బంగారం ధరల్లో ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఈ రోజు (సెప్టెంబర్ 11) ఉదయం రూ.2620 తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలు మారిపోయాయి. కొత్త ధరలు ఎలా ఉన్నాయి?, ఏ నగరంలో అధికంగా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,40,150 వద్ద ఉన్న 10 గ్రాముల పసిడి ధర.. సాయంత్రానికి రూ.141550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,52,890 వద్ద నుంచి రూ.1,54,420 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. బంగారం ధరలు గంటల వ్యవధిలో తారుమారు అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
చెన్నైలో కూడా బంగారం ధరలు, సాయంత్రానికే మారిపోయాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.152890 నుంచి రూ.154420 వద్దకు, 22 క్యారెట్ల రేటు రూ.140150 నుంచి రూ.141550 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా పసిడి ధరలు కొంత పెరిగినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో రూ.140300 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి రూ.1400 పెరిగి రూ.141700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,53,040 నుంచి రూ.1530 పెరిగి రూ.1,54,570 వద్దకు చేరింది. అయితే వెండి ధరల్లో.. సాయంత్రానికి ఎలాంటి మార్పు జరగలేదు.
ఇదీ చదవండి: టోల్ వసూళ్లకు కొత్త ప్లాన్.. గడ్కరీ కీలక ప్రకటన!


