
‘ఏమ్మా...ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు?
ఎంత మంది పిల్లలు, చిన్నవాళ్లేనా?
నాకు ఒక మంచి ఫోన్ కొనిపెట్టవచ్చు కదా!... ఈ మాటలు విని పెద్దగా నవ్వుకోవడానికి ఏముంది!
అయితే ఇంటర్‌నెట్‌వాసులు మాత్రం తెగ నవ్వుతున్నారు. అసలు విషయంలోకి వద్దాం... ఒక బామ్మ చాట్‌జీపీటీతో ముచ్చటించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే ‘ఎక్కడుంటావు? ఎంత మంది పిల్లలు?’ అని అడిగింది.
బామ్మ అమాయకత్వానికి నవ్వులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 2 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ ఫన్నీ రియాక్షన్స్‌తో నిండిపోయింది. బామ్మలు ఏఐ చాట్‌బాట్స్‌తో సరదాగా సంభాషించడం అనేది సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది.