కిడ్స్ స్పెషల్
ప్రాణి ప్రపంచం
అందాల పోటీలు మనుషులకే కాదు... ఇలా పిల్లులకు కూడా జరుగుతాయి. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ సమీపంలో ఉన్న విజ్‌ఫూజెన్ ప్రాంతంలో ఇటీవల‘ఫిఫే వరల్డ్ షో 2026’ అనే ప్రపంచంలోనే అతిపెద్ద పిల్లుల పోటీ జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ అందాల పోటీలో ప్రపంచం నలుమూలల నుండి 1500 రకాల పిల్లులు పాల్గొన్నాయి.
వాటి యజమానులు తమ ముద్దుల పిల్లులను ఎత్తుకుని జడ్జీల ముందు చూపిస్తుంటే, జడ్జీలు వాటి అందాన్ని, నైపుణ్యాన్ని బట్టి 34 ప్రపంచ టైటిళ్లను బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ పిల్లుల గురించి మనకు తెలియని కొన్ని అద్భుతమైన రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం!
పిల్లులు తమ చెవులను ఏకంగా 180 డిగ్రీల వరకు తిప్పగలవు. వాటి చెవుల్లో 32 ప్రత్యేక కండరాలు ఉంటాయి. అందుకే ఎంత చిన్న శబ్దమైనా అవి చప్పున పసిగట్టేస్తాయి.
పిల్లుల వెన్నుముక చాలా సరళంగా ఉంటుంది. అందుకే అవి తమ ఎత్తు కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ ఎత్తుకు సులభంగా దూకగలవు! చీకట్లో పిల్లులకు మనుషుల కంటే ఆరు రెట్లు బాగా కనిపిస్తుంది. వాటి కళ్ల వెనుక ఉండే ఒక ప్రత్యేక ΄÷ర కాంతిని ప్రతిబింబింపజేస్తుంది, అందుకే చీకట్లో వాటి కళ్లు మెరుస్తాయి.
పిల్లుల ముందు కాళ్లకు ఐదు వేళ్లు, వెనుక కాళ్లకు నాలుగు వేళ్లు ఉంటాయి. అంటే మొత్తం 18 వేళ్లు ఉంటాయి.
పిల్లులు తమ జీవిత కాలంలో 70 శాతం సమయాన్ని నిద్రపోవడానికే కేటాయిస్తాయి. అంటే ఒక పిల్లి 9 ఏళ్లు బతికితే అందులో 6 ఏళ్లు నిద్రలోనే గడిపేస్తుంది!
మనుషులకు వేలిముద్రలు ఎంత ప్రత్యేకమో పిల్లులకు వాటి ముక్కు ముడతలు అంత ప్రత్యేకం. ప్రపంచంలో ఏ రెండు పిల్లుల ముక్కు గుర్తులు ఒకేలా ఉండవు.
ఈసారి మీ ఇంట్లో పిల్లి కనిపించినప్పుడు ఈ విషయాలన్నీ గుర్తు తెచ్చుకోండి మరి!
ఇదీ చదవండి: 99 సంవత్సరాల వయసులో... విమానం రెక్కలపై!


