చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని ఏఐ చాట్‌బాట్‌లలో అంతరాయం ఏర్పడింది. దీంతో పలు దేశాల్లోని వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు లక్షలాదిమందికి పైగా వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో సమస్యను నివేదించినట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది.
ఈ అంతరాయం కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. కాబట్టి ఈ సమస్య భారతదేశంతో పాటు.. యూకే, ఫ్రాన్స్, బెల్జియం, టర్కీ, జోర్డాన్, జార్జియా, గ్రీస్, స్పెయిన్, సింగపూర్, ఇండోనేషియా, వియత్నాం, స్విట్జర్లాండ్‌లలో కూడా తలెత్తింది. వినియోగదారులు జెమిని యాప్, ఏఐ జనరేషన్, లాగిన్, వెబ్‌సైట్ యాక్సెస్, లేటెన్సీతో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని ఏఐ సమస్యలపై సంబంధింత సంస్థలు అధికారికంగా స్పందించలేదు. అంతే కాకుండా సమస్యలకు కారణాన్ని కూడా వెల్లడించకపోవడం గమనార్హం. బహుశా ఈ సమస్య త్వరగానే పరిష్కరించబడే అవకాశం ఉంది.
ChatGPT and Claude both are down,
what am I supposed to do now? pic.twitter.com/rmDpRReQt6— Bhavani Ravi (@BhavaniRavi_) September 3, 2026
BREAKING: ChatGPT is currently down for many users. https://t.co/OJtj75vPEL
— Polymarket (@Polymarket) September 3, 2026


