కింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వందో సినిమా అప్‌డేట్ | Nagarjuna Landmark 100th Movie Gets A Major Update, First Look To Arrive On His Birthday, Deets Inside | Sakshi
Sakshi News home page

Nagarjuna: కింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వందో సినిమా అప్‌డేట్

Aug 28 2026 6:58 AM | Updated on Aug 28 2026 12:07 PM

Akkineni Nagarjuna 100th Movie Update Goes Viral

టాలీవుడ్ కింగ్ నాగార్జున మూవీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న వారికి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా నాగ్ వందో మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 29న నాగార్జున బర్త్‌ డే సందర్భంగా రివీల్ చేస్తామని ఓ వీడియో పంచుకున్నారు.

ఈ సినిమాకు రా కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వందో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.  ఈ మూవీలో టబు కీలక పాత్రలో కనిపించనుంది. ఈ ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా  టైటిల్‌ టీజర్‌ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  రాక్‌స్టార్‌ కింగ్‌ సైజ్‌ స్కోర్‌ లోడింగ్‌ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ చిన్న వీడియోను పంచుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ‍అప్‌డేట్ రాలేదు. ఈ బర్త్‌ డేకు నాగ్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌ తేదీ ప్రకటించే అవకాశముంది. ఈ మూవీ దసరాకు రిలీజ్ కానుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement