వాణిజ్య వాహనాల మార్కెట్‌కు పండగల జోష్‌ | India Truck Market Roars Back Festival Demand Meets Replacement Boom | Sakshi
Sakshi News home page

వాణిజ్య వాహనాల మార్కెట్‌కు పండగల జోష్‌

Sep 9 2026 12:40 PM | Updated on Sep 9 2026 12:51 PM

India Truck Market Roars Back Festival Demand Meets Replacement Boom

దేశీయ వాణిజ్య వాహనాల (కమర్షియల్‌ వెహికిల్‌) మార్కెట్‌ పండుగల సీజన్‌తో దూసుకుపోతోంది. ట్రక్కు అద్దెలు స్థిరంగా ఉండటం, గూడ్స్‌ క్యారియర్‌ రిజిస్ట్రేషన్లు పెరగడం, భారీ ట్రక్కుల విక్రయాలు ఊపందుకోవడం వంటివి పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ధోరణితో కలిసి మార్కెట్‌కు బలమైన ఊతమిస్తున్నాయి.

శ్రీరామ్‌ మొబిలిటీ బులెటిన్‌ ప్రకారం, ఆగస్టులో 18-టన్నుల ట్రక్కుల అద్దెలు ప్రధాన మార్గాల్లో నెలవారీగా దాదాపు స్థిరంగా ఉన్నా గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఢిల్లీ-కోల్‌కతా మార్గంలో అద్దె 15 శాతం పెరిగి రూ.1.82 లక్షలకు చేరగా బెంగళూరు-ముంబై, కోల్‌కతా-గువాహటి మార్గాల్లో 11 శాతం చొప్పున పెరిగి వరుసగా రూ.1.50 లక్షలు, రూ.1.63 లక్షలుగా నమోదయ్యాయి. ఢిల్లీ-ముంబై మార్గంలో అద్దె 8 శాతం పెరిగి రూ.1.75 లక్షలకు చేరింది.

ఓనం పండుగతో మొదలైన ఉత్సాహం రవాణా రంగం మొత్తానికి విస్తరించిందని, ప్రధాన మార్గాల్లో అద్దెలు స్థిరంగా ఉండటంతో సరుకు రవాణా కార్యకలాపాలు బలంగా కొనసాగాయని శ్రీరామ్‌ ఫైనాన్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీవోవో సుదర్శన్‌ హొల్లా పేర్కొన్నారు. ఈ సానుకూలత వాహన విక్రయాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ఆగస్టులో దేశవ్యాప్తంగా గూడ్స్‌ క్యారియర్‌ రిజిస్ట్రేషన్లు 18 శాతం పెరిగి 74,401 యూనిట్లకు చేరాయి. కార్గో త్రీ వీలర్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 43 శాతం ఎగసి 14,614కు చేరుకున్నాయి. అశోక్‌ లేలాండ్‌ దేశీయ మీడియం, హెవీ కమర్షియల్‌ వాహన విక్రయాలు దాదాపు 60 శాతం వృద్ధి చెందాయి.

ఇది కేవలం పండుగల తాత్కాలిక ఊపు మాత్రమే కాదని క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ సీనియర్‌ ప్రాక్టీస్‌ లీడర్‌ హేమల్‌ ఠక్కర్‌ అభిప్రాయపడ్డారు. పాతబడిన వాహన వ్యవస్థ కారణంగా రీప్లేస్‌మెంట్‌ డిమాండ్‌ FY27లో వృద్ధికి తోడ్పడుతుందని ఆయన అంచనా వేశారు. పాత వాహనాలను తొలగించి ఎక్కువ బరువు మోసే మల్టీ-యాక్సిల్‌ ట్రక్కులు, ట్రాక్టర్‌ ట్రైలర్లవైపు ఫ్లీట్‌ ఆపరేటర్లు మళ్లుతున్నారు.

ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement