డీల్ విలువ రూ. 388 కోట్లు
న్యూఢిల్లీ: విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్.. తాజాగా చర్మ సంరక్షణ (స్కిన్‌కేర్) బ్రాండ్ డెర్మాటచ్‌ను రూ. 388 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువలో కొనుగోలు చేయనుంది. తొలుత 60 శాతం వాటాను దాదాపు రూ. 233 కోట్లకు సొంతం చేసుకోనుంది. మిగిలిన 40 శాతం వాటాను కొన్నేళ్లలో కొనుగోలు చేయనున్నట్లు రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. తాజా కొనుగోలు ద్వారా విప్రో కన్జూమర్ వేగవంత వృద్ధిలో ఉన్న ప్రీమియం స్కిన్‌కేర్ విభాగంలోకి ప్రవేశించనుంది.


