పసిడికే మాటొస్తే ‘ఏడు రంగులిచ్చే ఇంద్రధనుస్సు నీ మేని రంగు చూస్తే ఏమంటుందో’ అని కచ్చితంగా అని తీరేలా ఉంది కదూ ఈ అమ్మడి తీరు..నిజమే బంగారం తాపడం చేసుకుంటేనే గొప్ప అనుకునే ఈ రోజుల్లో నిలువెత్తు బంగారంతో చేసిన వస్త్రం కట్టిన వనితని ఆ మాత్రమైన పొగడక పోతే కనకానికి కనికరం లేనట్టే కదా..? ఈమె ఎవరో కాదు అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా. ఆమె ధరించిన డ్రెస్ ధర అక్షరాల నాలుగు కోట్లు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ అబుజాన్, సందీప్ ఖోస్లా ఫ్యాషన్ ప్రయాణానికి 40 వసంతాలునిండిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ తార మెరిసిందిలా...
నవ్య స్కూలింగ్ అంతా లండన్‌లోనే! తర్వాత అమెరికాలో ఫోర్దామ్ యూనివర్సిటీలో డిజిటల్ టెక్నాలజీ అండ్ యూఎక్స్‌డిజైన్‌లో బీఏ, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ కూడా కంప్లీట్ చేసింది. ఇండియాలోనే అతిపెద్ద ఫిలిం ఫ్రెటర్నటీ నుంచి వచ్చినా నవ్యకి సినిమాలంటే ఆసక్తి లేదు. తన తండ్రి నిఖిల్ నందా వ్యాపారం, ట్రాక్టర్లు, స్టాక్ మార్కెట్లపైనే తన ఆసక్తి అంతా. మహిళా సాధికారత కోసం ‘ప్రాజెక్ట్ నవేలి’ని మొదలెట్టింది.
మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఏర్పాటైన ‘హెల్త్ టెక్’ కంపెనీకి కో ఫౌండర్‌గా వ్యవహరిస్తోంది. అలాగే తన తల్లి శ్వేత, అమ్మమ్మ జయా బచ్చన్‌తో కలిసి ‘వాట్ ద హెల్ నవ్య’ అనే పాడ్ కాస్ట్‌ను కూడా నిర్వహిస్తోంది. అలా స్టార్స్ కుటుంబం లో పుట్టినా తనకంటూ గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ ఒక్కొక్క విజయాన్ని అందిపుచ్చుకుంటోంది.
(చదవండి: ఒకప్పుడు సైన్యం కోసం రాకెట్లు..ఇవాళ చిన్నారుల ఫుడ్ బ్రాండ్ వ్యాపారం!)


