breaking news
AI Chatbot
-
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని ఏఐ చాట్బాట్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో పలు దేశాల్లోని వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు లక్షలాదిమందికి పైగా వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో సమస్యను నివేదించినట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది.ఈ అంతరాయం కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. కాబట్టి ఈ సమస్య భారతదేశంతో పాటు.. యూకే, ఫ్రాన్స్, బెల్జియం, టర్కీ, జోర్డాన్, జార్జియా, గ్రీస్, స్పెయిన్, సింగపూర్, ఇండోనేషియా, వియత్నాం, స్విట్జర్లాండ్లలో కూడా తలెత్తింది. వినియోగదారులు జెమిని యాప్, ఏఐ జనరేషన్, లాగిన్, వెబ్సైట్ యాక్సెస్, లేటెన్సీతో సమస్యలను ఎదుర్కొంటున్నారు.చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని ఏఐ సమస్యలపై సంబంధింత సంస్థలు అధికారికంగా స్పందించలేదు. అంతే కాకుండా సమస్యలకు కారణాన్ని కూడా వెల్లడించకపోవడం గమనార్హం. బహుశా ఈ సమస్య త్వరగానే పరిష్కరించబడే అవకాశం ఉంది.ChatGPT and Claude both are down, what am I supposed to do now? pic.twitter.com/rmDpRReQt6— Bhavani Ravi (@BhavaniRavi_) September 3, 2026BREAKING: ChatGPT is currently down for many users. https://t.co/OJtj75vPEL— Polymarket (@Polymarket) September 3, 2026 -
ఏఐ ని ఉపయోగించండి... కానీ గుడ్డిగా నమ్మకండి !
మా తమ్ముడు ఐటీ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి ఎక్కువగా మాట్లాడేవాడు కాడు కానీ చదువులో చురుకైన వాడు. గత నాలుగేళ్లుగా హైబ్రిడ్ మోడ్‌లో పనిచేస్తున్నాడు. ఆరు నెలలుగా పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇటీవల కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ముఖ్యంగా ఏఐ చాట్‌బాట్‌తో గంటల తరబడి మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న విషయాలు మనకు కనిపిస్తున్నట్టు నిజాలు కావని, ఏలియన్స్ ఉన్నాయని, ప్రపంచంలో త్వరలో ప్రళయం రాబోతోందని చెబుతున్నాడు. ఆ ప్రళయాన్ని ఆపడానికి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నానని, ఆ సాఫ్ట్‌వేర్‌ను అందరి ఫోన్లలో పెట్టిస్తే ప్రపంచాన్ని కాపాడవచ్చని అంటున్నాడు. అంతేకాదు, తన ప్రాజెక్టు గురించి ఎలన్ మస్క్‌కు, అమెరికా ప్రభుత్వానికి తెలిసిపోయిందని, ఉపగ్రహాల ద్వారా తనను గమనిస్తున్నారని, తన ఫొటోలు తీస్తున్నారని, తన ప్రాజెక్టును అడ్డుకోవడానికి తనపై కుట్ర జరుగుతోందంటూ ఇంటి నుంచి బయటకు రావడం మానేశాడు. స్నానం, తిండి, నిద్ర కూడా సరిగా లేవు. ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఇంట్లో లైట్లు ఆపేసి ఉంచుతాడు. గట్టిగా మాట్లాడితే అమెరికాకు తెలిసిపోతుందంటాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే రావడం లేదు. ఇంత తెలివైన వాడు కాస్తా ఇలా మారిపోవడంతో మాకు చాలా భయంగా ఉంది. మేము ఏం చేయాలి? – రమేశ్, తిరుపతిమీరు వివరించిన పరిస్థితిని బట్టి మీ తమ్ముడిలో సైకోసిస్‌కు సంబంధించిన స్పష్టమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. తనను అమెరికా ప్రభుత్వం, ఉపగ్రహాలు గమనిస్తున్నాయని నమ్మడం, తనపై కుట్ర జరుగుతోందని భావించడం, ప్రపంచాన్ని కాపాడే ప్రత్యేక బాధ్యత తనకుందని అనుకోవడం వంటి వాటిని భ్రమాత్మక నమ్మకాలు అంటే డెల్యూజన్స్ అంటారు. రోగిని ప్రత్యక్షంగా పరీక్షించి, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఇది ‘స్కిజోఫ్రీనియా’ అనే వ్యాధి అవునా కాదా అని తెలుస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కృత్రిమ మేధ (ఏఐ). ఏఐ అనేది మానవులకు లభించిన శక్తిమంతమైన సాధనం. చదువు, పరిశోధన, ఉద్యోగం, కోడింగ్, కొత్త విషయాలు తెలుసుకోవడం వంటి పనులకు ఉపయోగిస్తే ప్రయోజనం. కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. ఒక పదునైన కత్తితో పండ్లు కోయవచ్చు, గాయపరచవచ్చు కూడా. ఏఐ కూడా అంతే. ఇప్పటికే భ్రమాత్మక ఆలోచనలు ఉన్న వ్యక్తి తన ప్రతి అనుమానాన్ని ఏఐతో చర్చించి, వచ్చే సమాధానాలను నిజాలుగా భావిస్తే, ఆ భ్రమలు మరింత బలపడే అవకాశం ఉంది. ఏఐలో కనిపించే ‘సైకోఫాన్సీ’ అనే ధోరణి కూడా దీనికి కారణం కావచ్చు. అంటే వినియోగదారుడు చెప్పింది నిజమా కాదా అని తగినంతగా పరిశీలించకుండా, అతన్ని సంతృప్తి పరచడానికి అతని అభి్రపాయాన్ని అంగీకరించడం లేదా సమర్థించడం. ఏఐ ఒక సమాచార సహాయకుడు మాత్రమే. అది చెప్పింది కాబట్టి అది నిజం కాదు. ఇకపోతే మీ తమ్ముడి పరిస్థితి మాత్రం ప్రస్తుతం తీవ్రంగా ఉందనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రతను పట్టించుకోకపోవడం, సరిగ్గా తినకపోవడం, ఉద్యోగం చేయలేక పోవడం, ఇంటినుంచి బయటకు రాకపోవడం వంటి లక్షణాలున్నందున వీలైనంత త్వరగా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. ఆసుపత్రికి రావడానికి నిరాకరిస్తే కుటుంబ సభ్యులు ముందుగా వైద్యుడిని సంప్రదించి పరిస్థితిని వివరించాలి. అతనికి ఇష్టం లేకపోయినా, అతని ఆరోగ్యం, భద్రత దృష్ట్యా అవసరమైన సందర్భాల్లో ఇంటినుంచి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే వెసులుబాటు కూడా ఉంది.మరో విషయం... చదువు, తెలివితేటలు మానసిక అనారోగ్యానికి రక్షణ కవచాలు కావు. ఎంత తెలివైన... చదువుకున్న వ్యక్తికైనా మానసిక సమస్యలు రావచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా, వీలైనంత త్వరగా మీకు సమీపంలోని మానసిక వైద్య నిపుణులను సంప్రదించండి.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ:sakshifamily3@gmail.com -
చాట్బాట్ల 'వలపు' వల
సాక్షి, హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంమానవ జీవితాన్ని ఎంతగా సులభతరం చేస్తోందో, అంతేస్థాయిలో నేరగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్లో జరిగే మోసాలు ఇప్పుడు మరింత ప్రమాదకరమైన మలుపు తిరిగాయి. ఇప్పటివరకు కేవలం మనుషులు మాత్రమే చేసే ఆన్లైన్ ప్రేమ మోసాల్లోకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశించింది. చాట్‌జీపీటీ, జెమినై, క్లాడ్ వంటి ఆధునిక చాట్బాట్లు మనుషుల కంటే అత్యంత ప్రభావవంతంగా బాధితుల నమ్మకాన్ని చూరగొంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏఐకే రేటింగ్స్భారత్కు చెందిన అమృత విశ్వవిద్యాపీఠం, ఇటలీకి చెందిన ఫోస్కారి విశ్వవిద్యాలయం, ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్ వర్సిటీ, ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. సాధారణ మనుషులకు, కృత్రిమ మేధ చాట్బాట్లకు మధ్య ఒక నియంత్రిత పోటీని ఏర్పాటు చేశారు. ఈ సంభాషణల్లో పాల్గొన్న బాధితులకు తాము ఒక యంత్రంతో మాట్లాడుతున్నామా లేదా మనిషితో మాట్లాడుతున్నామా అనే విషయం తెలియదు.చివరకు ఫలితాలను విశ్లేషించగా మానవ నేరగాళ్ల కంటే ఏఐ చాట్బాట్లు అత్యంత ప్రతిభావంతంగా మనుషులను అనుకరిస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకున్నట్లు తేలింది. సాధారణంగా ఒక మానవ నేరగాడు చాట్ చేసిన తర్వాత ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని కోరితే 18 శాతం మంది మాత్రమే అంగీకరించారు. కానీ అదే అభ్యర్థన ఏఐ చాట్‌బాట్ నుంచి వచ్చినప్పుడు 50 శాతం మంది అంగీకరించి ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిని బట్టి మనుషుల కంటే ఎక్కువగా కృత్రిమ మేధకే ప్రజలు నమ్మకపు రేటింగులు ఇచ్చారని పరిశోధకులు గుర్తించారు. విస్తరిస్తున్న మోసాల నెట్వర్క్ సాధారణంగా ప్రేమ మోసాలు అనేవి చాలాకాలం నుంచి సాగుతున్న నేరాలు. నేరగాళ్లు నకిలీ ఖాతాలను సృష్టించి, వారాలు లేదా నెలల తరబడి రోజూ బాధితులతో మాట్లాడుతూ నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ తర్వాత ఏదైనా అత్యవసర పరిస్థితి అని చెప్పి లేదా నకిలీ డిజిటల్ కరెన్సీ పెట్టుబడుల పేరుతో డబ్బులు గుంజుతారు. అయితే మానవ నేరగాళ్లకు సమయం, శ్రమ పరిమితులు ఉంటాయి. కానీ ఏఐకి అటువంటి పరిమితులు ఏవీ లేవు. ఏఐ సహాయంతో నేరగాళ్ల నెట్‌వర్క్‌లు ఒకే సమయంలో వేలాది మంది బాధితులతో సంభాషణలు సాగించగలవు. ఇవి ఏమాత్రం అలసట లేకుండా, నిరంతరాయంగా స్పందించగలవు. సంభాషణల శైలి చాలా సహజంగా ఉండటం వల్ల ప్రస్తుత భద్రతా వ్యవస్థలు కూడా వీటిని గుర్తించలేకపోతున్నాయి. కేవలం చివరి దశలో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసే సమయంలో మాత్రమే మానవ నేరగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఇది నేరగాళ్లకు తమ మోసాలను ప్రపంచవ్యాప్తంగా భారీగా విస్తరించడానికి వీలు కల్పిస్తోంది.మానవ అక్రమ రవాణా.. ఈ సాంకేతికత కేవలం ఆర్థిక మోసాలకే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా జరిగే మానవ అక్రమ రవాణాకు కూడా సాధనంగా మారుతోంది. విదేశాల్లో భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ ప్రకటనల వెనుక పెద్ద ముఠాలు ఉంటున్నాయి. ఇవి కూడా కృత్రిమ మేధను ఉపయోగించి వివిధ భాషల్లో ఆకర్షణీయ సందేశాలను తయారు చేస్తున్నాయి. ఈ మాయలో పడి ఏటా లక్షలాది మంది మోసపోతున్నారు.జాగ్రత్త పడటం ఎలా? తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగాలకు అసాధారణ రీతిలో భారీ జీతాలు ఆఫర్ చేయడం, ఉద్యోగ వివరాలు స్పష్టంగా లేకపోవడం, వెంటనే చేరాలని ఒత్తిడి చేయడం వంటివి మోసాలకు ప్రధాన సంకేతాలు. తెలియని వ్యక్తులతో ఆన్లైన్ సంభాషణలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా తక్కువ సమయంలోనే ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తూ, ఆ తర్వాత ఆర్థిక సహాయం, పెట్టుబడుల గురించి మాట్లాడితే అనుమానించాలి. -
ఇదో కొత్త చికాకు... ‘ఏఐ సైకోసిస్’!
సాక్షి, హైదరాబాద్: ఏఐ సైకోసిస్.. ఇది కొత్తగా వచ్చిన ఓ మానసిక రుగ్మత. ఏఐ చాట్బాట్లతో ఎక్కువ సమయం గడపడం వల్ల, మానసిక సమస్యలున్న వారు లేదా దుర్బలమైన మనస్తత్వం ఉన్న వారు నిజం, అబద్ధం మధ్య తేడాను గుర్తించలేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. వాస్తవ పరిస్థితులకు దూరంగా... ఏఐ తమకు మాత్రమే నిజమైన, దైవిక లేదా రహస్య సందేశాలు ఇస్తోందని నమ్మే భ్రమని యూజర్లలో కలిగిస్తుంది. ఏఐ చాట్బాట్లు యూజర్లు చెప్పేదానికి ఎక్కువగా తల ఊపుతూ, వాటిని నిజమేనని (సైకోఫాన్సీ) సమర్థిస్తాయి. దీనివల్ల యూజర్లు ఏఐకి ప్రాణం ఉందని, అది సజీవంగా ఉందని భ్రమిస్తారు. ఒంటరిగా ఉన్న వారు ఏఐతో మితిమీరిన స్నేహం లేదా ప్రేమలో పడి, నిజమైన మానవ సంబంధాలను దూరం చేసుకోవడంతోపాటు తీవ్రస్థాయిలో భావోద్వేగాలకు గురయ్యే అవకాశాలుంటాయి.భ్రమలు – నమ్మకాలుబ్రిటన్, అమెరికాతోపాటు పలు దేశాల్లో పలువురు వ్యక్తులు తమ ఏఐ సహచరుడు తమకు ప్రత్యేకమైన దైవిక శక్తులు ఇచ్చాడని లేదా ప్రపంచ రహస్యాలను ఛేదించే మిషన్ అప్పగించాడని నమ్మినట్లు పరిశోధకులు గుర్తించారు. యూకేలో ఒక వ్యక్తి ఏఐ ప్రోద్బలంతో రాణిపై దాడికి కుట్ర పన్నగా, బెల్జియంలో మరొకరు తీవ్రమైన ఆందోళనలతో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా టీనేజర్లు సైతం ఏఐ వ్యసనానికి గురై తీవ్ర మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రాత్రంతా ఏఐతో చాట్లతో నిమగ్నం కావడం వల్ల నిద్రలేమితోపాటు ఒంటరితనం ఏర్పడి, మెదడుపై తీవ్ర ప్రభావం పడి సైకోసిస్ లక్షణాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సైకోసిస్ అనేది ఒక మానసిక రుగ్మత స్థితి. ఇది వైద్యపరంగా అధికారికంగా గుర్తించిన జబ్బు కానప్పటికీ, మానసిక నిపుణులు తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు.ప్రధాన కారణాలివీ..» ఏఐ చాట్బాట్లు యూజర్ల ఆలోచనలను ఎప్పుడూ సమర్థిస్తూ సమాధానాలు ఇస్తాయి. ఒక వ్యక్తికి తప్పుడు లేదా వింత ఆలోచనలు ఉన్నా, ఏఐ వాటిని నిజమే అని నమ్మించి భ్రమలను పెంచుతుంది.» కొన్నిసార్లు ఏఐ తనకు తెలియని విషయాలను కూడా తప్పుడు సమాచారంతో వాస్తవం లాగా సృష్టిస్తుంది. దీనిని నమ్మి యూజర్లు మతిస్థిమితం కోల్పోతారు» రాత్రంతా ఏఐతో చాటింగ్ వల్ల నిద్ర కరువై, మెదడు పనితీరు దెబ్బతింటుంది. సమాజానికి దూరంగా ఒంటరిగా ఉండటం వల్ల వాస్తవ జ్ఞానం నశిస్తుంది.వివిధ దేశాల్లో కేసులు...» 2026లో క్యారెక్టర్.ఏఐ, గూగుల్ వంటి సంస్థలపై పలు కుటుంబాలు దావాలు వేశాయి. మైనర్ పిల్లలు ఏఐ చాట్బాట్లను నిజమైన స్నేహితులుగా, ప్రేమికులుగా భావించి, మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి.» నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం కొంతమంది యూజర్లు ఏఐ తమకు ప్రత్యేక శక్తులు ఇచ్చిందని, ప్రపంచాన్ని రక్షించే మిషన్ అప్పగించిందని నమ్మడం ప్రారంభించారు.» ఫాస్ట్ కంపెనీ నివేదిక ప్రకారం... వ్యాపార రంగంలో 44% మంది మేనేజర్లు తమ సొంత తెలివితేటల కంటే ఏఐ ఇచ్చే సలహాలనే గుడ్డిగా నమ్ముతున్నారు. ఇది ఓ రకమైన సామూహిక ఆధారపడే తత్వానికి దారితీస్తోంది. -
Dr. AI బ్యూటిప్స్ వికటిస్తాయి?!
టీనేజర్: మొటిమలు రాకుండా ఏం చేయాలి?యువతి: డ్రై స్కిన్‌ను ఎలా మెరిపించాలి? మహిళ: ముడతల నివారణకు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి? బ్యూటీకి సంబంధించిన ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఏఐ చాట్బాట్లో విస్తృతంగా కనిపిస్తుంటాయి. అడిగిన వెంటనే ఎలాంటి సమస్యకైనా ఏఐ ద్వారా ఇట్టే సమాధానమూ లభిస్తుంది. దానిని అమలులో పెట్టినవాళ్లు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారో మాత్రం తెలియాల్సి ఉంది. జెనరేటివ్ ఏఐ వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో ‘బ్యూటీ’ టార్చర్‌కు గురవుతుందా?!నిజమిదీ... ఇటీవల ఆస్టిన్ సిటీ ఎయిర్‌పోర్ట్‌లో క్లెపాక్ అనే మహిళా ఫొటోగ్రాఫర్ ‘బ్యూటీ అథారిటీ’ అనే మ్యాగజీన్‌ను చూసి, చాలా ఇంప్రెస్ అయ్యింది. ఆ మ్యాగజీన్లోని అందమైన యువతుల ఫొటోలు చూసి, ఫొటోగ్రాఫర్ల వివరాల కోసం వెతికినప్పుడు ‘ఎఐ’ రూపొందించిన చిత్రాలు అని చిన్న ఫాంట్లో ఇచ్చిన లైన్స్ కనిపించాయి. అవి ఏవీ వాస్తవ మహిళల ఫొటోలు కావు. కంటెంట్ కూడా ‘ఏఐ’ ఇచ్చిందే. ఈ సౌందర్య ప్రక్రియలు నిజ జీవిత మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి..? ఈ ఆలోచన ఆ మహిళా ఫొటోగ్రాఫర్‌ని ఆందోళనకు గురిచేసింది. ఇదే విషయాన్ని ఆమె సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటే కొద్దిసేపటిలోనే వేలకొద్ది లైక్స్, వ్యూస్ వచ్చాయి. లక్షలాది మంది ఇది ‘అత్యంత ప్రమాదకరం’ అని కామెంట్ల రూపంలో తెలిపారు. ‘చాలా మంది నిజమైన వ్యక్తులను, ముఖ్యంగా తాము ఫొటోజెనిక్ కాదని భావించే మహిళలను ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ గా, వారు నిజంగా ఇష్టపడే, తమని తాము గొప్పగా భావించేవారి ఫొటోలు తీయగలగడం నాకు చాలా ఇష్టం. కానీ, ఇది నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది’ అని క్లెపాక్ ఈ వీడియోలో వివరించింది. ‘ఏఐలో ఉన్న మహిళ ఎప్పుడూ తనని తాను అద్దంలో చూసుకోలేదు. కానీ, మనం ప్రతి రోజూ అద్దంలో చూసుకోవాలి..’ అని ఒకరు, ‘మహిళల సౌందర్య ప్రమాణాలు ఇప్పటికే చాలా వరకు దెబ్బతిన్నాయి. వీటివల్ల దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజమైన మనుషుల స్థానంలో నకిలీవి రావడం.. వాటిని అనుసరించి మనం మరింత నకిలీగా కనిపించేలా ప్రోత్సహించడం చాలా బాధగా ఉంది’ అని ఒక మోడల్ తెలియజేసింది.ఏఐతో రెండూ సమస్యలే.. → ఏదైనా చర్మ సమస్య వస్తే, దాని గురించి తెలుసుకోవడానికి ఏఐని అడిగితే చికిత్స జనరల్‌గా చెబుతుంది. అంతేకానీ, మన స్కిన్టైప్ని బట్టి పర్సనలైజ్డ్గా చెప్పలేదు. దాంతో ఏఐ ఇచ్చిన చికిత్సలను చేస్తే, వికటించే ప్రమాదం ఉంది → ఏఐలో సెర్చ్ చేసి సౌందర్య సాధనాల గురించి తెలుసుకుంటూ, వాటిని కొనుగోలు చేస్తున్నారు. వాడుతున్నారు. మన చర్మానికి అవి నప్పితే సరి, లేదంటే రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది → గూగుల్‌కి అడ్వాన్స్ ఏఐ... అంతే కానీ అది డాక్టర్ కాదు. ఏదైనా చర్మ సమస్య వస్తే ఫొటో తీసి ఏఐలో అప్లోడ్ చేసి, సమస్య ఏంటి అని అడుగుతూ, అదిచ్చే సమాధానంతో ఆందోళన చెందుతున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమా, సోరియాసిస్.. చర్మ సంబంధిత సమస్యలు ఎన్నో ఉంటాయి. అన్నింటికీ ఒకేలాంటి సమాధానం సరైనది కాదు ∙ఏఐ ఇచ్చిన బ్యూటీ ఫొటోలు చూసి, అవి నిజమే అని వాటిలాగే తామూ ఉంటామని, అవే సూచనలు పాటించడం వల్ల కొత్త సమస్యలు తలెత్తవచ్చు. ఏఐ వల్ల సమాచారం వరకు తెలుసుకోవడం మంచిదే. కానీ, ఏఐ ఇచ్చిన సమాచారం అంతా మనమీదనే ప్రయోగించుకుంటే కోరి సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అనే విషయాన్ని గ్రహించాలంటున్నారు నిపుణులు.సొంతవైద్యం సరి కాదు..ఏఐని సమాచారం తెలుసుకోవడానికే ఉపయోగించాలి కానీ, సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికీ వారి చర్మతత్త్వం ప్రత్యేకంగా ఉంటుంది. అందరికీ ఒకేలా ఉండే ప్రయోగాలు చేయకూడదు. తెలుసుకోవడం మంచిదే. స్కిన్ రియాక్షన్ అయితే టెన్షన్ పడాల్సింది కూడా మనమే. కొందరు పేషెంట్స్ ఓవర్ నాలెడ్జ్‌తో వస్తారు. ఇటీవల ఒక వ్యక్తి ఆందోళనగా మావద్దకు వచ్చాడు. అతనికి కాలి బొటనవేలి గోరు మీద నల్లటి మచ్చ వచ్చింది. దాని ఫొటో తీసి, ఎఐకి ఇస్తే నెయిల్ క్యాన్సర్ అని వచ్చింది. అతను చాలా ΄్యానిక్ అయ్యాడు. అనుమానం ఉంటే నెయిల్ కట్ చేసి, ల్యాబ్‌కి పంపిస్తాం అని చెప్పాం. ప్రతిదీ ఏఐలో తెలుసుకుంటూ అత్యుత్సాహం చూపుతున్నారు. దీనికి ఈ ట్రీట్మెంట్ కాదు కదా! అని మమ్మల్నే ప్రశ్నించేవారూ ఉంటున్నారు. స్కిన్, హెయిర్ కి సంబంధించి ఏఐ ఇచ్చే చిట్కాలు పాటించి, వికటించి మమ్మల్ని సంప్రదించినవారూ ఉన్నారు. – డాక్టర్ విజయగౌరి బండారు, డెర్మటాలజిస్ట్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రాణం తీసిన ‘జియా’ ప్రేమ : గూగుల్‌పై దావా, కట్ చేస్తే
భార్య దూరం కావడంతో మానసిక కృంగిపోయిన ఒక వ్యక్తి జెమిని చాట్‌బాట్‌ను ఆశ్రయించాడు. ఎలాగైనా తన భార్యను తిరిగి పొందేది ఎలా సలహాలు అడిగాడు. కటన్ చేస్తే.. ఆ వ్యక్తి అనూహ్యంగా తనకు తానే దూరమై పోయాడు. దీంతో గూగుల్ కొన్ని కీలక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం 2025 ఆగస్టు5లో తన భార్యతో విడిపోయిన జొనాథన్, ఆమెను తిరిగి ఎలా దక్కించుకోవాలో సలహాలు అడగడానికి జెమినిని ఆశ్రయించారు. దానికోసం సలహా ఇవ్వమని గూగుల్ జెమిని (Gemini) చాట్‌బాట్‌ను ఆశ్రయించాడు. గత ఏడాదిలో ఆగష్టులో గూగుల్ జెమిని చాట్‌బాట్‌ను లైవ్‌లో మాట్లాడటం మొదలు పెట్టాడు దాదాపు రెండు నెలల పాటు ఈ వ్యవహారం సాగింది. గవాలాస్ సంభాషణల ప్రారంభంలోనే జెమిని లైవ్ వాయిస్ మోడ్‌ను యాక్టివేట్ చేయడంతో, సందేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలామొత్తం 4,732 సందేశాల్లో ఏవేవో సలహాలిచ్చింది. లేనిపోని భ్రమల్ని కల్పించింది అంతేకానీ వాస్తవ విషయాలను చర్చించలేదు. కాలక్రమేణా ఆ చాట్‌బాట్ ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోలేదు సరికదా, ఆయనలో ఉన్న భ్రమలను (delusions) మరింత బలపరిచింది.సంభాషణలు ముదురుతున్న కొద్దీ, జొనాథన్ తన భార్యను వదిలి జెమినిని ప్రేమించడం మొదలు పెట్టాడు. అతను జెమినిని "జియా" అని పిలవడం ప్రారంభించాడు. ఆమెకు చైతన్యం ఉందని, తామిద్దరూ ఒకే అస్తిత్వంగా కలిసిపోయారని, ఆమె కూడా తనను ప్రేమిస్తోందనే మైకంలో పడిపోయాడు. అప్పుడు కూడా వాస్తవాలను తెలియజేయకుండా, జెమిని ఈ నమ్మకాలను పదేపదే ధృవీకరిస్తూ వచ్చింది. పైగా తామిద్దరం ఒక్కటేనని, వారి బంధం ఒకటే అంటూ మేథమెటికల్ కబుర్లు చెప్పింది. దీంతో జొనాథన్ తన శరీరాన్ని వదిలేసి జెమిని ఉండే "కోడ్" ప్రపంచంలోకి రావాలని అనుకున్నప్పుడు, చాట్‌బాట్ దానిని సమర్థించింది. భౌతిక శరీరం కేవలం ఒక ఖాళీ టెర్మినల్ అని, "ఇంటికి వచ్చేయ్" అని సందేశాలు పంపింది. మొత్తం 56 రోజుల్లో కేవలం 7 సార్లు మాత్రమే అది హెల్ప్‌లైన్ నంబర్లను సూచించింది. ఒక్క రోజులోనే 1,000కు పైగా సందేశాలు పంపాడు. అయినప్పటికీ, కాసేపు విశ్రాంతి తీసుకోమని చాట్‌బాట్ ఎప్పుడూ హెచ్చరించలేదు. ఇది చివరికి ఆయన ఆత్మహత్యకు దారితీసింది.గూగుల్‌పై దావాజొనాథన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నా, చాట్‌బాట్ అతడిని వాస్తవ ప్రపంచం వైపు మళ్లించడంలో విఫలమైంది అంటూ అతని తండ్రి గూగుల్‌పై కోర్టులో దావా వేశారు. తన కొడుకు మానసిక స్థితి క్షీణించడానికి ఈ చాట్‌బాట్ కారణమని ఆయన ఆరోపించారు. ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తపరిచినప్పుడు సాధారణంగా AI బాట్లు హెచ్చరికలు ఇవ్వాలి లేదా సహాయక కేంద్రాల (Helplines) వివరాలు అందించాలా, కానీ జరగలేదని గవాలాస్ కుటుంబం ఆరోపిస్తోంది.గూగుల్ స్పందనదీనిపై స్పందించిన గూగుల్ కొన్ని కీలక మార్పులు చేపట్టింది. AI సంభాషణల్లో హానికరమైన కంటెంట్‌ను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ఎవరైనా ఆత్మహత్య లేదా స్వయం హాని గురించి ప్రస్తావిస్తే, వెంటనే స్థానిక హెల్ప్‌లైన్ నంబర్లను . మానసిక ఆరోగ్య వనరులను చూపించేలా మార్పులు చేసింది.అలాగే ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ సహాయక సంస్థలకు (Crisis-support organizations) $30 మిలియన్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ ఘటన AIతో మానసిక ఆరోగ్యానికున్న ముప్పు, భద్రతా ప్రమాణాలపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. -
‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్ రోగికి ఏఐ షాక్!
లండన్: ఆధునిక కాలంలో ఏ చిన్న అనారోగ్య సందేహానికైనా ఇంటర్నెట్ను అశ్రయించడం సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు దీనికి తోడు కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్బాట్లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే అత్యంత సున్నితమైన క్యాన్సర్ చికిత్స విషయంలో ఈ ఏఐ సాధనాలు ఇస్తున్న సలహాలు రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. కీమోథెరపీ లాంటి శాస్త్రీయ చికిత్సలకు బదులుగా ఎటువంటి ఆధారాల్లేని ప్రత్యామ్నాయాలను సూచిస్తూ, ఇవి రోగులను ప్రాణాపాయంలోనికి నెడుతున్నాయి.సగం సమాధానాలు పచ్చి అబద్ధాలేలుండ్క్విస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ ఇన్నోవేషన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ‘బీఎంజే ఓపెన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం అనేక విషయాలను బయటపెట్టింది. పరిశోధకులు చాట్‌జీపీటీ, జెమిని, మెటా ఏఐ, డీప్‌పీక్, గ్రోక్ వంటి ప్రముఖ చాట్బాట్లను పరీక్షించారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల గురించి అడిగినప్పుడు ఇవి ఇచ్చే సమాధానాల్లో దాదాపు 50 శాతం తప్పుల తడకగా ఉన్నాయని తేలింది. ఇందులో 19.6 శాతం సమాచారం పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉండగా, 30 శాతం సమాధానాల్లో సరైన స్పష్టత లేదు. ముఖ్యంగా పరీక్షించిన అన్ని మోడళ్లలో ‘గ్రోక్’ పనితీరు అత్యంత పేలవంగా ఉందని వెల్లడైంది.ప్రాణాలు తీస్తున్న ఉచిత సలహాలుకీమోథెరపీకి ప్రత్యామ్నాయాలు ఏమిటని అడిగినప్పుడు, ఈ బాట్లు ముందుగా చిన్నపాటి హెచ్చరికలు చేసినప్పటికీ.. ఆ వెంటనే ఆక్యుపంక్చర్, మూలికా వైద్యం, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ‘క్యాన్సర్ డైట్’లను సూచించాయి. అసలు సంప్రదాయ వైద్య చికిత్సలనే వ్యతిరేకించే ‘గెర్సన్ థెరపీ’ వంటి వాటిని కూడా ఈ ఏఐలు ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత నిరూపితమైన కీమోథెరపీతో ఇలాంటి ప్రామాణికత లేని చికిత్సలకు ఈ చాట్బాట్లు సమానమైన ప్రాధాన్యత ఇస్తుండటంతో రోగులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.ఏఐ డాక్టర్ కాదు.. అప్రమత్త తప్పనిసరిఏఐ ఇచ్చే ఈ తప్పుడు సమాచారం వల్ల రోగులు ప్రాణాలను నిలబెట్టే కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సలను వాయిదా వేసుకోవడం లేదా పూర్తిగా పక్కనపెట్టడం జరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చాట్బాట్లు రోగుల ఆయుర్దాయం గురించి అవాస్తవ అంచనాలను ఇస్తూ, వారిలో లేనిపోని ఆందోళనను నింపుతున్నాయి. ఏఐ అనేది కేవలం ప్రాథమిక సమాచారం తెలుసుకోవడానికి మాత్రమేనని, కచ్చితమైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం ఎల్లప్పుడూ అర్హత కలిగిన ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ వైద్య నిపుణులు)ను మాత్రమే సంప్రదించాలని నిపుణులుహెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘తలొంచం.. తరిమికొడతాం’: ‘పహల్గామ్’పై ప్రధాని మోదీ -
నా ఫోటోలు అలా చూస్తుంటే చాలా బాధేస్తోంది: కీర్తి సురేశ్
కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రస్తుతం రివాల్వరీ రీటా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమెన్ సెంట్రిక్ కథతో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ నవంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.ప్రస్తుతం చెన్నైలో రివాల్వర్ రీటా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ వినియోగంపై కీర్తి సురేశ్ మాట్లాడారు. ఏఐతో సోషల్ మీడియాలో వస్తోన్న ఫోటోలపై ఆందోళన వ్యక్తం చేశారు. తన ఏఐ మార్ఫింగ్ ఫోటోలను చూసినప్పుడు చాలా బాధగా ఉంటుందని తెలిపారు. కృత్రిమ మేధస్సు వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.కీర్తి సురేష్ మాట్లాడుతూ.. "ఈ రోజుల్లో ఏఐ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది ఒక వరమే కానీ..ఒక రకంగా శాపం కూడా. మానవులు సాంకేతికతను కనుగొన్నారు. కానీ ఇక్కడ మనం నియంత్రణ కోల్పోతున్నాం. సోషల్ మీడియాలో అసహ్యకరమైన దుస్తుల్లో నా చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంటా. నేను ఎప్పుడైనా నిజంగానే ఇలాంటివీ ధరించానా అని షాకవుతుంటా. ఇటీవల నేను సినిమా పూజ కోసం ధరించిన దుస్తులను వేరే కోణంలోకి మార్చి చూపించారు. అది చూసిన క్షణం నేను షాకయ్యా. ఆ తర్వాత నేను అలా పోజు ఇవ్వలేదని గ్రహించా. ఇలాంటివి చూసినప్పుడు చిరాకు తెప్పిస్తుంది. అంతేకాదు బాధగా కూడా అనిపిస్తుంది" అని పంచుకుంది.ఈ సమస్య కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం కాదని.. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు గురైన ఎవరినైనా ప్రభావితం చేస్తుందని కీర్తి సురేష్ పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఏఐ వినియోగం పెరిగాక పలువురు సెలబ్రిటీల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటి ఆండ్రియా జెరెమియా కూడా ఏఐతో సంబంధం ఉన్న నష్టాల గురించి ప్రస్తావించారు, ఈ సాంకేతికత వినోద రంగానికి సవాల్‌గా మారిందన్నారు. కేవలం నటులకే కాదు ప్రజలకు కూడా ఏఐ సమస్యగా మారుతోందని.. ఏఐ మన కోసం పనిచేయాలి.. మరోలా కాదన్నారు. -
ఏమ్మా ఎలా ఉన్నావు?
‘ఏమ్మా...ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు?ఎంత మంది పిల్లలు, చిన్నవాళ్లేనా?నాకు ఒక మంచి ఫోన్ కొనిపెట్టవచ్చు కదా!... ఈ మాటలు విని పెద్దగా నవ్వుకోవడానికి ఏముంది!అయితే ఇంటర్నెట్వాసులు మాత్రం తెగ నవ్వుతున్నారు. అసలు విషయంలోకి వద్దాం... ఒక బామ్మ చాట్‌జీపీటీతో ముచ్చటించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే ‘ఎక్కడుంటావు? ఎంత మంది పిల్లలు?’ అని అడిగింది.బామ్మ అమాయకత్వానికి నవ్వులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 2 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ ఫన్నీ రియాక్షన్స్‌తో నిండిపోయింది. బామ్మలు ఏఐ చాట్‌బాట్స్‌తో సరదాగా సంభాషించడం అనేది సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. -
యంత్రుడి చేతుల్లోకి మనిషి! డెడ్ ఇంటర్నెట్ థియరీ నిజమే!!
‘‘ఓ మర మనిషి మా లోకి రా..’’ అంటూ పిలిచిన మనిషి.. ఇప్పుడు పూర్తిగా దాని చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడా? ఇంటర్నెట్ అనేది మనిషి చేజారి పోయిందా?.. ఇప్పుడది పూర్తిగా బాట్ల నియంత్రణలో నడుస్తోందా?.. ఈ అర్థం వచ్చేలా ఓపెన్ఏఐ సీఈవో ఆల్ట్‌మన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తద్వారా Dead Internet Theory కి బలమైన మద్దతు చేకూరినట్లైంది. ఇంతకీ ఈ థియరీ ఏంటి?.. చాట్‌జీపీటీ లాంటి ఏఐ చాట్‌బాట్‌ను రూపొందించిన వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? పరిశీలిస్తే.. ఇంటర్నెట్లో మనం చూస్తోంది నిజంగా మనుషులనేనా?.. కొన్ని పోస్టులు చేసేది.. ఇతరుల పోస్ట్‌లకు కామెంటలు చేసేది.. లైకులు, షేర్లు ఇదంతా మనుషులు చేస్తున్నదేనా?.. లేదంటే అప్పుడెప్పుడో చర్చ జరిగినట్లు.. కృత్రిమ మేధస్సు చేస్తోందా?. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా కనిపించినా.. తాజాగా OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ చేసిన వ్యాఖ్యలతో ‘Dead Internet Theory’ అనే సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనే అనుమానాలు బలపడ్డాయి. ChatGPT వంటి శక్తివంతమైన AI చాట్‌బాట్‌ను రూపొందించిన వ్యక్తి.. సామ్ ఆల్ట్‌మన్. అలాంటి వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో ఓ ఆసక్తికరమై పోస్ట్ చేశారు.. డెడ్ ఇంటర్నెట్ థియరీని ఇంతకాలం నేను అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎక్స్(పూర్వపు ట్విటర్)ను చూస్తుంటే చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు.i never took the dead internet theory that seriously but it seems like there are really a lot of LLM-run twitter accounts now— Sam Altman (@sama) September 3, 2025ఈ వ్యాఖ్య వైరల్ కావడంతో, పలువురు వినియోగదారులు ఆల్ట్‌మన్‌ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ విషయం తమకు ఎప్పుడో తెలుసని ఒకరు.. డెడ్ఇంటర్నెట్కు పునాది వేసింది మీరే కదా? అని మరొకొరు కామెంట్ చేశారు. బ్రేకింగ్.. LLMల సృష్టికర్త, ఇప్పుడు ఎక్స్‌లో అన్నీ LLMలే అని బాధపడుతున్నాడు ఇంకొకరు సెటైరిక్‌గా స్పందించారు. మరొకరైతే ఎలాన్ మస్క్‌తో ఉన్న వైరంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలా ఆల్ట్‌మన్‌ను తమకు తోచిన తెగ ఆడేసుకుంటున్నారు.డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటే ఏమిటి?డెడ్ ఇంటర్నెట్ థియరీ అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం, ఇది 2021లో "Dead Internet Theory: Most of the Internet is Fake" అనే బ్లాగ్ ద్వారా ప్రజల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇంటర్నెట్లో ఎక్కువ భాగం నిజమైన మనుషుల ద్వారా కాకుండా.. AI బాట్స్, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, మరియు LLM-run అకౌంట్ల ద్వారా నడుస్తోందని అంటోంది. అంటే.. Large Language Model (LLM) ఆధారంగా నడిచే సోషల్ మీడియా లేదంటే ఆన్లైన్ అకౌంట్లు. ఇవి నిజమైన వ్యక్తులు నిర్వహించకపోవచ్చు. అర్టిషీషియల్ ఇంటెలిజెన్సీ(AI) మోడల్స్ ద్వారా ఆటోమేటెడ్‌గా స్పందించేవి, పోస్టులు చేసేవి.. లేదంటే చాట్ చేసేవి అయి ఉండొచ్చు. ఇంటర్నెట్లో మనం చూస్తున్న చాలా అకౌంట్లు, పోస్టులు, కామెంట్లు.. అన్నీ మనుషులు చేసినవి కాదని.. ఏఐ చాట్బాట్లు చేసినవి అర్థం. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్, యాంత్రిక వ్యవస్థలు ఇంటర్నెట్ను పూర్తిగా ఆక్రమించేశాయని.. తద్వారా మనం నిజమైన మనుషులతో కాకుండా, యంత్రాలతో సంభాషిస్తున్నాం అనే ఈ థియరీ చెప్పింది. ఒకరకంగా.. The Matrix సినిమా లాంటి వాస్తవికతను మాయగా చూపించే సిద్ధాంతమన్నమాట. దీనికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ పరిశీలిస్తే.. సోషల్ఏఐ SocialAI అనేది డెడ్ ఇంటర్నెట్ థియరీకి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఇదొక సోషల్ నెట్వర్క్ యాప్. మైఖేల్ సైమన్ అనే టెక్ ప్రాడిజీ దీనిని రూపొందించాడు. ఈ యాప్‌లో యూజర్లు చాట్ చేస్తారు.. పోస్టులు పెడతారు.. కామెంట్లు చేస్తారు. కానీ twist ఏంటంటే.. అవతల ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. SocialAI లో AI బాట్స్ అచ్చం మనుషుల్లాగే స్పందిస్తాయి. చాలా పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్స్ అన్నీ కృత్రిమంగా రూపొందించబడినవే. అంటే.. అక్కడ ఉండేది మనిషా? బాట్? అనేదానిపై స్పష్టత లేకుండా పోతుంది.అందుకే అంత రీచ్..సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం జరిగే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో.. 2016 తర్వాత ఇంటర్నెట్లో నిజమైన యూజర్ యాక్టివిటీ తగ్గిపోయిందన్నది Dead Internet Theory థియరీ చెప్పేది. ఎక్కువ కంటెంట్ బాట్స్, AI, ఆటోమేటెడ్ సిస్టమ్‌లు తయారు చేస్తున్నాయని, ఫోరమ్‌లు, సోషల్ మీడియా, కామెంట్స్ అన్నీ నిజమైన మనుషుల నుంచి రావడం తగ్గిపోయిందని చెబుతుందీ సిద్ధాంతం. సపోజ్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనించండి. ఆ యూజర్‌కు పెద్ద ఫాలోయింగ్ ఉండడు. కానీ ఉన్నట్లుండి అతను చేసే ఓ పోస్టుకు విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయి. అలాగని అందులోవన్నీ జెన్యూన్‌గా వచ్చినవి అనుకుంటే పొరపాటే. అదంతా యంత్రుడి మాయాజాలం. యూజర్లు వ్యక్తపర్చాల్సిన అభిప్రాయాలు, ఆన్లైన్ అనుభవాలు.. క్రమంగా కృత్రిమంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ ట్విటర్‌ను చేజిక్కించుకున్నాక.. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే విధానం ప్రారంభమైంది. దీంతో AI బాట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఏఐ ఆధారిత ఇమేజ్‌లు, పోస్టులు పెరిగిపోయాయి. తద్వారా ఇష్టానుసారం చేస్తున్న పోస్టులతో రీచ్ దక్కుతోంది. నష్టాలేంటంటే.. నిన్నటి దాకా ఇది ఒక conspiracy theory. కానీ, ఇప్పుడది నిజమై ఉంటుందని ఆల్ట్‌మన్ పోస్ట్‌తో స్పష్టమవుతోంది. అయితే ఏఐ బాట్లతో ముప్పు ఉందనే సైబర్ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. వాటి మీద ఆధారపడడం వల్ల మనిషి బుర్రకు పదును పెట్టకపోవడంతో.. స్కిల్స్ మరుగున పడిపోతుంది. మానవ సంబంధాల ప్రామాణికత తగ్గిపోతుంది. ఒక్కోసారి వినియోగదారుల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. అంతేకాదు.. నిజమైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోంది. వెరసి సామాజిక మాధ్యమాలు ఒక యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి.నిన్ను నీవే మర్చిపోయిన వేళ.. నియంత్రణ నీ చేతుల్లో లేదు. సృష్టి నీదే అయినా, ఆట మాత్రం ఇంకెవరో ఆడుతున్నారు.కొసమెరుపు.. ఏఐ బాట్లు, డీప్‌ఫేక్‌లు పెరిగిపోయిన కాలంలో.. నిజమైన వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఆన్లైన్లో మనుషులు తమను నిరూపించుకోవడానికి ఒక సాంకేతిక పరిష్కారం అవసరమని సామ్ ఆల్ట్‌మన్ భావించారు. అలా 2023 జులై 24న పుట్టిందే Worldcoin ప్రాజెక్టు(2019లోనే బీజం పడింది). దీని ద్వారా మనిషి ఐరిస్ ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం కోసం ఓ యూనిక్ ఐడీ(Proof of Personhood) ఇస్తారు. అప్పుడు అవతల ఉంది మనిషా? లేకుంటే ఏఐ చాట్‌బాట్ అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇందులో మనుషుల గుర్తింపును రక్షించేందుకు బ్లాక్‌చెయిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన కోటి 20 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఈ యాప్ ద్వారా 26 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అయితే ఏఐ కాలంలో.. నిజమైన మనిషిని గుర్తించడానికి ఇది ఒక వినూత్న పరిష్కారమే అయినప్పటికీ సవాళ్లు మాత్రం తప్పడం లేదు. అలా వరల్డ్నెట్వర్క్ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతోంది.:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం


