మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఏఐ మూవీ అంబాస్ రివెంజ్. ఈ చిత్రాన్ని జైవర్ధన్ మేడి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ మూవీకి యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన ఈ విజువల్ ఫీస్ట్ మహాభారతంలోని అంబ ప్రతీకారం ఆధారంగా తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో మహాభారతంలో భీష్ముని వల్ల ఒక జన్మలో మరణించిన కారణం, మరో జన్మలో భీష్మునిపై ఆమె పగ తీర్చుకున్న ప్రయాణాన్ని చూపించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ... "సినిమా అంబ అయినప్పటికీ ఈ సినిమా శిఖండి నుంచి చూడబోతున్నాం. ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ఈ టీజర్ విడుదల చేశాం. ఇందులో ఎలాంటి డైలాగ్స్ కూడా లేవు. త్వరలో ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది' అని అన్నారు.
నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ... 'ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎఐలో సినిమా చేయడం చాలా ఖర్చుతో కూడిన విషయం. సాధారణంగా ఇటువంటి సినిమా చేయాలంటే తక్కువ ఖర్చు అనుకుంటారు. కానీ మేము ఒక టూల్ ఉపయోగించేలోపు మరొక టూల్ వస్తుంది. అలా అంబాకు ఖర్చు ఎక్కువైంది. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది' అని అన్నారు.


