'అదే మాట శాశ్వతంగా గుడ్‌బై అవుతుందనుకోలేదు' | Chiranjeevi Pays Tribute To JV Narayana Rao Mortal Remains | Sakshi
Sakshi News home page

ఆయనతో అనుబంధం ఇప్పటిదికాదు: చిరంజీవి

Aug 28 2026 10:54 AM | Updated on Aug 28 2026 12:04 PM

Chiranjeevi Pays Tribute To JV Narayana Rao Mortal Remains

ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి శుక్ర‌వారం నివాళులు అర్పించారు. హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన చిరంజీవి.. నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

‘ఫిలిం ఇన్‌స్టిట్యూట్ రోజుల నుంచి మా ఇద్దరికి పరిచయం మొదలైంది. తను అప్పటికే ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్. మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు తన అనుభవాలను పంచుకునేవారు. అలా మాకు దగ్గరయ్యారు. అలా ఆయన నిర్మాణంలో రెండు చిత్రాలు చేశాం. నా సినిమాల్లో తనకు నటుడిగా కూడా అవకాశాలు వచ్చాయి. అలా మా అనుబంధం కొనసాగుతూ వచ్చింది’ అని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు.

 ఆ మాట శాశ్వతంగా గుడ్‌బై అవుతుందని అనుకోలేదు
‘ఇటీవలే ఆయన ఓ సినిమా చేశారు. ట్రైలర్‌ లాంచ్‌ నన్ను చేయమన్నారు. కచ్చితంగా చేస్తానని చెప్పి చాలా సమయం మాట్లాడుకున్నాం. తనకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పా. కానీ అదే మాట శాశ్వతంగా గుడ్‌బై అవుతుందని అనుకోలేదు. నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని చిరంజీవి అన్నారు.

ఇదీ చ‌ద‌వండి: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘ‌న‌త‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement