గౌరవం అంటే? | Spiritual And Devotional Story On Respect Character Values And Good Conduct | Sakshi
Sakshi News home page

గౌరవం అంటే?

Aug 13 2026 8:58 AM | Updated on Aug 13 2026 9:00 AM

Spiritual And Devotional Story On Respect Character Values And Good Conduct

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

శతక నీతి

ప్రతి మనిషి, ప్రతి కుటుంబం గౌరవం నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోనే ఉంటారు... గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. అసలు గౌరవం అంటే ఏమిటీ, గౌరవం ఎలా పొందాలో, ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం... ఉన్నారుగా మనకు మార్గదర్శులు.. శతక రచయితలు...

కులములోన నొకడు గుణవంతుడుండె
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములో న మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ
అడవిలో గంధం చెట్టుంటే దాని సువాసన అడవి అంతటికి పాకుతుంది.. అలాగే వంశంలో గుణవంతుడైన కొడుకు ఉంటే ఆ వంశానికి కీర్తి గౌరవం లభిస్తాయి... అంటూ వేమనే పై పద్యానికి వ్యతిరేకం కూడా చె΄్పారు.

కులములోన నొకడు గుణహీనుడుండెనా
కులము చెడును వాని గుణము వలన 
చెఱుకుతుద ఎన్ను పుట్టిన
చెఱుకున తీపెల్ల జెరుచు సిద్ధము సుమతీ 
అంటాడు బద్దెన కవి వేమన గౌరవం కులం ధనం వల్ల రాదు అన్నాడు

కులము గొప్పది కాదురా
కులమున గౌరవమ్ము లేదు కొంపలు కూలన్‌
నడవడి గొప్పది సుమ్మీ
నడవడి గలవాడు పూజ్యుడగు వేమా
అర్థం: కులం వల్ల గౌరవం రాదు. మంచి నడవడి ఉన్నవాడే లోకంలో పూజ్యుడు.

ఎంగిలి మెతుకులు తిన్నను
సంగతి గలవాడు గౌరవమున బ్రతుకును
సంగతి లేని ధనికుడు
కంగారు పడును లోకమందు వేమా
పేదవాడైనా మంచి నడవడి ఉంటే గౌరవంగా బతుకుతాడు. నడవడి లేని ధనికుడు లోకంలో చులకన అవుతాడు. గౌరవం మాట, మర్యాద, దానం వల్ల వస్తుందన్నాడు బద్దెన.
– డా. కందాళ సత్యనారాయణ మూర్తి

నిర్వహణ: డి.వి.ఆర్‌. భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement