తరచుగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి, తాజాగా ఉద్యోగ జీవితం గురించి చెప్పారు. ''జీవితం అంటే కేవలం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పని చేసి, నెలాఖరులో జీతం తీసుకోవడమేనా?'' అని ప్రశ్నించారు.
చాలామంది చిన్నప్పటి నుంచి ఒకే విధమైన మార్గంలో వెళ్తుంటారు. చదువు.. ఉద్యోగం.. జీతం.. ఖర్చులు.. మళ్లీ ఉద్యోగం. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. మనం డబ్బు సంపాదిస్తున్నాం, కుటుంబాన్ని చూసుకుంటున్నాం, బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. కానీ ఒక సమయంలో మనల్ని మనమే ''నేను అసలు ఎందుకు ఇలా జీవిస్తున్నాను? నా జీవితానికి అర్థం ఏమిటి?'' అని బహుశా ఆలోచించకపోవచ్చు.
ఇదే విషయాన్ని కియోసాకి చెబుతూ.. నేను పని చేస్తున్నానంటే, అది ''కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రం కాదు. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి చేస్తున్నా'' అని పేర్కొన్నారు. అంటే మనం చేసే పని మనకు డబ్బు మాత్రమే కాకుండా, ఒక సంతృప్తిని, ఒక ఉద్దేశ్యాన్ని కూడా ఇవ్వాలని ఆయన ఉద్దేశ్యం.
కియోసాకి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. కొందరు ఆయన మాటలతో ఏకీభవించినప్పటికీ.. మరికొందరు వ్యతిరేకించారు.
చాలామంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించడం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అని అన్నారు. జీవిత లక్ష్యం అంటే ఏదో పెద్ద విజయం సాధించడంలో దొరకదు. కొన్నిసార్లు, ఒక సాధారణ పనిని నిలకడగా, చక్కగా చేయడంలో కూడా అది లభిస్తుందని ఇంకొందరు అన్నారు.
9 to 5 for just $?
Found it interesting my last X had so few loves relative to number of views.
My previous X was dedicated to working to fulfill your spirit’s mission…your life’s purpose….for the gift of life.
Working 9 to 5 just for $…seems to me…. to be an empty life.…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 14, 2026


