చర్మ సంరక్షణ కోసం సరికొత్త ఎల్ఈడీ మాస్క్ అందుబాటులోకి వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఆకాసో రూపొందించిన మైక్రో ఎల్ఈడీ స్కిన్‌కేర్ మాస్క్‌లో ఉండే మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీ చర్మం బిగుతుగా మారడానికి, ముడతలపై పేరుకుపోయిన జిడ్డును తొలగించడానికి, మొటిమలు తగ్గించడానికి సహాయపడుతుంది.
ఈ డివైజ్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన డిస్‌ప్లే ప్యానెల్‌తో, బ్యాటరీలో మిగిలిన ఛార్జింగ్ వంటి వివరాలు కనిపిస్తుంటాయి. ఇందుకోసం మాస్క్‌ను తొలగించాల్సిన అవసరం లేదు. దీనికోసం ప్రత్యేకంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాల్సిన పని ఉండదు.


