ఉచితంగా ఐఫోన్స్.. వ్యాపారవేత్త బంపరాఫర్! | 1000 iPhones Up For Grabs At Punjab Businessman iPhone Langar | Sakshi
Sakshi News home page

ఉచితంగా ఐఫోన్స్.. వ్యాపారవేత్త బంపరాఫర్!

Sep 18 2026 5:44 PM | Updated on Sep 18 2026 6:03 PM

1000 iPhones Up For Grabs At Punjab Businessman iPhone Langar

అమృత్‌సర్‌కు చెందిన వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రాకేష్ ట్రెహాన్ 'రాజా డీ కింగ్'గా ప్రసిద్ధి చెందారు. ఈయన తాజాగా ప్రజలకు ఉచితంగా ఐఫోన్లు అందించే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించారు. దీనికి 'ఐఫోన్ లంగర్' అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 22న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఐఫోన్లను మీడియా, ప్రజల సమక్షంలో ప్రత్యక్షంగా పంపిణీ చేస్తామని చెప్పారు.

ఎంపిక ఇలా..
ఈ కార్యక్రమంలో ఐఫోన్ 17, అంతకంటే కొత్త మోడళ్లను మాత్రమే ఇస్తామని రాకేష్ ట్రెహాన్ స్పష్టం చేశారు. ఐఫోన్ 16ను ఇవ్వమని వెల్లడించారు. దీనికోసం ఒక వాట్సాప్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశారు. గ్రూప్‌లో ఉన్నవారిలో 'జై మాతా ది' అని రాసిన వారిలో కొంతమందిని విజేతలుగా ఎంపిక చేసి, వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని తెలిపారు.

ఇప్పటికే 100 ఐఫోన్స్ ఆర్డర్
ఈ కార్యక్రమాన్ని చండీగఢ్, మొహాలీ ప్రాంతాల ప్రజల కోసం నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే 100 ఐఫోన్ 17లను ఆర్డర్ చేసినట్లు, అవసరమైతే 1,000 ఐఫోన్ల వరకు పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని ట్రెహాన్ చెప్పారు. ఐఫోన్లను ఒకేసారి కాకుండా దశలవారీగా అందించడం ద్వారా కార్యక్రమంలో పారదర్శకత ఉండేలా చూస్తామని తెలిపారు. సెప్టెంబర్ 22న మరో పది నగరాల వివరాలను ప్రకటిస్తామని కూడా వివరించారు.

గతంలోనూ ఇలా..
రాకేష్ ట్రెహాన్ ఇలాంటి ప్రజా కార్యక్రమాలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన కొన్ని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో ప్రజలకు ఉచితంగా పెట్రోల్ అందించే 'పెట్రోల్ లంగర్' కార్యక్రమాలను నిర్వహించారు. అందులో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు రూ.500, నాలుగు చక్రాల వాహనాలకు రూ.1,000 విలువైన కూపన్లు ఇచ్చారు. అంతకుముందు చండీగఢ్‌లోని ఒక ఆలయం వెలుపల ప్రజలకు రూ.500 నోట్లను కూడా పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బిగ్ షాక్.. హాల్‌మార్కింగ్ ఛార్జీ పెంపు!

సాధారణంగా లంగర్ అంటే ప్రజలకు ఉచితంగా ఆహారం అందించే సేవ. అయితే రాకేష్ ట్రెహాన్ అదే ఆలోచనను ఉపయోగించి పెట్రోల్, నగదు, ఇప్పుడు ఐఫోన్లను ప్రజలకు ఉచితంగా అందించే కార్యక్రమాలు చేస్తున్నారు. 'ఐఫోన్ లంగర్' ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు సహాయం చేయాలని, భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరిన్ని నగరాలకు విస్తరించాలని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement