యువర్స్
స్ట్రెస్ బస్టర్ హార్మోని
మానసిక సమస్యలతో బాధ పడుతున్నవారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ‘జటిలమైన మందులు అవసరం లేదు. మ్యూజిక్ వినండి చాలు’ అంటూ ముందుకు వచ్చింది ఏఐ–ఆధారిత ఆడియో విజువల్ ప్లాట్‌ఫామ్... హార్మోని. ‘హార్మోని’ అనే రిసెర్చ్ ప్రాజెక్ట్ ప్రయోగదశలో సత్ఫలితాలను ఇస్తోంది. ఎంతోమందిని ఒత్తిడికి దూరం చేసింది.
వాషింగ్టన్‌కు చెందిన అనూష అరోరా రీజెనరాన్‌కి పదిహేనేళ్లు. అనూష వ్యక్తిగత అనుభవం నుంచే ‘హార్మోని’ ఆవిష్కృతమైంది. ఆమె తల్లి ఒత్తిడిగా అనిపించినప్పుడు సంగీతం వినేది. ఫలితంగా ఆమెకు ఎంతో రిలీఫ్‌గా అనిపించిందేని చెప్పేది. అప్పటి నుంచి అనూష సరికొత్త మ్యూజిక్ థెరపీ ప్లాట్‌ఫామ్ గురించి ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ టెక్నాలజీ సహాయంతో మరింత పర్సనలైజ్ మ్యూజిక్ థెరపీని అందించే దిశలో పరిశోధన చేయడానికి నడుం కట్టింది. తనప్రాజెక్ట్‌కు ‘హార్మోని’ అని నామకరణం చేసింది.
డేటాను అర్థం చేసుకొని...
ముందుగా నిర్ణయించిన ప్లే లిస్ట్‌లపై ఆధార పడకుండా వ్యక్తులలోని భావోద్వేగ స్థితిగతులకు అనుగుణంగా స్పందించే ఒక పోర్టబుల్ ప్లాట్‌ఫామ్‌గా ‘హార్మోని’ రూపొందించింది అనూష. వేలి సెన్సార్లు శారీరక సమాచారాన్ని అందిస్తాయి. దానిని ‘హార్మోని సిస్టమ్ విశ్లేషిస్తుంది. ఏఐ మోడల్స్ ఆ డేటాను అర్థం చేసుకొని భావోద్వేగ స్థితికి అనుగుణంగా ఉండే సంగీతాన్ని, దృశ్యాలను అందిస్తాయి.
భావోద్వేగాలను గుర్తించడానికి, సంగీతాన్ని రూపొందించడంలో వివిధ అంశాలను సమన్వయం చేయడానికి 11 ఏఐ ప్రోగ్రామ్స్‌ను ‘హార్మోని’ మిక్స్ చేస్తుంది. తద్వారా తన ఔట్‌పుట్‌ను రియల్‌టైమ్‌లో సర్దుబాటు చేసుకోగలుగుతుంది. ఇప్పటికైతే ‘హార్మోని’ ఒక రిసెర్చ్‌ప్రాజెక్ట్‌గా మాత్రమే కొనసాగుతోంది. ఏఐ–ఆధారిత మ్యూజిక్ థెరపీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన అనూష ఐఎస్‌ఇఎల్ 2026లో ఫ్యామిలీ ప్రైజ్ ఫర్ స్టెమ్ ఎక్స్‌లెన్స్ అవార్డును, 50 వేల డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకుని తన తోటివారికి ఆదర్శంగా నిలిచింది.
ఇవీ చదవండి: ఒక్క మాట.. ఓ కవిత.. ఓ కప్పు టీ.. వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగు!


