బీజేపీ నియంతృత్వాన్ని ఎదిరిద్దాం

Mamata Banerjee writes to leaders of over a dozen parties - Sakshi

ఐక్య పోరాటానికి సమయం వచ్చింది

రాష్ట్రాల అధికారాలను కుదించే కుట్ర చేస్తున్న కేంద్రం

బీజేపీయేతర పార్టీల నేతలకు టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ లేఖ

న్యూఢిల్లీ/నందిగ్రామ్‌: బీజేపీ, ఆ పార్టీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై, సమాఖ్య స్ఫూర్తిపై వరుస దాడులు చేస్తున్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. స్వాతంత్య్రం తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత దిగువకు దిగజారాయని పేర్కొన్నారు. బీజేపీ నియంతృత్వంపై కలసికట్టుగా పోరాడుదామని విపక్ష నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీల నేతలకు ఆమె రాసిన లేఖను బుధవారం టీఎంసీ విడుదల చేసింది.

‘ఈ లేఖను మీతో పాటు దేశంలోని బీజేపీయేతర పార్టీల నాయకులకు రాస్తున్నాను. ప్రజాస్వామ్యంపై, సమాఖ్య విధానంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వరుస దాడులకు పాల్పడుతోంది. ఇది చాలా ఆందోళనకర అంశం. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాల్సిన, ఒక ప్రత్యామ్నాయ వేదికను ప్రజలకు అందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ సహా విపక్ష నాయకులకు రాసిన లేఖలో మమత పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌(ఎల్జీ)కి అపరిమిత అధికారం, ఢిల్లీ ప్రభుత్వమంటే ఎల్జీనే అని స్పష్టం చేసే చట్టంపై లేఖలో మమత మండిపడ్డారు.

‘ఆ చట్టంతో ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం అధికారాలను లాగేసుకుంది. ఆ అధికారాలను తన ప్రతినిధి అయిన ఎల్జీ చేతిలో పెట్టింది. ఎల్జీని అప్రకటిత ఢిల్లీ వైస్రాయ్‌గా మార్చింది’ అని మమత వివరించారు. ఢిల్లీలో 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ప్రజా తీర్పును బీజేపీ అంగీకరించడం లేదన్నారు. ఆ చట్టం భారతదేశ సమాఖ్య విధానంపై జరిపిన ప్రత్యక్ష దాడి అని ఆమె అభివర్ణించారు. సోనియాతో పాటు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, వైఎస్సార్సీపీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్, బీజేడీ నాయకుడు నవీన్‌ పట్నాయక్, నేషనల్‌ కాన్ఫెరెన్స్‌కు చెందిన ఫారూఖ్‌ అబ్దుల్లా, పీడీపీ చీఫ్‌ మెహబూబా, సీపీఐఎంఎల్‌ నేత దీపాంకర్‌ భట్టాచార్యలకు మమత ఈ లేఖను పంపించారు.

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని విమర్శించారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల అమలును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రాలు తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువచ్చే జాతీయ అభివృద్ధి మండలి, అంతర్రాష్ట్ర మండలి, ప్రణాళిక సంఘం... తదితర వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను మున్సిపాలిటీల స్థాయికి కుదించాలని, దేశంలో ఏకపార్టీ అధికార వ్యవస్థ కోసం కుట్ర పన్నుతోందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. అక్రమ మార్గాల ద్వారా సేకరించిన నిధులను రాష్ట్రాల్లో విపక్ష పార్టీలను అధికారంలో నుంచి కూలదోయడానికి, బీజేపీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని, వాటిని ప్రైవేటు పరం చేయాలన్న బీజేపీ ఆలోచన నిర్లక్ష్యపూరితమైందని విమర్శించారు. బీజేపీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి రావాలని బీజేపీయేతర పార్టీల నాయకులను ఆమె కోరారు. కలిసికట్టుగా పోరాడితేనే విజయం సాధించగలమని, ఈ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ విషయంలో ఒక కార్యాచరణ రూపొందించే విషయమై చర్చిద్దామని ఆమె ప్రతిపాదించారు. మమత లేఖపై బీజేపీ స్పందించింది. మమత డిక్షనరీలో లేని పదమే ప్రజాస్వామ్యమని వ్యాఖ్యానించింది. మమత ప్రతిపాదనకు పీడీపీ చీఫ్, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నుంచి మద్దతు లభించింది.

కోట్లు కుమ్మరిస్తున్నారు
ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ నేతలు కోట్ల రూపాయలను ఓటర్లకు పంచిపెడ్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఓటర్లను భయపెట్టేందుకు యూపీ, బిహార్‌ రాష్ట్రాల నుంచి గూండాలను దింపుతున్నారన్నారు. బీజేపీ నేతలు ఇదంతా బహిరంగంగా చేస్తోంటే.. ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.  నందిగ్రామ్‌లో తనపై దాడి చేసిన వారి వివరాలు తెలిశాయని, ఎన్నికల తరువాత ఆ విషయం చూస్తానని పేర్కొన్నారు. మరోవైపు, మమత బెనర్జీపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఆమె బెదిరిస్తున్నారని ఆరోపించారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 04:35 IST
కోల్‌కతా: హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయఢంకా మోగించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ వరసగా మూడోసారి బెంగాల్‌...
05-05-2021
May 05, 2021, 01:05 IST
బీజేపీ అజేయశక్తి కాదని, ఆ పార్టీని ఓడించవచ్చని బెంగాల్‌ ఎన్నికలు నిరూపించాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ...
04-05-2021
May 04, 2021, 06:25 IST
శివసాగర్‌(అస్సాం): పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక ఉద్యమకారుడు, సమాచార హక్కు చట్టం కార్యకర్త అఖిల్‌ గొగోయ్‌(46) జైల్లో ఉంటూ అస్సాంలో...
04-05-2021
May 04, 2021, 06:14 IST
గవర్నర్‌ సూచన మేరకు ఈ నెల 7న రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
04-05-2021
May 04, 2021, 04:59 IST
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. మామ, అల్లుళ్ల జంట అసెంబ్లీలోకి త్వరలో అడుగిడనుంది. ఆ...
04-05-2021
May 04, 2021, 04:47 IST
కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు....
03-05-2021
May 03, 2021, 18:41 IST
సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం అభియోగాల కింద 2019లో గొగోయ్‌‌ను అరెస్ట్ చేశారు
03-05-2021
May 03, 2021, 17:38 IST
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ...
03-05-2021
May 03, 2021, 16:25 IST
మనం హింసకు పాల్పడవద్దు
03-05-2021
May 03, 2021, 13:21 IST
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆదివారం సోషల్‌ మీడియా హోరెత్తిపోయింది. పార్టీలు, నేతల గెలుపోటములపై నెటిజన్లు ‘మీమ్స్‌’తో హల్‌చల్‌...
03-05-2021
May 03, 2021, 09:21 IST
పశ్చిమ బెంగాల్‌ను 1977 నుంచి 2011 దాకా.. 34 ఏళ్లపాటు అప్రతిహతంగా పాలించిన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేడు దయనీయ స్థితికి...
03-05-2021
May 03, 2021, 09:01 IST
తమిళనాడులో కాంగ్రెస్‌ పతనమైన తర్వాత ద్రవిడ పార్టీలే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి
03-05-2021
May 03, 2021, 08:07 IST
పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ – బీజేపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైంది.
03-05-2021
May 03, 2021, 07:26 IST
అసెంబ్లీలో కాలుమోపాలని ఎన్నాళ్లుగానో కలలుగంటున్న కమలనాథులు తమ కలను సాకారం చేసుకున్నారు.
03-05-2021
May 03, 2021, 06:30 IST
కోల్‌కతా: కాంగ్రెస్‌ కుంచుకోటలుగా ఉన్న ముస్లిం ఆధిక్య జిల్లాలైన మాల్దా, ముర్షీదాబాద్‌లు ఈసారి తృణమూల్‌కు జై కొట్టాయి. ఫలితంగా మమతా...
03-05-2021
May 03, 2021, 06:06 IST
న్యూఢిల్లీ: ప్రస్తుతం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా మమతా బెనర్జీ ఘన విజయం రెండు విషయాలను స్పష్టం...
03-05-2021
May 03, 2021, 05:32 IST
 న్యూఢిల్లీ: కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని 3 లోక్‌సభ స్థానాలు, 10 రాష్ట్రాల్లోని 12 అసెంబ్లీ సీట్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు...
03-05-2021
May 03, 2021, 05:21 IST
తృణమూల్‌ చీఫ్‌ మమతా బెనర్జీ తొలిసారి బరిలో నిలిచిన పశ్చి మ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ నియోజకవర్గ ఫలితాలు నరాలు తెగే...
03-05-2021
May 03, 2021, 05:15 IST
పశ్చిమ బెంగాల్‌ తన తీర్పుతో భారతదేశాన్ని రక్షించిందని తృణమూ ల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం  మమతా బెనర్జీ అన్నారు. ...
03-05-2021
May 03, 2021, 04:48 IST
అస్సాంలో కమలదళానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. క్లీన్‌ఇమేజ్‌తో బీజేపీ విజయానికి తోడ్పడిన ముఖ్యమంత్రి సర్బానంద...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top