ఏంటి..? ఏఐ ఇప్పుడు వైరస్‌లను కూడా రూపొందిస్తోందా? | AI Designed Viruses Bacteria Stanford Synthetic Biology | Sakshi
Sakshi News home page

ఏంటి..? ఏఐ ఇప్పుడు వైరస్‌లను కూడా రూపొందిస్తోందా?

Aug 28 2026 9:02 AM | Updated on Aug 28 2026 9:02 AM

AI Designed Viruses Bacteria Stanford Synthetic Biology

యువర్స్‌

ఐతో ఇప్పటిదాకా చిత్రాలను, చిన్నచిన్న వీడియోలను తయారు చేయడం మనకు తెలుసు... కొందరు కోడింగ్‌ కోసం ప్రాంప్ట్‌ ఇస్తారు. ప్రాజెక్టు పనులకు కోసం వివరాలు వెతుకుతారు, మరికొందరు కొత్త రకం సినిమా కథలను తయారు చేయడం, సంగీతాన్ని సృష్టించడం కోసం ఏఐని వాడుతున్నారు.

అయితే, తాజా పరిశోధనల ఫలితంగా జీవుల జన్యు నిర్మాణాన్ని కూడా రూపొందించే దిశగా కృత్రిమ మేధా అడుగులు వేస్తోంది. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆర్క్‌ సంస్థ పరిశోధకులు కృత్రిమ మేధస్సును ఉపయోగించి ప్రకృతిలో ఇంతకు ముందు లేని 16 కొత్త వైరస్‌లను రూపొందించారు. వీటితో మానవాళికి ప్రమాదం లేదు. ఎందుకంటే ఇవి మనుషులకు సోకేవి కావు.

మనుషులను బాధించే  బ్యాక్టీరియాను నాశనం చేసే వైరస్‌. మందులకు లొంగని బ్యాక్టీరియాని ఈ తరహా వైరస్‌లతో ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నం ప్రయోగశాలలోనే ఉంది. ఏఐతో రూపొందించిన వైరస్‌ తయారై మార్కెటెక్కాలంటే మరి కొన్నేళ్లు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి: మందులు కాదు.. మ్యూజిక్‌ చాలు! ఏఐతో మానసిక ఒత్తిడికి చెక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement