ఎస్‌ఎంఎల్ మహీంద్రా చైర్మన్ వినోద్ సహాయ్
హైదరాబాద్ మార్కెట్లోకి బ్లేజో ఐ–టీఆర్‌కే వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపయోగించే తేలికపాటి వాణిజ్య వాహనాల విభాగంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు తేనున్నట్లు మహీంద్రా ట్రక్స్ అండ్ బసెస్ ప్రెసిడెంట్, ఎస్‌ఎంఎల్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వినోద్ సహాయ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం లేదా వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉందని వివరించారు.
హెచ్‌సీవీ (భారీ వాణిజ్య వాహనాలు) విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలను తేవాలంటే చార్జింగ్ మౌలిక సదుపాయాలు, ధరలపరమైన సవాళ్లు ఉంటున్నాయని సహాయ్ చెప్పారు. హైదరాబాద్ మార్కెట్లో సరికొత్త బ్లేజో–ఐటీఆర్‌కే భారీ వాణిజ్య ట్రక్కుల (హెచ్‌సీవీ) శ్రేణిని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. 25 నుంచి 55 టన్నుల వరకు సామర్థ్యం ఉండే ఈ వాహనాల ధర రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఉంటుంది. నిర్వహణ వ్యయాలు భారీగా తగ్గేలా, యజమానుల లాభదాయకత పెరిగేలా వీటిని తీర్చిదిద్దినట్లు సహాయ్ చెప్పారు.


