యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైంది. తొలిరోజే నెగెటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా బాగానే రాణించింది. మొదటి రోజే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. యశ్ నటన మినహాయిస్తే కథలో బలం లేకపోవడం టాక్సిక్‌ను దెబ్బతీసింది.
మొదటి రోజు వసూళ్లపరంగా రాణించిన టాక్సిక్.. రెండో రోజే చతికిలపడింది. నెగెటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు మొహం చాటేశారు. దీంతో టాక్సిక్ కేవలం రూ. 49.75 కోట్లకే పరిమితమైంది. దీంతో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 190.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ధురందర్ 2, పుష్ప 2, కేజీఎఫ్: చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాల కంటే వెనకే ఉంది. ధురందర్ 2 రెండో రోజు ఇండియాలోనే సుమారు రూ. 80.72 కోట్ల నికర వసూళ్లు సాధించగా.. పుష్ప 2 రూ. 93.80 కోట్ల నెట్, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ. 90.50 కోట్లు, ఆర్ఆర్ఆర్ రూ. 86.70 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టాయి.
కాగా.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన రెండో రోజే తేలిపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోనుంది. ఈ మూవీ ఇండియా వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 137.50 కోట్ల నెట్.. రూ. 164.50 కోట్ల కలెక్షన్స్‌కే పరిమితమైంది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు.


