అందుకే.. త్వరగా ఫెయిల్ అవ్వు! | Fail Faster Learn Faster Robert Kiyosaki Shares a Powerful Life Lesson | Sakshi
Sakshi News home page

అందుకే.. త్వరగా ఫెయిల్ అవ్వు!

Aug 10 2026 9:11 PM | Updated on Aug 10 2026 9:22 PM

Fail Faster Learn Faster Robert Kiyosaki Shares a Powerful Life Lesson

జీవితంలో ఫెయిల్యూర్ అంటే చాలామందికి భయం. ఎందుకంటే.. ఏదైనా పని మొదలుపెట్టే ముందు ''ఇది ఫెయిల్ అయితే?'' అనే ఆలోచనే ఎక్కువగా ఉంటుంది. దీంతో రిస్క్ తీసుకోకుండా సేఫ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తారు. కానీ.. నిజానికి ఫెయిల్యూర్ అనేది అంతం కాదు.. మనం చేసిన తప్పుల నుంచి నేర్చుకునే అవకాశం. ఇదే విషయాన్ని రాబర్ట్ కియోసాకి తన జీవితంలో ఎదురైన అనుభవం ద్వారా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు.

25 ఏళ్ల వయసులో అతని మొదటి బిజినెస్ పూర్తిగా విఫలమైంది. దీంతో చాలా బాధపడ్డాను. ఎవరైనా తనను ఓదార్చాలని అనుకున్నాను. కానీ అతని రిచ్ డాడ్ మాత్రం ''నువ్వు చాలా త్వరగా ఫెయిల్ కాలేదు.. పనిచేయని బిజినెస్‌ను కాపాడటానికి చాలా కాలం ప్రయత్నించావు. అయితే మరోసారి త్వరగా ఫెయిల్ అవ్వు.. త్వరగా నేర్చుకో.. త్వరగా ముందుకు వెళ్లు'' అని చెప్పారు అని కియోసాకి అన్నారు.

ఆ సమయంలో ఆ మాటలు వినడం కష్టంగా అనిపించినా.. తర్వాత అవే తన జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయని కియోసాకి చెప్పారు. మనలో చాలామంది ఫెయిల్యూర్‌ను ఒక తీర్పులా చూస్తాం. ఒకసారి ఓడిపోతే మనలో సామర్థ్యం లేదని భావిస్తాం. అందుకే ..సేఫ్ జాబ్‌లోనే ఉండిపోతాం, కొత్త బిజినెస్ మొదలుపెట్టడానికి భయపడతాం, రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉంటాం.

కానీ.. ప్రయత్నించకపోవడం కూడా ఒక రకమైన నష్టమే. ఎందుకంటే ప్రయత్నిస్తే ఫెయిల్ కావచ్చు.. కానీ ప్రయత్నించకపోతే ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా ఉండదు.

మొదటి బిజినెస్ ఫెయిల్ అయిన తర్వాత అతను తన తప్పులను ఒక్కొక్కటిగా విశ్లేషించుకున్నన్నాను. డబ్బును సరిగ్గా నిర్వహించకపోవడం, సరైన బిజినెస్ భాగస్వాములను ఎంచుకోకపోవడం, తన ఆలోచనలను రక్షించుకోకపోవడం, కొద్దిమంది కస్టమర్లపైనే ఎక్కువగా ఆధారపడటం వంటి విషయాల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. రెండోసారి కూడా కొన్ని తప్పులు జరిగాయి. కానీ ఈసారి వాటి నుంచి మరిన్ని విషయాలు నేర్చుకున్నాను.

ఇక్కడ ''త్వరగా ఫెయిల్ అవ్వాలి'' అంటే కావాలని ఓడిపోవాలని కాదు. ఒక పనిని పట్టుకుని ఎక్కువ సమయం, డబ్బు వృథా చేయకూడదన్నదే అసలు అర్థం. ఒక ఆలోచన పనిచేయడం లేదని అర్థమైతే.. కారణం తెలుసుకుని మార్పులు చేయాలి లేదా మరో దారిలో ప్రయత్నించాలి. చిన్న స్థాయిలో తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకుంటే.. భవిష్యత్తులో పెద్ద నష్టాలను కూడా తప్పించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement