10 వేల మంది ఏఐ స్పెషలిస్టుల సిద్ధం!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా గ్లోబల్ ఐటీ దిగ్గజం విప్రో సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాపార సంస్థలకు అత్యాధునిక సేవలందించేందుకు ఏకంగా 10,000 మంది ఏఐ సర్టిఫైడ్ స్పెషలిస్టులను తయారు చేయాలని నిర్ణయించింది. గూగుల్ మల్టీమోడల్ ఏఐ మోడల్ ‘జెమినీ’ ఆధారిత సొల్యూషన్స్‌ను రూపొందించడమే లక్ష్యంగా ఈ భారీ మానవ వనరుల శిక్షణా కార్యక్రమాన్ని చేపడుతోంది.
ఈ బృందంలో ప్రత్యేకంగా 1,500 మంది ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్లు ఉంటారు. వీరు నేరుగా క్లయింట్ ఆఫీస్ ప్రాంగణాలలోనే (ఆన్-సైట్) అందుబాటులో ఉంటూ సాంకేతిక సవాళ్లను తక్షణమే పరిష్కరించడంతో పాటు వ్యాపార ప్రక్రియల డిజిటలైజేషన్‌లో కీలక పాత్ర పోషిస్తారు.
విప్రో సొంత ఏఐ ప్లాట్‌ఫామ్ ‘విప్రో ఇంటెలిజెన్స్’కు గూగుల్ జెమినీ శక్తిని జత చేయడం ద్వారా క్లయింట్ కంపెనీలు తమ ఉత్పాదకతను, పనితీరును గణనీయంగా పెంచుకోగలవని విప్రో లిమిటెడ్ మేనేజింగ్ పార్ట్‌నర్ కన్వర్ సింగ్ వెల్లడించారు. జనరేటివ్ ఏఐ సేవలకు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడానికి ఈ వ్యూహాత్మక అడుగు ఎంతో దోహదపడుతుందని ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా?


