మహీంద్రా అండ్ మహీంద్రా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. రెండు కొత్త బీఈ 6 ఎలక్ట్రిక్ వెర్షన్‌లను ఆవిష్కరించింది. ఒకటి స్పోర్టెక్ వేరియంట్ కాగా.. మరొకటి ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్ ఉన్నాయి.
మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్
స్పోర్టెక్ అనేది బీఈ 6 లైనప్‌లోని కొత్త ఫ్లాగ్‌షిప్ వేరియంట్. దీని ధర రూ. 19.45 లక్షలు (ఎక్స్ షోరూమ్). BaaS స్కీమ్ కింద రూ. 11.45 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.
బీఈ 6 స్పోర్టెక్ వేరియంట్ చూడటానికి సాధారణ మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇందులో ప్రత్యేకమైన స్పోర్టెక్ బ్యాడ్జ్ చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, టూ-టోన్ అల్లాయ్ వీల్స్‌తో ఇది ఆకట్టుకుంటుంది. కాగా ఇది గ్రాఫైట్ స్టార్మ్ ఎక్స్‌టీరియర్ రంగులో అందుబాటులో ఉంది.
స్పోర్టెక్ నలుపు, లేత గోధుమ రంగు ఇంటీరియర్‌ను పొందుతుంది. మధ్యలో స్పైన్ లేని కొత్త డాష్‌బోర్డ్‌తో వస్తుంది. ఈ లేఅవుట్ మూడు 12.3-అంగుళాల డిస్‌ప్లేలను అమర్చడానికి స్థలాన్ని కల్పిస్తుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, USB టైప్-సి పోర్ట్‌లకు యాక్సెస్‌ను కూడా మెరుగుపరుస్తుంది.
ఇది 59 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. దీని రేంజ్ 682 కి.మీ. వరకు ఉంటుంది. దీనికి వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంది, ఇది 282 Bhp పవర్, 380 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
మహీంద్రా బీఈ 6 ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్
మహీంద్రా రూ. 24.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో బీఈ 6 ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఇది కొన్ని ప్రత్యేకమైన కాస్మెటిక్ అంశాలను పొందినప్పటికీ.. స్టాండర్డ్ BE 6 లాగానే కనిపిస్తుంది. అయితే ఇందులో ఫార్ములా ఈ బ్యాడ్జ్‌లు చూడవచ్చు.
ఫార్ములా E ఫ్రీడమ్ ఎడిషన్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ కాక్‌పిట్‌లను విభజించే సెంట్రల్ స్పైన్‌తో కూడిన పాత డాష్‌బోర్డ్ లేఅవుట్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ 12.3-అంగుళాల డిస్‌ప్లేలు, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, యాంబియంట్ లైటింగ్, 540-డిగ్రీ కెమెరా, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.


