'మనోజ్‌తో మౌనిక పెళ్లి.. మోహన్‌ బాబు వెంటనే ఒప్పుకోలేదు' | Bhuma Akhila Priya Reveals Why Manchu Manoj Had To Marry Mounika Quickly Amid Family Differences, Read Story Inside | Sakshi
Sakshi News home page

Manchu Manoj- Mounika: 'మనోజ్‌తో చెల్లి పెళ్లి.. మోహన్‌ బాబు వెంటనే ఒప్పుకోలేదు'

Aug 28 2026 9:10 AM | Updated on Aug 28 2026 9:10 AM

Bhuma Akhila Priya Reveals Manchu Manoj Mounika Marriage Rumours

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరిగ్గా మూడేళ్ల క్రితం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ పొలిటిషియన్ భూమా నాగిరెడ్డి కూతురు మౌనికను ఆయన పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి  ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. ప్రస్తుతం ఈ జంట తమ లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. మనోజ్ సైతం సినిమాలతో కెరీర్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు ఓ పెళ్లి వేడుకలోనూ సందడి చేశారు.

ఇదంతా పక్కనపెడితే మంచు మనోజ్ పెళ్లి తర్వాత చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంచు ఫ్యామిలీలో విష్ణుకు, మనోజ్‌కు మధ్య గొడవలు కూడా జరిగాయి. మౌనికతో పెళ్లి తర్వాతే ఈ వివాదాలు తలెత్తాయి. మంచు మనోజ్- మౌనిక పెళ్లి మోహన్‌బాబుకు ఇష్టం లేదని గతంలో వార్తలు కూడా వచ్చాయి.

అయితే మంచు మనోజ్- మౌనిక పెళ్లి గురించి ఆమె సిస్టర్, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె వీరిద్దరి పెళ్లికి మోహన్‌బాబు త్వరగా ఒప్పుకోలేదన్నారు. మంచు మనోజ్‌- మౌనికను పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని అడిగారని చెప్పింది. అయితే తాము ఈ పెళ్లి వెంటనే జరగాలని మనోజ్‌తో చెప్పామని అఖిల ప్రియ వెల్లడించారు. ఈ పెళ్లికి మా ఫ్యామిలీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆమె తెలిపారు. కాకపోతే మా తమ్ముడు, నేను ఎఫెక్ట్ ‍అవ్వకూడదనే త్వరగా పెళ్లి చేసుకోవాలని మాత్రమే చెప్పామని భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు.

కాగా.. మంచు మనోజ్‌-మౌనిక రెడ్డిల వివాహం ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్‌-మౌనికలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2023 మార్చి 3వ తేదీన రాత్రి 8.30నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా మనోజ్‌- మౌనిక మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement