భారత్‌లోకి పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు! | Denza May Introduce 1140 BHP Z9 GT Electric Fastback in India | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు!

Sep 18 2026 5:02 PM | Updated on Sep 18 2026 5:08 PM

Denza May Introduce 1140 BHP Z9 GT Electric Fastback in India

చైనా ఆటోమొబైల్ తయారీ సంస్థ డెంజా భారత మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. డీ9 లగ్జరీ ఎంపీవీకి అదనంగా.. ఈ సంస్థ జెడ్9 జీటీ హై-పెర్ఫార్మెన్స్ ఫాస్ట్‌బ్యాక్‌ను కూడా దేశీయ విఫణిలోకి తీసుకురానున్నట్లు సమాచారం.

డెంజా జెడ్9 జీటీ అనేది నాలుగు డోర్ల ఫాస్ట్‌బ్యాక్, ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. భారతదేశంలో డెంజా ఈవీ వేరియంట్‌ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 1,140 Bhp పవర్ ఉత్పత్తి చేసే మూడు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా పనిచేస్తుంది. ఈ కారు 2.7 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుందని, గరిష్ట వేగం 270 km/h ఉంటుందని కంపెనీ పేర్కొంది.

జెడ్9 జీటీ 122.5 kWh బ్యాటరీ ద్వారా 600 కి.మీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది 1,500 kW అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, ఇది కేవలం 9 నిమిషాల్లో బ్యాటరీని 10-97% వరకు ఛార్జ్ చేయగలదు. భారతదేశంలో లాంచ్ అయిన తరువాత, ఇది టయోటా వెల్‌ఫైర్‌తో పోటీ పడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement