అదరగొట్టిన బంగారం! 25 ఏళ్లలో ఇది మూడోది.. | Gold Prices Surge 13% in August to $4,563 per Ounce: What’s Next? | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన బంగారం! 25 ఏళ్లలో ఇది మూడోది..

Sep 9 2026 8:45 PM | Updated on Sep 9 2026 8:55 PM

Gold August rally strongest 25 years ETF inflows World Gold Council

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆగస్టులో భారీగా పుంజుకున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం.. 2026 ఆగస్టులో బంగారం ధర 13 శాతం పెరిగి ఔన్స్‌కు 4,563 డాలర్ల వద్ద నెలను ముగించింది. గత 25 ఏళ్లలో నమోదైన మూడో అత్యధిక నెలవారీ రాబడి ఇదేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.

ఈ పెరుగుదలకు ప్రధాన కారణం విస్తృతంగా జరిగిన గోల్డ్ ఈటీఎఫ్‌ (Gold ETF) కొనుగోళ్లేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన 'గోల్డ్ మార్కెట్ కామెంటరీ'లో పేర్కొంది. బలహీనపడిన అమెరికా డాలర్ కూడా బంగారం ధరలకు మద్దతుగా నిలిచిందని తెలిపింది. ఈటీఎఫ్‌లలోకి భారీగా పెట్టుబడులు రావడంతో పాటు, బంగారం ఆప్షన్లలో కొనుగోళ్లు పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేసినట్లు గోల్డ్ కౌన్సిల్ వివరించింది.

ఆగస్టులో యూరప్ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి 7.9 బిలియన్ డాలర్లు, ఉత్తర అమెరికా ఈటీఎఫ్‌ల్లోకి 7.8 బిలియన్ డాలర్లు ప్రవహించాయి. ఆసియా ఈటీఎఫ్‌లు మరో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇదే సమయంలో COMEXలో నెట్ మేనేజ్డ్ మనీ పొజిషనింగ్ 13 బిలియన్ డాలర్లు పెరిగినట్లు గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.

సెప్టెంబర్‌లో ఏం జరగొచ్చు?

ప్రస్తుతం మార్కెట్ దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో తీసుకునే వడ్డీ రేటు నిర్ణయంపై ఉంది. అమెరికా ఆర్థిక గణాంకాలు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఫెడ్ చైర్ వార్ష్ హాకిష్ వ్యాఖ్యలు, జాక్సన్ హోల్ సింపోజియం పరిణామాలు కూడా మార్కెట్ అంచనాలను ప్రభావితం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: ఆధార్‌కు భారీ అప్‌గ్రేడ్.. ఇక మూడింతలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement