రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతీయ మార్కెట్లో అప్‌డేటెడ్ కాంటినెంటల్ జీటీ 650ని లాంచ్ చేసింది. దీని ధరలు రూ.3.58 లక్షల నుంచి ప్రారంభమై రూ. 3.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.
కంపెనీ 2026 కాంటినెంటల్ జీటీ 650 బైక్ మెకానికల్ ప్యాకేజీలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే.. స్టైలింగ్, ఫీచర్లలో చిన్న మార్పులను చూడవచ్చు. ఈ అప్డేటెడ్ బైక్ నాలుగు రంగులలో లభిస్తుంది.
అప్డేటెడ్ కాంటినెంటల్ జీటీ 650 అదే 648 సీసీ, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ద్వారానే పనిచేస్తుంది. ఇది 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి పనితీరులో ఎలాంటి మార్పు లేదు.


