీ నింపుతుండగా బిగ్ బ్లాస్టర్ -
నా భర్తను తప్పుడు కేసులతో జైల్లో పెట్టించారు
కోల్‌కతా: బెంగాల్ సీఎం సువేందు అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తప్పుడు కేసులతో తన భర్తను జైలులో పెట్టించారని నందిగ్రామ్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ భార్య అర్పిత ఆరోపించారు. గురువారం ఆమె కోల్‌కతాలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దాదాపు 20 ఏళ్లనాటి పాత కేసులో సరిగ్గా ఉప ఎన్నికకు ముందు అరెస్ట్ చేయడమేంటని పోలీసులను ఆమె ప్రశ్నించారు. ఆ కేసులో సీఎం అధికారి పేరు కూడా ఉందని, ఆయన్నెందుకు వదిలేశారంటూ నిలదీశారు. అసలైన దోషి సువేందు అధికారి సీఎం పదవిలో ఉన్నందునే స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. తన కుమార్తెతో కలిసి నందిగ్రామ్‌లో ఈ నెల 25వ తేదీ నుంచి మిలన్ ప్రధాన్ తరఫున ప్రచారం చేపడతానని అరి్పత వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా తమ కుమార్తె స్కూలుకు కూడా వెళ్లలేకపోతోందంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా స్వేచ్ఛ అనేది కనిపించడం లేదని, మనం ఇప్పటికీ బ్రిటిష్ పాలనలో ఉన్నట్లే కనిపిస్తోందన్నారు. జైలులో ఉన్న అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, మాజీ సీఎం మమతా బెనర్జీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీపై జరుగుతున్న పోరాటంలో తమతో చేతులు కలపాలని ఆమె అన్ని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. మిలన్‌ను పోటీ చేయనివ్వాలి: కలకత్తా హైకోర్టు ధర్మాసనాలు మిలన్ ప్రధాన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టులోని రెండు ధర్మాసనాలు నందిగ్రామ్ ఉప ఎన్నికలో మిలన్‌ను పోటీ చేయనివ్వాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాయి. తనపై నమోదైన నాలుగు కేసుల్లో బెయిలివ్వాలంటూ మిలన్ పెట్టుకున్న అర్జీని జస్టిస్ తీర్థంకర్ ఘోష్, జస్టిస్ సౌగతా భట్టాచార్య సారథ్యంలోని రెండు ధర్మాసనాలు విచారించి పైవిధంగా అభిప్రాయం తెలిపాయి. మిలన్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం జరిగే విచారణ సమయానికి అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. నందిగ్రామ్ ఉప ఎన్నిక ప్రచారం అక్టోబర్ 4వ తేదీతో ముగియనుండగా పోలింగ్ 6వ తేదీన జరగనుంది. దిగువ కోర్టు మిలన్ ప్రధాన్‌కు అక్టోబర్ 7వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ను అనుమతించింది. -
బెంగాల్ బైపోల్స్‌లో బిగ్ ట్విస్ట్.. టీఎంసీ, స్వతంత్ర అభ్యర్థుల అరెస్ట్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అక్టోబర్ 6న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ అరెస్టులు ఘటనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రెజీనగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సైఫుల్ ఇస్లాంను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఐదేళ్ల నాటి కేసులో సెప్టెంబర్ 19న ఈ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, సైఫుల్ ఇస్లాం.. హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP)తో సంబంధం కలిగి ఉన్నారు. బెర్హంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు ఓ పోలీసు అధికారి పీటీఐకి తెలిపారు.ఒక్కరోజులో ఇద్దరు అభ్యర్థుల అరెస్ట్అంతకుముందు.. నందిగ్రామ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో నమోదైన దాదాపు రెండు దశాబ్దాల నాటి కేసులో సెప్టెంబర్ 18న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉప ఎన్నికలకు ముందు వరుసగా ఇద్దరు అభ్యర్థులు అరెస్ట్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.ముఖ్యమంత్రి సువేందు అధికారి నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్ నుంచి కూడా గెలవడంతో నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేశారు. మరోవైపు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నవదా స్థానాన్ని నిలుపుకోవడంతో హుమాయూన్ కబీర్ గెలిచిన రెజీనగర్ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఇదిలా ఉండగా, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై నమోదైన కేసులో AJUP అధినేత హుమాయూన్ కబీర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. సెప్టెంబర్ 14న ఈ కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బెర్హంపూర్‌లో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీసులు ఓ ఆడియో రికార్డింగ్‌ను వినిపించారు. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కుట్రకు సంబంధించిన సూచనలు ఆ సంభాషణలో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఉప ఎన్నికలకు ముందు వరుస అరెస్టులు, పోలీసుల దర్యాప్తులతో బెంగాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.టీఎంసీకి భారీ షాక్.. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నందిగ్రామ్, రెజీనగర్ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నందిగ్రామ్‌లో టీఎంసీ అభ్యర్థి సంచితా ప్రధాన్ డే నామినేషన్ ఉపసంహరించుకుని, కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మద్దతు ప్రకటించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. అయితే, ఆ తర్వాత మిలన్ ప్రధాన్ పాత కేసులో అరెస్టయ్యారు. రెజీనగర్‌లోనూ టీఎంసీ అభ్యర్థి రబియుల్ ఆలం చౌధురి నామినేషన్ ఉపసంహరణపై తొలుత ప్రకటన చేసినప్పటికీ, అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకుని పోటీలో కొనసాగనున్నట్లు ప్రకటించినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: గణపతి మండపం వద్ద కరెంట్ షాక్.. మహిళ, బాలిక మృతి -
నందిగ్రామ్‌లో ఇంకో ట్విస్ట్.. ముదిరిన పొలిటికల్ వార్
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉపఎన్నికకు ముందు రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తొలుత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అభ్యర్థి సాంచిత తన నామినేషన్ ఉపసంహరించుకోవడం.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మమతా బెనర్జీ మద్దతు ప్రకటించడం తెలిసిందే. అయితే ఆపై కొద్ది గంటల్లోనే మిలన్ ప్రధాన్ అరెస్ట్ కావడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది.నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ వర్గం తరఫున బరిలో ఉన్న సాంచితా ప్రధాన్ డే శుక్రవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. సీఎం సువేందు అధికారితో భేటీ నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ అనూహ్య పరిణాంపై మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన వర్గం ఇక నందిగ్రామ్‌లో మరో అభ్యర్థిని నిలబెట్టబోదని ప్రకటించి.. కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన మిలన్ ప్రధాన్‌కు మద్దతు తెలిపారు. ఇండియా కూటమిని బలోపేతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ సైతం ఖుషీ అయ్యింది.అయితే మమతా మద్దతు ప్రకటించిన కొద్ది గంటల్లోనే మిలన్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2007 నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన పాత హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆయనపై ఇప్పటికే పలు కేసులు, అరెస్టు వారెంట్ ఉన్నాయని చెబుతున్నారు.నందిగ్రామ్ సోనాచూరాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మిలన్ ప్రధాన్. 2007 భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీతో కలిసి చురుకుగా పనిచేశారు. అప్పటి నుంచి నందిగ్రామ్ రాజకీయాల్లో కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు. ఉద్యమానికి సంబంధించిన పలు కేసుల్లో ఆయన పేరు నమోదైంది. తాజాగా ఆయనకు కాంగ్రెస్ నందిగ్రామ్ టికెట్ ఇచ్చింది. సరిగ్గా ఇదేసమయంలో.. పెండింగ్ వారెంట్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు.మిలన్ ప్రధాన్‌ను శుక్రవారం రాత్రి పుర్బా మేదినీపూర్‌లోని ఓ హోటల్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత 2007 కేసులో పెండింగ్ వారెంట్ ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈరోజు (సెప్టెంబర్ 19) హల్దియా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు.. ఈ అరెస్ట్‌ను రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నా చేపట్టాలని కేడర్‌కు పిలుపు ఇచ్చింది. అలాగే ‘నందిగ్రామ్ చలో’ కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది.‘ఇది యాదృచ్ఛికం కాదు’..మిలన్ ప్రధాన్ అరెస్టుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. దీనిని ‘ఓటు చోరీ’, ‘ఎన్నికల చోరీ’గా అభివర్ణించారు. బీజేపీ ఉపఎన్నికలోనూ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. ప్రధానమంత్రి ‘మదర్ ఆఫ్ డెమొక్రసీ’ అని చెప్పుకుంటుంటే.. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయని ఖర్గే వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ.. మిలన్ ప్రధాన్ అరెస్టు యాదృచ్ఛికం కాదని, ఇది రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్లు, ప్రభుత్వాలు, పార్టీలు దొంగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ భయపడబోదని, పోరాడుతుందని పేర్కొన్నారు.‘ఎందుకీ సమయంలోనే?’.. మమతా ప్రశ్నమమతా బెనర్జీ సైతం అరెస్టు సమయాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే మిలన్ ప్రధాన్‌ను అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. పాత కేసును ఇప్పుడు ఎందుకు బయటకు తీశారని ప్రశ్నించారు. బీజేపీ ‘రాజకీయ కక్ష సాధింపు’తో వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని మమతా ఆరోపించారు. ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయంటూ కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఏమంటోంది?మిలన్ ప్రధాన్ అరెస్టు రాజకీయ కక్షతో జరిగిందన్న ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని, అరెస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. పాత కేసులో చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే చర్య జరిగిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ టికెట్‌ను హసిరాణి రథ్‌కు ఇచ్చింది. తన దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పని చేసి.. దారుణ హత్యకు గురైన చంద్రనాథ్ తల్లి ఆవిడ. అందుకే సువేందు ఆమెకు టికెట్ ఇప్పించారు. దీంతో నందిగ్రామ్‌లో పోటీ ప్రధాన పార్టీల మధ్య మరింత ఉత్కంఠగా మారింది.రితబ్రత బెనర్జీ ఎదురుదాడిమరోవైపు టీఎంసీ రెబల్ వర్గానికి చెందిన రితబ్రత బెనర్జీ మాత్రం మమతా వర్గం తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. గత ఏడు రోజులుగా నందిగ్రామ్‌ను కాంగ్రెస్‌కు వదిలేసి.. రిజీనగర్లో పోటీ చేయాలనే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అందుకు అంగీకరించకపోవడంతో మమతా అసంతృప్తికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమ వర్గం అభ్యర్థి అకస్మాత్తుగా నామినేషన్ ఉపసంహరించుకోవడం కూడా ఒక ‘ఫిక్స్’లో భాగమేనని ఆయన ఆరోపించారు. మమతా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడాన్ని రితబ్రత బెనర్జీ ‘అసంతృప్తితో తీసుకున్న నిర్ణయం’గా అభివర్ణించారు.అసలు వివాదం ఇక్కడే..బెంగాల్ రాజకీయ చదరంగంలో విపక్షాలకు ఒకే ఒక్కరోజులో భారీ షాకిచ్చింది. పార్టీ చీలిక కారణంగా.. అక్టోబర్ 6న జరగాల్సిన నందిగ్రామ్, రిజీనగర్ ఉప ఎన్నికలకు ఈసీ నిర్ణయంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి పార్టీ పేరు, గుర్తు దూరం అయ్యాయి. ఆ వెంటనే నందిగ్రామ్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ, మమతా కాంగ్రెస్‌కు మద్దతు.. ఆ వెంటనే ఆ అభ్యర్థి అరెస్టు జరగడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇదీ చదవండి: బలవంతంగా ఆయన్ని రిటైర్ చేశారా? -
సీఎం సువెందు దెబ్బ : మమతకు ఒకే రోజు రెండు షాకులు
సాక్షి, కోల్‌కతా : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రీ టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలకమైన నందిగ్రామ్ ఉపఎన్నికకు కేవలం నెల రోజులు ముందు మమతా బెనర్జీ శిబిరానికి చెందిన టీఎంసీ అభ్యర్థి అభ్యర్థి సంచిత ప్రధాన్ డే తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడం కలకలం రేపింది. రాష్ట్ర సచివాలయం 'నబన్నా'లో ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిసిన కొన్ని గంటల్లోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.కాంగ్రెస్‌కు మద్దతు అంటున్నమమతాదీంతో అనివార్యంగా మమత కాంగ్రెస్‌కు మద్దతుప్రకటించాల్సి వచ్చింది. సంచిత ప్రధాన్ డే అభ్యర్థిత్వం ఉపసంహరణపై స్పందించిన మమతా బెనర్జీ, జుమ్లా పార్టీ అంటూ బీజేపీపై మండిపడ్డారు. తాము INDIA కూటమితో కలిసి నడుస్తున్నామని, నందిగ్రామ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆమె ప్రకటించారు. సువేందు నందిగ్రామ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, ఆయనను కలవడం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని తొలుత వర్గాలు పేర్కొన్నప్పటికీ, రాజకీయ వర్గాలలో ఇది పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. రెజిన్గ్రామ్, నందిగ్రామ్ ఉపఎన్నికల కోసం ఎన్నికల సంఘం మమతా శిబిరానికి కొత్త గుర్తును కేటాయించిన రోజే సంచిత ప్రధాన్ డే తన తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం.పార్టీ, గుర్తు రెండూమమత తన టీఎంసీ పార్టీ పేరు, గుర్తూ రెండు కోల్పోయారు. దీంతో గత 28 ఏళ్లుగా తమతో ఉన్న 'పువ్వులు, గడ్డి' (జోరా ఫూల్) ఎన్నికల గుర్తును, పార్టీ పేరును ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. మమతా శిబిరానికి 'ఫుట్‌బాల్ ప్లేయర్' గుర్తును, రిబ్రతా బెనర్జీ నేతృత్వంలోని ప్రత్యర్థి శిబిరానికి 'కవర్ (ఎన్వలప్)' గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఇదీ చదవండి: ఐఫోన్ క్రేజ్ : భార్యామణి కోసం ఏకంగా గోల్డ్ అమ్మి మరీ!ప్రతిష్టాత్మకంగా నందిగ్రామ్ నందిగ్రామ్ ప్రాంతం బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. గతంలో జరిగిన రైతుల తిరుగుబాటు సీపీఎం ప్రభుత్వాన్ని గద్దె దించడంలో, మమతా బెనర్జీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది.మరోవైపు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి TMCని స్థాపించిన మమతా బెనర్జీ, పార్టీ గుర్తులు కోల్పోయిన ప్రస్తుత తరుణంలో మళ్లీ కాంగ్రెస్ మద్దతు కోరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదీ చదవండి: ఐఫోన్ లేటెస్ట్ : అక్కడ చీప్‌గా కొనేస్తున్నారట!తాజా పరిణామాల నేపథ్యంలో టీఎంసీ అభ్యర్థి తప్పుకోవడం, మమతా బెనర్జీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో నందిగ్రామ్ ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారంది. అటు సీఎం సువేందు అధికారికి, ఇటు బీజేపీకి ఈ ఎన్నిక మరింత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. -
నందిగ్రామ్ ఉప ఎన్నిక: ముఖ్యమంత్రి పీఏ తల్లికి టికెట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో సఖరవ్ సర్కార్, హసిరాణి రాథ్ పేర్లకు ఆమోదం లభించింది. రేజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సఖరవ్ సర్కార్ పోటీ చేయనున్నారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి రబియుల్ ఆలం చౌధురితో తలపడనున్నారు. మరోవైపు నందిగ్రామ్ నుంచి హసిరాణి రాథ్‌ను బీజేపీ బరిలోకి దించింది. అక్కడ టీఎంసీ అభ్యర్థి సంచిత ప్రధాన్‌తో పోటీ పడనున్నారు.హసిరాణి రాథ్ ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకునిగా పనిచేసిన చంద్రనాథ్ రాథ్‌కు ఆమె తల్లి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే చంద్రనాథ్ రాథ్ హత్యకు గురయ్యారు. నందిగ్రామ్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంపై హసిరాణి రాథ్ మీడియాతో మాట్లాడారు. ‘నందిగ్రామ్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు పార్టీ కల్పించింది. ఇక్కడ పార్టీ మా వెంట ఉంది. నందిగ్రామ్ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాం’ అని ఆమె పేర్కొన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో నందిగ్రామ్ నుంచి హసిరాణి రాథ్ పేరు ఆసక్తికరంగా మారింది. రేజీనగర్‌లో సఖరవ్ సర్కార్, నందిగ్రామ్‌లో హసిరాణి రాథ్ బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ టీఎంసీ అభ్యర్థులతో బీజేపీ అభ్యర్థులు తలపడనున్నారు.ఇదీ చదవండి: హౌతీల మెరుపు దాడులతో సౌదీలో ఉద్రిక్తత -
బెంగాల్ రాజకీయాల్లో కొత్త సస్పెన్స్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో దారుణ ఓటమి.. దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం.. టీఎంసీలో చీలిక.. ఇలా వరుస ఎదురుదెబ్బలతో మమతా బెనర్జీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని అంతా భావిస్తున్న వేళ.. ఆమెకు అనూహ్యంగా మరో అవకాశం తలుపుతట్టింది. అసెంబ్లీ ఉప ఎన్నికలు ఇప్పుడు బెంగాల్లో కొత్త సస్పెన్స్‌కు తెరతీశాయి. రెండు స్థానాల్లో ఏదైనా ఒకదాని నుంచి దీదీ బరిలోకి దిగి.. మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మమతా బెనర్జీ అసెంబ్లీలో ఉంటే బీజేపీ, ఇతర ప్రతిపక్షాలను నేరుగా ఎదుర్కోవడంతోపాటు ప్రజా సమస్యలను మరింత బలంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆమెను నందిగ్రామ్ లేదంటే రిజినగర్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన పార్టీలో మొదలైనట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్రంలో బలపడటం, టీఎంసీలో చీలికలు–ఫిరాయింపులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మమత స్వయంగా అసెంబ్లీలోకి రావడం పార్టీకి రాజకీయంగా కీలకమని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే..2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన సువేందు అధికారి, హుమాయున్ కబీర్ చెరో స్థానానికి రాజీనామా చేయడంతో నందిగ్రామ్, రిజినగర్ అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాల్లో నందిగ్రామ్ మమతకు కొంత అనుకూలమైన ఎంపికగా కనిపిస్తోంది. 2021 ఎన్నికల్లో ఇక్కడ సువేందు అధికారి చేతిలో మమత 1,956 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ సువేందు అధికారి టీఎంసీ అభ్యర్థిపై 9,665 ఓట్ల మెజారిటీ సాధించారు. అయినప్పటికీ మమత స్వయంగా బరిలోకి దిగితే పోటీ స్వరూపం మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ముర్షిదాబాద్ జిల్లాలోని రిజినగర్లో ముస్లిం ఓటర్లు సుమారు 65 శాతం ఉన్నారు. ఈ సామాజిక సమీకరణం మమతకు అనుకూలంగా మారొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు ఉన్న పాత రాజకీయ బలం దృష్ట్యా రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని టీఎంసీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు.ఈసీ షెడ్యూల్ ప్రకారం బుధవారం (సెప్టెంబర్ 9) ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 16 చివరి తేదీ కాగా.. సెప్టెంబర్ 17న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరుగుతుంది. సెప్టెంబర్ 19 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 6న నందిగ్రామ్, రిజినగర్ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.మరో సస్పెన్స్!ఇదిలా ఉండగా, ఉప ఎన్నికల్లో టీఎంసీకి అసలైన గుర్తు(గడ్డి కాడపై రెండు పూలు) దక్కుతుందా? అన్నది మరో కీలక ప్రశ్నగా మారింది. పార్టీ నుంచి విడిపోయిన రితబ్రత బెనర్జీ వర్గం తామే అసలైన టీఎంసీ అని ఇప్పటికే కోర్టుకెక్కింది. అటు ఎన్నికల సంఘంలోనూ అభ్యర్థన దాఖలు చేసుకుంది. అంతేకాదు ఆ రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని, పార్టీ గుర్తు తమకే వస్తుందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. అయితే మమతా బెనర్జీ ప్రజల్లోనే ఉన్నారని, ఆమె తరఫున అభ్యర్థి తప్పకుండా పోటీ చేస్తారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ కూడా రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. మమత రెండు చోట్ల పోటీ చేసినా మరోసారి ఓడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేత సజల్ ఘోష్ వ్యాఖ్యానించారు. దీంతో ఉప ఎన్నికలు కేవలం రెండు స్థానాల పోరుగా కాకుండా.. మమతా బెనర్జీ రాజకీయంగా మళ్లీ అసెంబ్లీలోకి వస్తారా? టీఎంసీపై ఆమె పట్టు ఎంతవరకు ఉంది? పార్టీ గుర్తు ఎవరికి దక్కుతుంది? అనే మూడు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పే ఎన్నికలుగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: పేరుతోనే అసలు విషయం చెప్పేసిన విజయ్ -
ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించను
కోల్‌కతా: సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఏమాత్రం సహించబోనని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి హెచ్చరించారు. తాను మమతా బెనర్జీలా బలహీన, పిరికి ముఖ్యమంత్రిని కాదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ముర్షిదాబాద్ జిల్లాలోని రెజీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎవరిపేరును ప్రస్తావించకపోయినా, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) అధ్యక్షుడు, ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను ఉద్దేశించి మాట్లాడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.కొద్దిరోజుల క్రితం హుమాయున్ కబీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సీఎం సువేందు తాజాగా వార్నింగ్ ఇచ్చారు. “మమతా బెనర్జీలా నేను బలహీనమైన లేదా పిరికివాడైన ముఖ్యమంత్రిని కాదు. ప్రజాప్రతినిధులు బాధ్యతారహితంగా మాట్లాడితే సహించను. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మాటలు మాట్లాడాలని స్థానిక ఎమ్మెల్యేకు సూచించాను” అని సువేందు అధికారి అన్నారు. రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించకపోయినా, వచ్చే 30 నుంచి 45 రోజుల్లో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశముందన్నారు.విభజన రాజకీయాలు వద్దురెజీనగర్ ఉప ఎన్నికలో (Rejinagar Bypoll) బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని సువేందు అధికారి హామీ ఇచ్చారు. “ఇక్కడ ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న హిందూ-ముస్లిం రాజకీయాలకు బదులుగా ప్రజల అవసరాలు, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తాం” అని చెప్పారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపైనా సువేందు అధికారి విమర్శలు గుప్పించారు. సీఏఏ-ఎన్ఆర్సీ, వక్ఫ్ చట్టం వంటి అంశాలపై జరిగిన ఆందోళనల పేరుతో హింస చెలరేగిందని, దాని వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల ముందు ప్రజలను విభజించేలా హుమాయున్ కబీర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి: 6 నిమిషాల్లో 43 చెప్పుదెబ్బలు!నందిగ్రామ్‌లోనూ ఉప ఎన్నికరెజీనగర్ స్థానాన్ని కబీర్ ఖాళీ చేయడంతో అక్కడ ఆయన కుమారుడు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కబీర్ నౌడా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, రెజీనగర్‌తో పాటు నందిగ్రామ్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. సీఎం సువేందు అధికారి నందిగ్రామ్ స్థానాన్ని ఖాళీ చేసి, భవానీపూర్ నియోజకవర్గాన్ని కొనసాగించాలని నిర్ణయించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. -
బెంగాల్ సీఎం మమతకు ఊహించని షాక్.. భారీ విజయం అందుకున్న బీజేపీ
బెంగాల్ రాజకీయాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు పార్టీల నేతల మధ్య మాటల వార్ ఇంకా నడుస్తూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీకి చేదు అనుభవమే ఎదురైనప్పటికీ సీట్ల విషయం మాత్రం పుంజుకుంది. ఇదిలా ఉండగా, తాజాగా అధికార టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. పూర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాగా ఆదివారం భేకుటియా సమబే కృషి సమితికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నికల్లో 12 సీట్లకు గానూ 11 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇక, ఈ ఎన్నికల్లో అధికార టీఎంసీ ఒక్క సీటుకే పరిమితమైంది. మరోవైపు.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓడించారు. ఇక, బీజేపీ విజయంపై సువేందు అధికారి స్పందిస్తూ.. బీజేపీని గెలిపించినందుకు నందిగ్రామ్ నియోజకవర్గం, భేకుటియా సమబే కృషి ఉన్నయన్ సమితి సహకార సంఘం ఓటర్లందరికీ ధన్యవాదాలు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో గొప్ప విజయానికి బాటలు వేస్తాయి అని కామెంట్స్ చేశారు. Big SETBACK for Mamata Banerjee, BJP wins 11 out of 12 seats in Nandigram co-operative body election Nandigram: Bhekutia Samabay Krishi Samity, which was held by Mamata Banerjee's Trinamool Congress (TMC) for a long time, took over by the Saffron camphttps://t.co/q55vSFd14i — Selvam 🚩 (@tisaiyan) September 19, 2022 -
నందిగ్రామ్ ఫలితంపై కోర్టును ఆశ్రయిస్తా: దీదీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం మమతా బెనర్జీ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. విజయం అనంతరం దీదీ హింసాత్మక చర్యలకు దిగారంటూ.. బీజేపీ చేస్తోన్న ఆరోపణలని ఆమె ఖండించారు. కాషాయపార్టీ ప్రచారం చేస్తోన్న ఫోటోలు పాతవన్నారు. నందిగ్రామ్ ఫలితంపై దీదీ స్పందించారు. కౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించిన దీదీ.. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. జర్నలిస్ట్‌లను కోవిడ్ వారియర్స్‌గా ప్రకటించారు దీదీ. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ‘‘మనం విజయం సాధించాం. ఇది బెంగాల్ ప్రజల విజయం. అయితే జనాలకు నాదొక విన్నపం. మనం శాంతియుతంగా ఉందాం. ఎన్నికల వేళ బీజేపీ, కేంద్ర బలగాలు మనలను చాలా ఇబ్బందులకు గురి చేశాయి. కానీ ఇప్పటికి కూడా మనం హింసకు పాల్పడవద్దు. మీరు ప్రశాంతంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే, పోలీసులకు నివేదించండి. వారిలో కొందరు బీజేపీ కోసం పనిచేసి ఉండవచ్చు. దాని గురించి తర్వాత ఆలోచిస్తాను. ఈ రోజు రాత్రి 7 గంటలకు గవర్నర్‌ను కలవనున్నాను’’ అన్నారు దీదీ. నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై దీదీ సందేహాలు వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘4 గంటలపాటు సర్వర్‌లో సమస్య ఉందని ఈసీ చెప్పింది. నేను గెలిచినట్లు తెలిసి గవర్నర్ అభినందనలు కూడా తెలిపారు.రీకౌంటింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని ఆర్వోను బెదిరించారు. రీ కౌంటింగ్ నిర్వహిస్తే ప్రాణాపాయం ఉందని ఆర్వో అన్నట్లు తెలిసింది.ఆర్వో రాసిన లేఖ విషయం ఒకరు నాకు ఎస్ఎంఎస్ పంపారు. అండతోనే సువేంద్ గెలిచారు’’ అని మమత ఆరోపించారు. చదవండి: గెలవలేదుకానీ.. గణనీయంగా పుంజుకున్న బీజేపీ -
Nandigram: నందిగ్రామ్.. హై టెన్షన్
కోల్‌కతా: తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తొలిసారి బరిలో నిలిచిన పశ్చి మ బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠత రేపాయి. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేంధు అధికారి మధ్య క్షణ క్షణం మారిపోతున్న ఓట్ల మెజారిటీ... మొత్తం రాష్ట్ర ఎన్నికల ఘట్టంలోనే అత్యంత ప్రధానమైనదిగా నిలిచింది. ఇద్దరు ప్రధాన పార్టీల ప్రత్యర్థుల మధ్య అటూ ఇటూ దోబూచులాడిన మెజారిటీ.. చివరకు సువేంధు అధికారిని వరించింది. మమతా బెనర్జీపై స్వల్ప ఆధిక్యంతో గెలిచినట్లు ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రకటించింది. అయితే, నందిగ్రామ్ ఫలితాలపై తాను కోర్టుకు వెళ్తానని మమతా ప్రకటించారు. అంతకుముందు ఆదివారం ఉదయం కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా కొద్దిసేపటికే సువేంధు మమత కంటే ఆధిక్యంలోకి వచ్చారు.ఆ తర్వాత సువేంధు మెజారిటీ ఏకంగా ఎనిమిది వేల దాకా వెళ్లింది. మధ్యాహ్నందాకా సువేంధుదే పైచేయి. మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా పుంజుకుని మమత ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆధిక్యత మరొకరి చెంతకు చేరింది. ఒకానొక దశలో సువేంధు కేవలం ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్లో మెజారిటీ సువేంధు, మమత మధ్య మారుతూ వచ్చింది. సువేంధు 1,200 ఓట్ల మెజారిటీలో గెలిచారని వార్తలు రాగా, ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 1,956 ఓట్ల ఆధిక్యంతో సువేంధు అధికారి గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది. త్యాగాలు తప్పవు.. ఈసీ ప్రకటనపై మమతా బెనర్జీ వెంటనే స్పందించారు. ‘‘నందిగ్రామ్‌లో ఓటమిని అంగీకరిస్తున్నాను. మరేం ఫరవాలేదు. అయితే, నందిగ్రామ్‌లో అక్రమాలు జరిగాయని విన్నాను. దీనిపై కోర్టుకు వెళతాను. మనం మొత్తం రాష్ట్రాన్నే గెలిచాం. ఇంతటి ఘన విజయం సాధించినపుడు ‘నందిగ్రామ్’లో ఓటమిలాంటి త్యాగాలు తప్పవు’’ అని ఫలితాల అనంతరం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నందిగ్రామ్‌లో రీకౌంటింగ్ జరపాలని ఈసీని టీఎంసీ కోరగా అందుకు ఈసీ నిరాకరించింది. -
నా తదుపరి పోరు దాని మీదనే: దీదీ
కోల్‌కతా: రసవత్తరంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్‌లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. బీజేపీ నాయకుడు సువేందు అధికారిపై 1200 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు దీదీ. నందిగ్రామ్ ఫలితం అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. ఇది బెంగాల్ ప్రజల విజయం అన్నారు. తనను గెలిపించిన బెంగాల్ ప్రజలకు దీదీ కృతజ్ఞతలు తెలిపారు. విజయం ముఖ్యం కాదు.. కరోనాను ఎదుర్కొవడమే ప్రధానం అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. తన తదుపరి పోరాటం కోవిడ్ మీదనే అన్నారు దీదీ. ఇక నందిగ్రామ్ బరిలో మమత కేవలం 1,200 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇక పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం టీఎంసీ 215 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 74 చోట్ల ఆధిక్యంలో ఉంది. చదవండి: మమతా మ్యాజిక్: బీజేపీ ప్రధాన కార్యదర్శి స్పందన -
దీదీ నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్: మోదీ
బర్ధమాన్: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇన్నింగ్స్ ముగిసిందని బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో సోమవారం ఆయన క్రికెట్ పరిభాషలో కాసేపు మాట్లాడారు. గడచిన నాలుగు విడతల ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఫోర్లు, సిక్సులు కొట్టారని, బీజేపీ సెంచరీ కొట్టేసిందని వ్యాఖ్యానించారు. సగం మ్యాచ్‌లోనే టీఎంసీని ప్రజలు ఊడ్చేశారన్నారు. ‘ఓటర్లు దీదీని నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్ చేశారు. బెంగాల్లో ఆమె ఇన్నింగ్స్ ముగిసింది. ఆమె మొత్తం టీమ్‌ను కూడా గ్రౌండ్ నుంచి వెళ్లిపోవాలని ప్రజలు తేల్చేశారు’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒక టీఎంసీ నాయకురాలు దళితులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలతో బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల వారిని భిక్షగాళ్లు అని ఇటీవల టీఎంసీ మహిళానేత, ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న సుజాత మోండల్ వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘దీదీ తనను తాను రాయల్ బెంగాల్ టైగర్ అని చెప్పుకుంటారు. ఆలాంటి టైగర్ అనుమతి లేకుండా పార్టీ నేత ఆ వ్యాఖ్యలు చేయగలరా? అలాంటి మాటలతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. మమత బెనర్జీ కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. క్షమాపణ చెప్పలేదు’ అన్నారు. దళితులను అవమానించి మమత పెద్ద తప్పు చేశారన్నారు. బంగ్లాదేశ్‌లో తాను మథువా సామాజిక వర్గానికి చెందిన సంస్కర్త హరిచంద్ ఠాకూర్ జన్మస్థలాన్ని సందర్శించడాన్ని మమత తప్పుబట్టారని మథువా వర్గం బలంగా ఉన్న కల్యానిలో జరిగిన సభలో ప్రధాని పేర్కొన్నారు. ఒక్కసారి అధికారం కోల్పోతే తిరిగి రాలేనన్న విషయం మమతకు అర్థమైందని వ్యాఖ్యానించారు. -
‘కాలు నొప్పి ఏమైంది దీదీ.. ఈ డ్యాన్స్ ఏంటి’
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎలాగైనా సరే రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ చూస్తుంటే.. కాషాయ పార్టీని బెంగాల్ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదనే కృత నిశ్చయంతో ఉన్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ‘‘బీజేపీ మీద తిరుగలేని పోరాటం చేసే ఏకైక వ్యక్తి దీదీ. అలాంటి మమతా కూడా ఈ సారి భయపడ్డారు.. అందుకే ఆమెకు అలవాటు లేని పనులు చేస్తున్నారు’’ అనే మాటలు వినిపిస్తున్నాయి. నందిగ్రామ్‌లో నామినేషన్ వేసి తిరిగి వస్తుండగా మమతకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తనపై దాడి జరిగిందని దీదీ ఆరోపిస్తుండగా.. జనం పెద్ద ఎత్తున రావడంతోనే ఆమెకు ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. ఇక నాటి నుంచి మమత వీల్ చైర్లోనే కనిపిస్తున్నారు. ఈ విషయం ఆమెను అభిమానించే వారికి నచ్చడం లేదు. కాళికలా ఉండే మమతా ఇలా సానుభూతి కోసం ప్రయత్నించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇలా చర్చ జరుగుతుండగానే తాజాగా మమతా బెనర్జీకి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ట్విట్టర్లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. మమతా రెండు కాళ్లను వెనకకు, ముందుకు ఆడిస్తూ రిలాక్స్ అవుతున్నారు. ప్రమాదంలో కట్టుకట్టిన కాలును కూడా చాలా సింపుల్‌గా కదిలిస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత బీజేపీ నాయకులు దీదీని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. ‘‘కాలుకి దెబ్బ తగిలింది.. కుట్రపూరితంగానే నాపై దాడి చేశారని ఆరోపించావ్.. మరి ఇదేంటి దీదీ’’ అని ప్రశ్నిస్తున్నారు. ‘‘డ్రామాలు ఆపేయ్.. జనాలకు నీ గురించి తెలిసిపోయింది... సింపతీ కోసం ఎంత ప్రయత్నించినా వృథా’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. టీఎంసీ చెత్త రాజకీయాలకు నిదర్శనం ఈ వీడియో అంటూ విమర్శిస్తున్నారు బీజేపీ నాయకులు. చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన -
నేనేం బీజేపీలో లేను
దిన్హట/నాటాబరి: నందిగ్రామ్‌లో తన విజయం ఖాయమని, వేరే స్థానం నుంచి పోటీ చేయమని ప్రధాని నరేంద్రమోదీ తనకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో మమత ఓడిపోబోతున్నారని, అందుకే ఆమె వేరే స్థానం నుంచి కూడా పోటీ చేస్తారేమోనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ముందు మీ పార్టీకి చెందిన హోం మంత్రిని కంట్రోల్ చేయండి. నన్ను నియంత్రించేందుకు, నాకు సలహా ఇచ్చేందుకు నేనేం మీ పార్టీ మెంబర్‌ను కాదు’ అని మమత జవాబిచ్చారు. మమత శుక్రవారం ప్రచారంలో పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్లో ఎన్నికలను నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం కాదని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘200 స్థానాల్లో టీఎంసీ గెలవాలి. లేదంటే ఎమ్మెల్యేలుగా గెల్చిన కొందరు ద్రోహులను బీజేపీ వాళ్లు కొనేస్తారు’ అని హెచ్చరించారు. మెజారిటీ భారీగా లేకపోతే తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే అవకాశముందని మమత పరోక్షంగా వ్యాఖ్యానించడం విశేషం. ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగని బలమైన వారు టీఎంసీ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా ఉండాలని సూచించారు. తమిళనాడులో అమిత్ షా ఆదేశాల మేరకు డీఎంకే చీఫ్ స్టాలిన్ బంధువులు, ఇతర నాయకుల ఇళ్లపై ఆదాయ పన్ను దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. -
ఆమె పులిలా పోరాడింది
ముంబై: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పులిలా పోరాడిందని, ఆమె విజేతగా అవతరించడం ఖాయమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గురువారం ముంబైలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పుడు జరగబోయే కేరళ, తమిళనాడు, అస్సాం, బెంగాల్ (నాలుగు రాష్ట్రాల) ఎన్నికలు జాతీయ రాజకీయాలను నిర్ణయిస్తాయని ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని అన్నారు. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉందని, అయితే కాంగ్రెస్ గట్టిగా పోరాటం చేసిందని ప్రశంసించారు. మమతా బెనర్జీ లేఖపై మీడియా ప్రశ్నించినపుడు సీఎం ఉద్ధవ్‌కు కూడా లేఖ వచ్చిందని, ఎన్నికల తర్వాత పొత్తులపై చర్చించే అవకాశం ఉందన్నారు. ఇక పశ్చిమబెంగాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు నిజమైన మహాభారతం కంటే భయంకరంగా ఉన్నాయని రౌత్ ఆందోళన వ్యక్తంచేశారు. బెంగాల్ ఎన్నికలను దేశం మొత్తం పరిశీలిస్తోందని, ప్రజలు కూడా తెలివైనవారేనని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల సంజయ్‌పై బాలాసాహెబ్ థోరాట్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. యూపీఏ నాయకత్వాన్ని సోనియా నుంచి శరద్ పవార్‌కు అప్పగించాలని అనలేదని, కేవలం యూపీఏను గాడిలో పెట్టాలనే వ్యాఖ్యానించానని ఎంపీ స్పష్టంచేశారు. -
నందిగ్రామ్‌లో స్వల్ప ఘర్షణలు
నందిగ్రామ్/గువాహటి: పశ్చిమబెంగాల్లో గురువారం జరిగిన రెండో దశ ఎన్నికల్లో స్వల్పంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్రమాలు జరిగాయని, కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆరోపించారు. ఆమె బరిలో నిలిచిన నందిగ్రామ్‌లో గురువారం పోలింగ్ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు నందిగ్రామ్ నియోజకవర్గంలో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు బీజేపీకి ఓట్లు పడేలా సహకరించాయని మమత పేర్కొన్నారు. ఎన్నికల సంఘం టీఎంసీ, ఇతర పార్టీల ఫిర్యాదులపై స్పందించడం లేదని, అమిత్ ఆదేశాలనే పాటిస్తోందన్నారు. తన ఆందోళన అంతా ప్రజాస్వామ్యంపై బీజేపీ చేస్తున్న దాడి గురించేనని ఆమె వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ, ఆమె ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పలు పోలింగ్ బూత్‌లకు వెళ్లి, ఓటింగ్ సరళిని పరిశీలించారు. నందిగ్రామ్‌లో విజయం తనదేనని, ఇక్కడి ప్రజలంతా తనవారేనని, గ్రామాలకు, గ్రామాలే బీజేపీకి ఓటేశాయని సువేందు అధికారి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 స్థానాల్లో జరిగిన రెండో దశలో ఎన్నికల్లో కూడా 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదయింది. సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలో 80.53% ఓటింగ్ నమోదయిందని ఈసీ వెల్లడించింది. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోందని, తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని మమత బెనర్జీ ఆరోపించారు. ‘ఉదయం నుంచి 63 ఫిర్యాదులు చేశాం. ఏ ఒక్క ఫిర్యాదు పైనా చర్యలు తీసుకోలేదు. అమిత్ షా ఆదేశాలను మాత్రమే ఈసీ పాటిస్తోంది. దీనిపై మేం కోర్టుకు వెళ్తాం. వేరే రాష్ట్రాల నుంచి గూండాలను తీసుకువచ్చి గందరగోళం చేస్తున్నారు’ అని బోయల్లో బూత్ నెంబర్ 7 బయట కూర్చున్న మమతా పేర్కొన్నారు. బీజేపీ గూండాలు బూత్‌ల స్వాధీనానికి, దొంగ ఓట్లకు పాల్పడుతున్నారన్నారు. టీఎంసీ తరఫున ఏజెంట్లుగా ఉండవద్దని గత రాత్రి తమ పోలింగ్ ఏజెంట్లను బీజేపీ నాయకులు బెదిరించారని మమత ఆరోపించారు. బోయల్లో తమ ఓట్లను వేయనీయడం లేదని పలువురు ఓటర్లు, టీఎంసీ కార్యకర్తలు ఆమెకు ఫిర్యాదు చేయడంతో, ఆ బూత్ వద్ద ఆమె దాదాపు రెండు గంటల పాటు కూర్చున్నారు. బోయల్‌కు మమత చేరుకోగానే అక్కడి బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. టీఎంసీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. దీనిపై గవర్నర్ జగదీప్‌కు ఫోన్ చేసి మమత ఫిర్యాదు చేశారు. కేంద్ర బలగాలు తమను పోలింగ్ బూత్‌లకు వెళ్లనివ్వడం లేదని ఆరోపిస్తూ నందిగ్రామ్ బ్లాక్ 1 రోడ్డును టీఎంసీ కార్యకర్తలు దిగ్బంధించారు. సువేందు అధికారి కారుపై కొందరు దాడి చేశారు. టాకాపుర, సతేంగబరిల్లో ఆయనపై రాళ్లు రువ్వారు. కేశ్పూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తన్మయ్ ఘోష్ కారును కొందరు ధ్వంసం చేశారు. నందిగ్రామ్ ఘటనలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. అక్కడ మమత బెనర్జీ ఓడిపోతున్నారని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పోలింగ్‌ను అడ్డుకోలేదు నందిగ్రామ్‌లో పోలింగ్ బూత్ నెంబర్ 7లో పోలిం గ్ సక్రమంగా కొనసాగిందని, అక్కడ ఎవ రూ ఓటర్లను అడ్డుకోలేదని ఎన్నికల సంఘం స్ప ష్టం చేసింది. ఈ మేరకు తమకు ఎన్నికల ప్రత్యేక పరిశీలకుల నుంచి సమాచారం అందిందని పేర్కొంది. అస్సాంలో.. అస్సాంలో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 39 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల వరకు 77.21% ఓటింగ్ నమోదయింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వెంటనే వాటిని మార్చారు. దాదాపు అన్ని బూత్‌ల్లో ఓటర్లు కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. మమత వచ్చిన పోలింగ్ కేంద్రం వద్ద వ్యతిరేక నినాదాలు చేస్తున్న గ్రామస్తులు -
దీదీ మరో చోట పోటీ చేస్తున్నారా?
జెయ్‌నగర్/ఉలుబేరియా: పశ్చిమ బెంగాల్ అంతటా బీజేపీ ప్రభంజనం కనిపిస్తోందని, అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను 200కుపైగా సీట్లు సొంతం చేసుకోబోతున్నామని ప్రధాని∙మోదీ తేల్చిచెప్పారు. ఆయన గురువారం బెంగాల్‌లోని జెయ్‌నగర్, ఉలుబేరియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మే 2వ తేదీన మమతా బెనర్జీ గద్దె దిగడం ఖాయమని మోదీ స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం బాటలు పరుస్తున్నారని చెప్పారు. ‘గోడలపై రాసిన రాతలు చదవండి. బెంగాల్ ప్రజలు మిమ్మల్ని శిక్షించబోతున్నారు’ అని మమతనుద్దేశించి వ్యాఖ్యానించారు. నందిగ్రామ్‌లో పరాజయం తప్పదని తేలడంతో చివరి దశ ఎన్నికలు జరిగే స్థానం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేయాలని మమత నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయని, అవి నిజమో కాదో చెప్పాలన్నారు. ఎక్కడికి వెళ్లినా దీదీకిఓటమి తప్పదన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలు ఆమెకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బెంగాల్లో ఇటీవలే బీజేపీ కార్యకర్త తల్లిని దారుణంగా హత్య చేశారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఘోరం జరిగిన తర్వాత ప్రజలు కూల్‌గా ఉండాలని మమత చెబుతున్నారని, టీఎంసీ నేతలు, కార్యకర్తలు శూల్‌గా(శూలం) మారి ప్రజలను బాధిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అక్రమంగా వలస వచ్చినవారు మీకు సొంత మనషులు. స్వదేశంలోని ప్రజలను బయటివాళ్లు, టూరిస్టులు అంటారా? సొంత ప్రజలపై వివక్ష చూపడం మానుకోండి’ అని హితవు పలికారు. చేసిన ప్రమాణం మరిచారా? బిహార్, ఉత్తరప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ విమర్శలు చేయడం దారుణమని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం చేసిన ప్రమాణం ఇలాంటి విమర్శలను అనుమతించదని గుర్తుచేశారు. భవానీపూర్ అసెంబ్లీ స్థానాన్ని విడిచిపెట్టి, నందిగ్రామ్‌ను ఎంచుకోవడం ద్వారా పెద్ద తప్పు చేశానన్న నిజాన్ని మమతా బెనర్జీ గ్రహించారని చెప్పారు. నందిగ్రామ్‌లో దీదీకి ఓటమి తప్పదన్నారు. ఆమెకు బెంగాల్ అనేది ఒక ఆట స్థలమని, బీజేపీకి అభివృద్ధి, విద్యా, పరిశ్రమల మైదానం కాబోతోందని వ్యాఖ్యానించారు. జైశ్రీరామ్‌ను సహించలేదు అవసరం కొద్దీ ప్రదర్శించే కాలానుగుణ విశ్వాసాలపై తనకు విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. ‘జైశ్రీరామ్ అని నినదిస్తే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహించలేదు. దుర్గా విగ్రహాల నిమజ్జనాలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు కాషాయం బట్టలు, నుదుటిపై తిలకం ధరించడం, పిలక పెంచుకోవడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరాలున్నాయి. అలాంటి వారిని రాక్షసులుగా సంబోధిస్తోంది’’ అని విమర్శించారు. తాను ఇటీవల బంగ్లాదేశ్ పర్యటించడం, అక్కడి దేవాలయాలను సందర్శించడం ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించడమే అవుతుందంటూ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. జిశోరేశ్వరి కాళీ మందిరాన్ని సందర్శించడం, శ్రీహరిచంద్ ఠాకూర్‌కు నివాళులర్పించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మన నమ్మకాలు, సంప్రదాయాలను తాము గర్వకారణంగా భావిస్తామని అన్నారు. మీనాక్షి ఆలయంలో మోదీ మోదీ గురువారం తమిళనాడులోని, మదురైలో ఉన్న ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధానికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ చొక్కా, ధోవతి, అంగవస్త్రం ధరించి ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నేడు మదురై, కన్యాకుమారిల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికలోనూ బీజేపీ పోటీ చేస్తోంది. గెలుపు మమతదే: తృణమూల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో కచ్చితంగా ఓడిపోతారని, అందుకే మరో స్థానాన్ని వెతుక్కుంటున్నారని ప్రధాని మోదీ చేసిన విమర్శలపై తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు స్పందించాయి. నందిగ్రామ్‌లో దీదీ ఓడిపోయే ప్రసక్తే లేదని, మరో స్థానం నుంచి పోటీ చేసే ప్రశ్నే లేదని ప్రకటించాయి. -
ముగిసిన నందిగ్రామ్ పోరు
మొత్తానికి కొన్ని చెదురుమదురు ఘటనలతో పశ్చిమబెంగాల్లోని రెండో దశ పోలింగ్ గురువారం ముగిసింది. ఇతర నియోజకవర్గాల మాటెలావున్నా రెండో దశలో అందరి కళ్లూ నందిగ్రామ్‌పైనే వున్నాయి. మూడు దశాబ్దాలక్రితమే ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌తో దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరి ఊహలకూ భిన్నంగా ఆ ఒక్క స్థానాన్నే ఎంచుకుని పోటీ చేస్తుండటం ఇందుకు కారణం. అక్కడ పోలైన ఓట్ల శాతం 80 శాతం పైగా వుందంటే పోరాటం ఎంత హోరాహోరీగా సాగిందో అర్థమవుతుంది. ఎనిమిది దశల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో గత నెల 27న 30 స్థానాలకు తొలి దశ పూర్తయింది. రెండో దశలో గురువారం నందిగ్రామ్తోసహా 30 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. నందిగ్రామ్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నిటినీ మమత చక్రాల కుర్చీలో స్వయంగా సందర్శించటం, తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను అనుమతించటంలేదని ఆరోపణలొచ్చినచోట ఎన్నికల అధికారులను కదిలించి పరిస్థితి చక్కదిద్దటం మాత్రమే కాదు... సాధారణ ఓటర్లను బీజేపీ అడ్డగిస్తున్నదని ఆరోపణలొచ్చిన బోయల్ పోలింగ్ కేంద్రం దగ్గర రెండు గంటలపాటు వుండి పర్యవేక్షించటం గమనిస్తే ఆమె పట్టుదలేమిటో అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో మమత అంతా తానై పోరాడారు. రాష్ట్రంలో ఆమెతో సరితూగగలిగినవారు ఎవరూ లేరనే చెప్పాలి. అందుకే బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతోసహా అతిరథ మహారథులను బీజేపీ మోహరించింది. నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి సొంత నియోజకవర్గం కావటం, ఆయన నిన్న మొన్నటివరకూ తృణమూల్‌లో కీలక నేతగా వుండటం కారణంగా అక్కడి ఓటర్లు ఎటు మొగ్గాలో తేల్చుకోవటానికి చాలానే కష్టపడివుంటారు. పంట భూములను అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు 2007లో సాగించిన పోరులో సువేందు కీలకపాత్ర పోషిం చారు. అప్పట్లో రైతులకు సన్నిహితుడయ్యారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన బాగా పాటుబడ్డారని చెబుతారు. అందుకే ఆయన్ను పార్టీలో వుంచటానికి మమత శత విధాల ప్రయత్నించారు. ఆయన తమ వైపు మొగ్గు చూపకపోతే బీజేపీ బహుశా ఇంత హోరాహోరీ పోరాటానికి సిద్ధపడేది కాదు. అధికారానికి రాబోయేది తామే అన్నంత హడావుడి చేసేది కాదు. ఆ స్థాయిలో బీజేపీ హడావుడి చేయకుంటే మమత సైతం అంత పట్టుదలగా తన సొంత నియో జకవర్గాన్ని వదిలి నందిగ్రామ్‌కు కదిలివచ్చేవారు కాదు. ఏమైతేనేం అగ్నికి వాయువు తోడైనట్టు బీజేపీ–సువేందుల కాంబినేషన్ బెంగాల్ ఎన్నికలపై ఉత్కంఠను అనేక రెట్లు పెంచితే... సువేందుతో తాడో పేడో తేల్చకోవటానికి మమత రావటం నందిగ్రామ్‌కు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చింది. మమత రాకపోయివుంటే ఆ స్థానం నిస్సందేహంగా సువేందు సొంతమే. ఆ సంగతలావుంచి రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి మమత మొదటగా తనను తాను నిందించుకోవాలి. సీపీఎం శ్రేణులు తమ పార్టీవారిని బతకనీయటం లేదని, వారు తమిళనాడు వంటి దూరప్రాంతాలకు పోయి జీవనం సాగించవలసివస్తోందని లెఫ్ట్ ఫ్రంట్ హయాంలో మమత ఆరోపించేవారు. కానీ అధికార పీఠం అందుకున్నాక తమ పార్టీ శ్రేణులపైనా అలాంటి ఆరోపణలే వస్తున్నాయని గుర్తించలేకపోయారు. అవి ఏ స్థాయికి చేరాయంటే ఒకప్పటి వామపక్షాల కార్యకర్తలు తమకెదురవుతున్న వేధింపులు భరించలేక బీజేపీని ఆశ్రయించాల్సివచ్చింది. తమకు మినహా వేరెవరికీ పునాదులు లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే తృణమూల్ ఈ పని చేస్తోందని ప్రత్యర్థి పార్టీలు చాన్నాళ్లుగా ఆరోపిస్తు న్నాయి. సంక్షేమంతో, అభివృద్ధితో ప్రజానీకం ఆదరాభిమానాలు పొంది ప్రత్యర్థుల్ని అధిగమిం చటం వేరు... ఫిరాయింపులతో, బెదిరింపులతో దాన్ని సాధించాలనుకోవటం వేరు. ప్రత్యర్థి పార్టీ లకు పునాది లేకుండా చేయటానికి రెండో మార్గాన్ని ఎంచుకుంటే, ఆ ఖాళీ నింపేందుకు మరొక పార్టీ రంగం మీదికొస్తుంది. తృణమూల్ అధికారంలోకి రావటంలో కీలకపాత్ర పోషించిన నందిగ్రామ్ ఉద్యమంలో పాల్గొన్నవారికీ, అప్పట్లో జాడతెలియకుండా పోయినవారి కుటుంబాలకూ 14 ఏళ్ల తర్వాతగానీ ఆర్థిక ఆసరా కల్పించలేకపోవటం తృణమూల్ పాలన తీరుకు అద్దం పడుతుంది. కనుక రాష్ట్రంలో బీజేపీ బలపడటం వెనకున్న కారణాలేమిటో మమత ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంటుంది. సాగుతున్న పాలనపై తమ మనోభీష్టాన్ని వ్యక్తం చేయటానికీ, సమర్థవంతులైన ప్రతినిధులను ఎంచుకోవటానికీ ఎన్నికలను ప్రజలు ఒక సందర్భంగా భావిస్తారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఆ ఎన్నికలు కాస్తా వైరి వర్గాల బలప్రదర్శనలుగా మారుతున్నాయి. పరస్పర దూష ణలకు వేదికలవుతున్నాయి. మద్యం, డబ్బు ప్రవహించటం... డాబూ దర్పం చూపటం, సవాళ్లు, ప్రతి సవాళ్లతో సాధారణ ప్రజానీకంలో అనవసర ఉద్రిక్తతలు సృష్టించటం మినహా ఎన్నికలు సాధి స్తున్నదేమీ వుండటం లేదు. పార్టీల మేనిఫెస్టోల్లో సాగు సంస్కరణలు, పెట్రో ధరల పెంపు వంటివి కనబడవు. ఇతరేతర అంశాల ఆసరాతో గద్దెనెక్కాక అవన్నీ జనంమీద స్వారీ చేస్తాయి. ఈ పరిస్థితి మారితేనే ఎన్నికలు అర్ధవంతమవుతాయి. అందులో అసలైన ప్రజాభీష్టం వ్యక్తమవుతుంది. -
బెంగాల్, అస్సాం రెండో విడత పోలింగ్
కోల్‌కతా/గువాహటి: పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బెంగాల్లో 37.42 శాతం, అసోంలో 33.24 శాతం పోలింగ్ నమోదైంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఎనిమిది విడతల్లో, 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి 27న తొలి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బెంగాల్లో రెండో విడతలో 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. 171 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 75,94,549 మంది ఓటర్లు వారి భవితవ్యం నిర్ణయించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో 10,620 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ ఓటింగ్ జరిగే అన్ని ప్రాంతాలను సున్నితమైనవిగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అస్సాంలో.. రెండో దశలో ఎన్నికలు జరగనున్న 39 స్థానాల్లో మొత్తం 345 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ 34 సీట్లలో, మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్ 6 స్థానాల్లో, యూపీపీఎల్ 3 సీట్లలో పోటీ చేస్తున్నాయి. రెండు స్థానాల్లో బీజేపీ, ఏజీపీ మధ్య, రెండు స్థానాల్లో బీజేపీ, యూపీపీఎల్ మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొని ఉంది. మహా కూటమి నుంచి కాంగ్రెస్ 28 సీట్లలో, ఏఐయూడీఎఫ్ 7 స్థానాల్లో, బీపీఎఫ్ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన అస్సాం జాతీయ పరిషత్ 19 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. 25 స్థానాల్లో ఎన్డీయే, మహా కూటమి మధ్య ద్విముఖ పోటీ నెలకొన్నది. ఈ రెండో దశ ఎన్నికల బరిలో ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. ఈ రెండో దశ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో నిలిచిన నందిగ్రామ్ నియోజకవర్గంపైననే అందరి దృష్టి ఉంది. మమతను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ అగ్ర నేతలు ఈ స్థానంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.మమతకు పోటీగా ఒకప్పటి ఆమె విశ్వసనీయ సహచరుడు, టీఎంసీ నుంచి బీజేపీలోకి వచ్చిన సువేందు అధికారిని బీజేపీ పోటీలో నిలిపిన విషయం తెలిసిందే. బెంగాల్లో 30 స్థానాలకు గానూ మొత్తం 191 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 75 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 10,620 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం నిర్ధారించి, ఆయా బూత్‌ల వద్ద అదనపు బలగాలను నిలిపింది. తూర్పు మెదినీపుర్(9), పశ్చిమ మెదినీపుర్(9), దక్షిణ 24 పరగణ(4), బంకురా(8) జిల్లాల్లో ఈ రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. టీఎంసీ, బీజేపీలు మొత్తం 30 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. సీపీఎం 15, కాంగ్రెస్ 13, ఐఎస్ఎఫ్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రెండో దశ ఎన్నికలు జరుగుతున్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించారు. కాలికి గాయమైన ఆమె వీల్చెయిర్పైననే ఈ ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రచారంలో అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు. చదవండి: భారీ పోలింగ్ మా విజయానికి సంకేతం నందిగ్రామ్‌లో దీదీ ఓటమి తథ్యం: సర్వే -
బీజేపీ నియంతృత్వాన్ని ఎదిరిద్దాం
న్యూఢిల్లీ/నందిగ్రామ్: బీజేపీ, ఆ పార్టీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై, సమాఖ్య స్ఫూర్తిపై వరుస దాడులు చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. స్వాతంత్య్రం తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత దిగువకు దిగజారాయని పేర్కొన్నారు. బీజేపీ నియంతృత్వంపై కలసికట్టుగా పోరాడుదామని విపక్ష నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీల నేతలకు ఆమె రాసిన లేఖను బుధవారం టీఎంసీ విడుదల చేసింది. ‘ఈ లేఖను మీతో పాటు దేశంలోని బీజేపీయేతర పార్టీల నాయకులకు రాస్తున్నాను. ప్రజాస్వామ్యంపై, సమాఖ్య విధానంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వరుస దాడులకు పాల్పడుతోంది. ఇది చాలా ఆందోళనకర అంశం. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాల్సిన, ఒక ప్రత్యామ్నాయ వేదికను ప్రజలకు అందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహా విపక్ష నాయకులకు రాసిన లేఖలో మమత పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ)కి అపరిమిత అధికారం, ఢిల్లీ ప్రభుత్వమంటే ఎల్జీనే అని స్పష్టం చేసే చట్టంపై లేఖలో మమత మండిపడ్డారు. ‘ఆ చట్టంతో ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం అధికారాలను లాగేసుకుంది. ఆ అధికారాలను తన ప్రతినిధి అయిన ఎల్జీ చేతిలో పెట్టింది. ఎల్జీని అప్రకటిత ఢిల్లీ వైస్రాయ్గా మార్చింది’ అని మమత వివరించారు. ఢిల్లీలో 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ప్రజా తీర్పును బీజేపీ అంగీకరించడం లేదన్నారు. ఆ చట్టం భారతదేశ సమాఖ్య విధానంపై జరిపిన ప్రత్యక్ష దాడి అని ఆమె అభివర్ణించారు. సోనియాతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, బీజేడీ నాయకుడు నవీన్ పట్నాయక్, నేషనల్ కాన్ఫెరెన్స్‌కు చెందిన ఫారూఖ్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా, సీపీఐఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్యలకు మమత ఈ లేఖను పంపించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని విమర్శించారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల అమలును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రాలు తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువచ్చే జాతీయ అభివృద్ధి మండలి, అంతర్రాష్ట్ర మండలి, ప్రణాళిక సంఘం... తదితర వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను మున్సిపాలిటీల స్థాయికి కుదించాలని, దేశంలో ఏకపార్టీ అధికార వ్యవస్థ కోసం కుట్ర పన్నుతోందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. అక్రమ మార్గాల ద్వారా సేకరించిన నిధులను రాష్ట్రాల్లో విపక్ష పార్టీలను అధికారంలో నుంచి కూలదోయడానికి, బీజేపీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని, వాటిని ప్రైవేటు పరం చేయాలన్న బీజేపీ ఆలోచన నిర్లక్ష్యపూరితమైందని విమర్శించారు. బీజేపీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి రావాలని బీజేపీయేతర పార్టీల నాయకులను ఆమె కోరారు. కలిసికట్టుగా పోరాడితేనే విజయం సాధించగలమని, ఈ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ విషయంలో ఒక కార్యాచరణ రూపొందించే విషయమై చర్చిద్దామని ఆమె ప్రతిపాదించారు. మమత లేఖపై బీజేపీ స్పందించింది. మమత డిక్షనరీలో లేని పదమే ప్రజాస్వామ్యమని వ్యాఖ్యానించింది. మమత ప్రతిపాదనకు పీడీపీ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నుంచి మద్దతు లభించింది. కోట్లు కుమ్మరిస్తున్నారు ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ నేతలు కోట్ల రూపాయలను ఓటర్లకు పంచిపెడ్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఓటర్లను భయపెట్టేందుకు యూపీ, బిహార్ రాష్ట్రాల నుంచి గూండాలను దింపుతున్నారన్నారు. బీజేపీ నేతలు ఇదంతా బహిరంగంగా చేస్తోంటే.. ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. నందిగ్రామ్‌లో తనపై దాడి చేసిన వారి వివరాలు తెలిశాయని, ఎన్నికల తరువాత ఆ విషయం చూస్తానని పేర్కొన్నారు. మరోవైపు, మమత బెనర్జీపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఆమె బెదిరిస్తున్నారని ఆరోపించారు. -
నందిగ్రామ్‌లో దీదీ ఓటమి తథ్యం: సర్వే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశ పూర్తైన సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనున్నాయి. ఈ ఎన్నిక పట్ల బెంగాల్ వాసులతో పాటు దేశప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెండో దశ పోలింగ్‌లో మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో కూడా ఓటింగ్ జరగనుంది. పార్టీ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్‌లో మమతతో తలపడనున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ సంగతి పక్కకు పెడితే గత రెండు మూడు రోజులుగా నందిగ్రామ్ ఫలితాలకు సంబంధించి రెండు, మూడు సర్వేలు బెంగాల్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీటి సారాంశం ఏంటంటే మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఘోర పరాజయం చవి చూడబోతున్నారు. సువేందు దీదీని దారుణంగా ఓడించబోతున్నాడని సర్వేలు తెలిపాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సర్వేలన్నింటిని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ పాక్ నిర్వహించిందనే వార్తలు జనాలను మరింత ఆశ్చర్యచకితులను చేశాయి. ఈ క్రమంలో ఐ పాక్ సంచలన ప్రకటన చేసింది. తమ సంస్థ నిర్వహించినట్లు చెప్పుకుంటున్న సదరు సర్వే ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐపాక్ ‘‘గత కొద్ది రోజులుగా నందిగ్రామ్ ఓటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సర్వే ఫేక్. బీజేపీ నాయకులు, వారి హామీల్లానే ఈ సర్వే కూడా అవాస్తవం. ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్‌ను ప్రచారం చేసి జనాలను ప్రభావితం చేయాలని భావిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. అసలు ఐ పాక్ డెస్క్ టాప్‌లను వినియోగించదు.. మరింత స్మార్ట్‌గా ఆలోచించండి’’ అంటూ ట్వీట్ చేసింది. Facing imminent defeat, @BJP4Bengal has now gone down to the level of using FAKE surveys in the name of I-PAC to keep the morale of their workers up!! P.S: In I-PAC, no one uses desktops so at-least be smart in your effort to create fake survey / reports! 😉🤣 pic.twitter.com/lFaOo0DshU — I-PAC (@IndianPAC) March 31, 2021 చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన -
కేంద్ర బలగాల అదుపులో నందిగ్రామ్: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: నందిగ్రామ్ ఈ పేరు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు మెదలైనప్పటి నుంచి ఎదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ, మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో కీలకంగా మారిన నందిగ్రామ్.. 14 ఏళ్ల తర్వాత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్ తరువాత ఇప్పుడు అందరి దృష్టి నందిగ్రామ్‌పైనే ఉంది. అంత కీలకం కాబట్టే ఎలక్షన్ కమీషన్ కేంద్ర బలగాలతో పోలింగ్ రోజున ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా తమ అదుపులో ఉంచనున్నట్లు తెలిపింది. ఎన్నికల రోజైన ఏప్రిల్ 1న 22 కేంద్ర బలగాల కంపెనీల సిబ్బందితో పాటు, 22 క్యూఆర్టి టీం (అత్యవసరంగా స్పందించే కూటమి) నందిగ్రామ్‌లో విధులు నిర్వహించబోతున్నారు. వీరు పోలింగ్ ప్రదేశాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించడమే ప్రధాన ఎజెండాగా పని చేయనున్నట్లు ఈసీ తెలిపింది. కంపెనీగా పిలువబడే ఈ కేంద్ర బలగాలలో 100 మంది సిబ్బంది ఉంటారు. అదనంగా కోల్‌కత్తాలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయంలోని ఒక ప్రత్యేక బృందం కూడా నందిగ్రామ్ పరిస్థితిని పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. నందిగ్రామ్‌కు సంబంధించి మొత్తం 355 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి, వాటిలో 75 శాతం కేంద్రాలకు వెబ్‌కాస్టింగ్ సౌకర్యాన్నిఏర్పాటు చేశారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాలన్ని దీని ద్వారా నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. నందిగ్రామ్‌లో ఎక్కడ కూడా హింసకు తావులేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరగడం కోసం అన్నిఏర్పాట్లను పూర్తి చేసినట్లు కమీషన్ అధికారి తెలిపారు. ఎందుకు నందిగ్రామ్‌కే ఇంత భద్రత చాలా సంవత్సరాల పాటు మమతకు కుడిభుజంగా ఉన్న సుబేందు ఒక్కసారిగా ప్లేటు మార్చేసి బీజేపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఫిరాయించిన సుబేందు ఊరికే ఉండకుండా ధైర్యముంటే తనపై నందిగ్రామ్ నుంచి పోటీచేసి గెలవాలంటు మమతకు సవాలు విసిరారు. మామాలుగానే మమత ఫైర్ బ్రాండ్‌గా పేరుంది, దీంతో ఈ సవాలును స్వీకరించడంతో నందిగ్రామ్ ప్రతిష్టాత్మకంగా మారింది. సుబేందు కుటుంబానికి నందిగ్రామ్ చుట్టుపక్కలున్న దాదాపు 40 నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. ఇంతటి సుబేందే ఓడిపోతే బీజేపీకి దిక్కెవరు ? అసలు సుబేందు కుటుంబాన్ని చూసుకునే నరేంద్రమోడి, అమిత్ బెంగాల్లో మమతపై రెచ్చిపోతున్నారు. ఎలాగైనా నందిగ్రామ్ గెలిచి తన సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోంది. రెండోదశ ఎన్నికలో నందిగ్రామ్ కూడా ఉండటంతో పోలింగ్ అయ్యేవరకు మమత ఈ నియోజకవర్గంలోనే క్యాంపువేశారు. ప్రస్తుతం ఒకవైపు కేంద్రబలగాలు మరోవైపు రాష్ట్ర పోలీసులు నియోజకవర్గం మొత్తం దిగేశారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న ఈ వార్ లో విజయంతో ఎవరిదో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ( చదవండి : West Bengal Election 2021: ‘నందిగ్రామ్’ పోరు రసవత్తరం ) -
West Bengal Election 2021: ‘నందిగ్రామ్’ పోరు రసవత్తరం
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ, మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో కీలకంగా మారిన నందిగ్రామ్.. 14 ఏళ్ల తర్వాత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్ తరువాత ఇప్పుడు అందరి దృష్టి నందిగ్రామ్‌పైనే ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 1న రాష్ట్రంలో జరిగే రెండో దశ ఎన్నికలలో బంకురా, పశ్చిమ మేదినీపూర్, తూర్పు మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల పరిధిలోని నాలుగు జిల్లాలలో కలిపి 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరుగనుంది. ఈ దశలో హాట్ టాపిక్‌గా మారిన నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్‌లోనే మకాం వేసిన సువేందును ఢీకొట్టేందుకు టీఎంసీ అభ్యర్థి, సీఎం మమతా బెనర్జీ సోమ, మంగళవారాల్లో రెండు రోజుల వ్యవధిలో 6 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉన్న బెనర్జీ నందిగ్రామ్‌లో ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సువేందు అధికారి తరఫున కమలదళం తరపున హోం మంత్రి అమిత్ షా మంగళవారం భారీ రోడ్‌షో నిర్వహించారు. పరస్పరం తీవ్ర ఆరోపణలు ఏప్రిల్ 1వ తేదీన పోలింగ్ జరుగబోయే నందిగ్రామ్‌లో ప్రచారపర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. నందిగ్రామ్‌లో పోటీ చేస్తున్న మమతా బెనర్జీని కనీసం 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని, లేనిపక్షంలో రాజకీయాలను విడిచి పెడతానని సువేందు అధికారి ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఒక ర్యాలీలో సువేందు, అతని తండ్రి శిశిర్, సోదరుడు సౌమేందులు విషసర్పాలుగా మారుతారనే విషయం తనకు అర్థం కాలేదని దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీలకంగా ఆ ముగ్గురు నేతలు నందిగ్రామ్‌లో సువేందు హిందుత్వ ఎజెండాతో హిందూ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా దూసుకెళ్తుండగా, మమతా బెనర్జీ తన అభివృద్ధి పనులతో పాటు, అధికారి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జనాభాలో 30 శాతం ఉన్న ముస్లిం ఓట్లు తమకే పడతాయని దీదీ నమ్మకంతో ఉన్నారు. 2016లో టీఎంసీ టికెట్‌తో 68 వేల ఓట్లతో సువేందు గెలిచారు. అయితే పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో బీజేపీ, టీఎంసీలు స్థానికంగా పేరున్న నాయకులు సుఫియాన్ షేక్, అబూ తాహెర్, మేఘనాథ్ పాల్‌లకు సంబంధించిన సమస్యలపై పోరాడుతున్నాయి. ఒక సమయంలో ఈ ముగ్గురు నాయకులు సువేందుకు చాలా దగ్గరగా ఉండేవారు. మారిన పరిణామాల నేపథ్యంలో అబూ తాహెర్, సుఫియాన్ షేక్ మమతా బెనర్జీకి అండగా నిలబడగా, మేఘనాథ్ పాల్ సువేందుతో కొనసాగుతున్నారు. అయితే సువేందుకు వీరిద్దరు దూరమైన తర్వాత తాహెర్, షేక్‌లపై కొనసాగుతున్న కేసులపై దర్యాప్తు జరపాలంటూ ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు మేఘనాథ్ పాల్ ఇంట్లో సువేందు గుండాలు దాక్కున్నారని ఆరోపిస్తూ టీఎంసీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురు స్థానిక నాయకులు నందిగ్రామ్‌లో ఎవరు గెలవాలన్న అంశంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తారు. ఉద్ధండులు వర్సెస్ ఫైర్‌బ్రాండ్ మరోవైపు ఇద్దరు ఉద్ధండులను ధీటుగా ఎదుర్కొనేందుకు వామపక్షాలు ఫైర్ బ్రాండ్‌గా పేరున్న డివైఎఫ్ నాయకురాలు మీనాక్షి ముఖర్జీని బరిలోకి దింపాయి. ఆమె ఒకప్పుడు వామపక్షాల కంచుకోట అయిన నందిగ్రామ్‌లో తిరిగి ఎర్రజెండా రెపరెపలాడించేందుకు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇటీవల సౌతఖాలీ, గార్చక్రబేరియా, కాళిచరణ్, సోనాచురా బజార్, తఖాలీ వంటి ప్రాంతాల్లో మీనాక్షి ప్రచార ర్యాలీలు చేపట్టారు. అంతేగాక 2011లో వామపక్ష కూటమి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన నందిగ్రామ్ భూసేకరణ అంశాన్ని అప్పుడు వ్యతిరేకించిన భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీలోని ప్రముఖులు మీనాక్షికి మద్దతు ఇస్తున్నారు. బెంగాల్, అస్సాంలలో ముగిసిన ప్రచారం కోల్‌కతా/గువాహటి: పశ్చిమబెంగాల్, అస్సాంలలో ఏప్రిల్ ఒకటో తేదీన జరగనున్న రెండో దశ పోలింగ్‌కు మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. అస్సాం అసెంబ్లీలోని 126 సీట్లకుగాను 39 స్థానాలకు, బెంగాల్‌లోని 284 నియోజకవర్గాలకు గాను 30 చోట్ల ఏప్రిల్ ఒకటో తేదీన పోలింగ్ జరగనుంది. అస్సాంలో రెండోదశలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 345 మంది అభ్యర్థుల్లో 174 మంది స్వతంత్రులున్నారు. మొత్తం 345 మందిలో 37 మందికి నేర చరిత్ర ఉండగా అందులో 30 మందిపై తీవ్ర నేరారోపణలున్నాయి. నేర చరితుల్లో బీజేపీకి చెందిన 11 మంది, కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌కు చెందిన ఐదుగురు చొప్పున ఉండటం గమనార్హం. అదేవిధంగా, బెంగాల్‌లోని నాలుగు జిల్లాల్లో రెండోదశ పోలింగ్ జరిగే 30 నియోజకవర్గాల్లో 171 మంది బరిలో నిలిచారు. పోలింగ్ బందోబస్తు కోసం 651 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను రంగంలోకిదించారు. -
నందిగ్రామ్ లో హై వోల్టేజ్ పొలిటికల్ వార్
-
నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన
కోల్కత్తా: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 1వ తేదీన జరగనుంది. పశ్చిమ బెంగాల్లో ఈ రెండో దశ పోలింగ్‌లో ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నాయి. దీంతో ప్రచారంలో ఆఖరి రోజు సోమవారం హోరాహోరీగా ప్రచారం సాగింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో చక్రాల కుర్చీపైనే కూర్చుని భారీ బహిరంగ సభ నిర్వహించారు. చక్రాల కుర్చీలో కూర్చునే 8 కిలోమీటర్ల భారీ ర్యాలీలో మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై గర్జించారు. బీజేపీని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడిన మమత అనంతరం తన పదేళ్ల పాలనను వివరించారు. ‘నేను బెంగాల్ టైగర్’ను అంటూ మమతా బెనర్జీ ప్రకటించారు. తన ముందు ప్రత్యర్థులు పనికి రారు అని పేర్కొన్నారు. నాపై దాడి చేయడానికి ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి గూండాలను రప్పిస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ప్రేమించే సంస్కృతి లేనివారు రాజకీయాలకు పనికి రారు అని హితవు పలికారు. వారి దాడులను తాను సింహంలాగా స్పందిస్తానని మమతా చెప్పారు. ఈ సందర్భంగా తనను తాను ‘రాయల్ బెంగాల్ టైగర్’గా మమతా అభివర్ణించుకున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ గూండాలు వస్తే గిన్నెలు, పాత్రలతో దాడి చేయండి అని మమతా మహిళలకు పిలుపునిచ్చారు. మమతాకు పోటీగా ఆమె మాజీ అనుచరుడు సువేందు అధికారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే నందిగ్రామ్ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థానానికి రెండో దశలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో రెండు రోజుల ముందట ప్రచారం ముగిసింది. -
బీజేపీ గూండాలను తరమండి
కోల్‌కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని, బయటి నుంచి గూండాలను దిగుమతి చేస్తోందని తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. గరిటెలు, అట్లకాడలు, వంట పాత్రలతో బీజేపీ గూండాలను తరిమికొట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని నారాయణగఢ్, పింగ్లాలో శనివారం ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. నందిగ్రామ్‌లో తనపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువేందు అధికారిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు ద్రోహులని దుయ్యబట్టారు. సువేందు అధికారి కుటుంబ సభ్యుడొకరు శుక్రవారం రాత్రి ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయాడని అన్నారు. అతడిని మహిళలు పట్టుకొని పోలీసులకు అప్పగించారని చెప్పారు. బయటి నుంచి వచ్చిన మరో 30 మంది గూండాలను కూడా మహిళలు పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో ద్రోహులపై కన్నేశా: అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. నందిగ్రామ్‌లో మీర్ జాఫర్లపై(ద్రోహులు) ఓ కన్నేసి ఉంచానని వ్యాఖ్యానించారు. సువేందు అధికారికి, అతడి సోదరులకు మంచి పదవులు కట్టబెట్టానని గుర్తుచేశారు. అయినప్పటికీ వారు తృణమూల్ కాంగ్రెస్‌ను దగా చేసి, బీజేపీలో చేరారని విమర్శించారు. డబ్బుకు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ, తృణమూల్ కార్యకర్తల ఘర్షణ పూర్బ మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో శనివారం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానంలో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ బయటి నుంచి తీసుకొచ్చిన రౌడీలు తమపై దాడి చేశారని మమతా బెనర్జీ ఎలక్షన్ ఏజెంట్ షేక్ సూఫియాన్ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ముగ్గురు గాయాలపాలయ్యారని అన్నారు. -
మమత ఆడియో కలకలం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్‌ను ప్రతిపక్ష బీజేపీ శనివారం విడుదల చేసింది. నందిగ్రామ్‌కు చెందిన బీజేపీ నేత ప్రళయ్ పాల్‌తో ఆమె మాట్లాడినట్లు, మళ్లీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాలని, తన గెలుపునకు సహకరించాలని అభ్యర్థిస్తున్నట్లుగా ఈ ఆడియోలో ఉండడం కలకలం రేపుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఆమెపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి బరిలోకి దిగుతున్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులే కావడంతో నందిగ్రామ్‌పై అందరి దృష్టి పడింది. ప్రళయ్ పాల్ గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేశాడు. సువేందు అధికారితో కలిసి బీజేపీలో చేరాడు. ప్రళయ్ పాల్‌తో మమతా బెనర్జీ వ్యక్తిగతంగా మాట్లాడినట్లు బీజేపీ చెబుతోంది. ఆడియో క్లిప్‌లో ఏముందంటే.. ‘నందిగ్రామ్‌లో నేను నెగ్గడానికి సహకరించు. నీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు. ఇకపై నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’’ అని మమత హామీ ఇవ్వగా, ప్రళయ్ పాల్ స్పందిస్తూ.. ‘‘దీదీ (అక్కా).. మీరు నాకు ఫోన్ చేశారు. అది చాలు. సువేందు అధికారికి ద్రోహం చేయలేను’ అని పేర్కొన్నాడు. ఈ ఆడియో విషయంలో ప్రళయ్ పాల్ మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం బీజేపీ కోసం పనిచేస్తున్నానని, ఆ పార్టీని మోసం చేయలేనని అన్నాడు. ఎలక్టోరల్ అధికారికి బీజేపీ ఫిర్యాదు మమతా బెనర్జీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి ౖMðలాశ్ విజయ్ వర్గీయా నేతృత్వంలో ఓ బృందం బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను కలిసింది. ఆడియో క్లిప్‌ను అందజేసింది. ఈ ఆడియో క్లిప్ వాస్తవికతపై తృణమూల్ కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రళయ్ పాల్ గతంలో తమ పార్టీ నాయకుడేనని, అతడితో మాట్లాడి, సాయం కోరితే తప్పేముందని ఆ పార్టీ నేత కునాల్ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇదంతా సహజమేనని తేల్చిచెప్పారు.


