రక్తప్రవాహం ఒక్కసారిగా ఆగిపోతే వచ్చే స్ట్రోక్ ఎంత ప్రమాదకరమో తెలిసిందే. అయితే, ఈ ప్రాణహానికి అడ్డుకట్ట వేయడానికి స్విస్ శాస్త్రవేత్తలు కొత్త సూపర్‌హీరోలను సృష్టించారు. అవే మన రక్తనాళాల్లో పరిగెత్తే సూక్ష్మ రోబోలు! ఈ చిన్న రోబోలు రక్తప్రవాహంలో తేలికగా ప్రయాణిస్తూ, రక్తనాళం ఎక్కడైనా మూసుకుపోయిందని గుర్తిస్తే వెంటనే అక్కడికి చేరి గడ్డను కరిగించే మందును నేరుగా ఆ ప్రదేశానికే పంపిస్తాయి.
రక్తం ఎంత వేగంగా ప్రవహించినా, ఇవి అంతే వేగంగా, చురుకుగా కదులుతాయి. తాజాగా శాస్త్రవేత్తలు వీటిని బాహ్య అయస్కాంత క్షేత్రాల సాయంతో కచ్చితంగా నియంత్రించగలమని నిరూపించారు. అంటే వైద్యులు రక్తనాళాల సన్నని దారుల్లో ఈ రోబోలను నిశితంగా నడిపించగలరు. సడ¯Œ గా స్ట్రోక్ వచ్చినప్పుడు ఇప్పటి చికిత్సలు, మందులు, శస్త్రచికిత్స సమయం తీసుకుంటాయి. కాని, ఈ రోబోలు, మొదటి నిమిషాల్లోనే గడ్డపై నేరుగా దాడి చేసి, ప్రాణాలను రక్షించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇవి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది, స్ట్రోక్ చికిత్సలో ప్రాణరక్షక సేనగా మారబోతున్నాయి.


