రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో డబ్బు విలువ తగ్గే అవకాశం ఉందని, అందుకే బంగారం, వెండి వంటి ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.
అమెరికా అప్పులు
అమెరికా అప్పు త్వరలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని కియోసాకి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తే.. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అప్పులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే.. చేతిలో ఉన్న డబ్బు విలువ తగ్గుతుంది. ఇది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
బంగారం, వెండి భారీగా పెరుగుతాయా?
కియోసాకి తనకు తెలిసిన ఆర్థిక నిపుణుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు బంగారం, వెండి ధరలపై భారీ అంచనాలు వేస్తున్నారని చెప్పారు. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బంగారం ధర ఔన్సుకు 10,000 డాలర్లకు చేరొచ్చన్న అంచనాలను ఆయన ప్రస్తావించారు. అయితే.. ఇవి ఖచ్చితమైన ధరలు కావు. కొందరు నిపుణులు చేస్తున్న అంచనాలు మాత్రమే. మార్కెట్ పరిస్థితులు మారితే ఈ అంచనాలు కూడా మారవచ్చు.
కియోసాకి బంగారం, వెండి రెండింటినీ ప్రస్తావించినప్పటికీ.. 2026 ఆగస్టులో తనకు మాత్రం వెండే మంచి ఎంపికగా కనిపిస్తోందని కియోసాకి చెప్పారు. వెండికి ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం పెట్టుబడి లోహం మాత్రమే కాదు. సౌర విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఇతర పారిశ్రామిక రంగాల్లో కూడా వెండిని ఉపయోగిస్తారు. దీంతో భవిష్యత్తులో పారిశ్రామిక డిమాండ్ పెరిగితే వెండికి అదనపు మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు.
$40 TRILLION US NATIONAL soon!!
Q: What are you doing about it?
Friends who are much smarter than me, such as Jim Rickards are predicting $200 an ounce for silver and $10,000 an ounce gold soon.
Of the two…. I think silver is the best choice in August 2026.
Q: What do you…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 15, 2026


