హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్, ఈ–కామర్స్ సంస్థ నిహార్ ఇన్ఫో గ్లోబల్ తాజాగా పసిడి, వెండి కొనుగోళ్లకు సంబంధించి గోల్డ్‌ఎన్‌సిల్వర్.షాప్ పోర్టల్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. భౌతిక, డిజిటల్, ఈటీఎఫ్‌ల రూపంలో బంగారం, వెండి నాణేలు, కడ్డీలు మొదలైన వాటిని పారదర్శకమైన విధంగా ఒకే చోట కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ డైరెక్టర్ బీఎస్‌ఎన్ సూర్యనారాయణ తెలిపారు.
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా, డిసెంబర్ ఆఖరు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనికోసం ఎంఎంటీసీ–పీఏఎంపీ, ఆగ్మంట్, జిరోధా మొదలైన సంస్థలతో జట్టు కట్టినట్లు ఆయన వివరించారు. దీని ద్వారా ఆర్థిక సంస్థలతో కలిసి పసిడి రుణాలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి నాటికి యాప్ వెర్షన్ కూడా తేనున్నట్లు పేర్కొన్నారు.


