జనాభా లెక్కల్లో 40 కీలక ప్రశ్నలు | Census 2027, Complete List Of 40 Questions Covering Identity, Jobs, Education And More, Save & Share This Story | Sakshi
Sakshi News home page

Census 2027: జనాభా లెక్కల్లో 40 కీలక ప్రశ్నలు

Aug 16 2026 2:02 PM | Updated on Aug 16 2026 3:01 PM

Census 2027 The 40 Questions India Will Ask You Full List Key Details

భారతదేశంలో త్వరలో ప్రారంభం కానున్న ‘జనాభా లెక్కలు 2027’ ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విడత సెన్సెస్‌ లెక్కల సేకరణలో ప్రతి కుటుంబం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర హోంశాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ జనాభా లెక్కల రెండో దశ కోసం 40 ప్రశ్నల జాబితాను నోటిఫై చేసింది. వీటి సరళి దేశ సామాజిక, ఆర్థిక స్థితిగతులను విశ్లేషించడంలో కీలక పాత్ర పోషించనుంది.

ఈ సారి జనాభా గణనలో వ్యక్తుల ప్రాథమిక వివరాలు, విద్యా సంబంధిత విషయాలు, ఉపాధి మార్గాలు, వలసల కారణాలతో పాటు డిజిటల్ పురోగతిని ప్రతిబింబించే ప్రశ్నలను పొందుపరిచారు. ఆ ‍ప్రశ్నల సరళి కింది విధంగా ఉంది.

1. వ్యక్తి పేరు
2. కుటుంబ యజమానితో ఉన్న సంబంధం
3. జండర్‌(లింగం)
4. పుట్టిన తేదీ, వయసు
5. ప్రస్తుత వైవాహిక స్థితి
6. వివాహ సమయానికి వయసు (పూర్తయిన ఏళ్లలో)
7. జీవిత భాగస్వామి పేరు
8. జాతీయత
9. మతం
10. ఎస్సీ / ఎస్టీ / కులం
11. తండ్రి వివరాలు
12. తల్లి వివరాలు
13. దివ్యాంగులైతే వివరాలు
14. మాతృభాష, తెలిసిన ఇతర భాషలు
15. అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత
16. ఏదైనా విద్యాసంస్థలో ప్రస్తుతం హాజరవుతున్నారా?
17. అభ్యసించిన అత్యున్నత విద్య, విద్యా విభాగం (స్టీమ్/డిసిప్లిన్)
18. గత ఏడాదిలో ఏ సమయంలోనైనా పనిచేశారా?
19. ఆర్థిక కార్యకలాపాలు ఎలా ఉన్నాయి?
20. వృత్తి
21. పరిశ్రమ, వ్యాపారం లేదా సర్వీస్‌
22. కార్మిక వర్గం
23. నాన్-ఎకనామిక్ యాక్టివిటీ 
24. ఏదైనా పని కోసం చూస్తున్నారా?
25. పని ప్రదేశానికి వేరే ప్రాంతం నుంచి వచ్చారా?
26. జన్మస్థలం
27. చివరి నివాస ప్రాంతం
28. వలసకు గల కారణం
29. ఎప్పటి నుంచి ఈ వలస ప్రాంతంలో పని చేస్తున్నారు?
30. శాశ్వత నివాస చిరునామా
31. ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, విడాకులు పొందిన, విడిపోయిన మహిళలకు)
32. ఇప్పటివరకు జన్మించిన మొత్తం పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, విడాకులు పొందిన, విడిపోయిన మహిళలకు)
33. గత ఏడాదిలో జన్మించిన పిల్లల సంఖ్య
34. కొవిడ్-19 వ్యాక్సినేషన్ పొందిన ప్రదేశం
35. మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య
36. మొబైల్ నంబర్ 
37. ఆధార్ సంఖ్య 
38. ఓటర్ ఐడీ నంబర్ 
39. పాస్‌పోర్ట్ నంబర్ (భారతీయ పాస్‌పోర్ట్ ఉంటే)
40. డ్రైవింగ్ లైసెన్స్ (లభ్యత ఉంటే)

ఇది చదవండి: ఒరిజినల్‌ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement