తన ప్రాంతం, పేరు తెలియదు. పేపర్, పెన్ను ఇస్తే ఇంగ్లిష్ లో, తమిళంలో రాస్తాడు. ఏడు పదుల వయస్సు ఉన్న ఈయన ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆస్పరికి వచ్చాడు. స్థానికులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అందరికీ హాయ్ అని చెప్పే ఈయనకు పేపరు ఇస్తే సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ, రక్త పరీక్షలు చేయించుకోవాలని, రోగి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని రాస్తాడు. మూడు నెలల క్రితం ఆదోనిలో వదిలిపెట్టినా తిరిగి ఆస్పరికే చేరుకున్నాడు. ఈ వృద్ధుడు చెన్నై ప్రాంతంలో డాక్టర్‌గా పనిచేసి మతిస్థిమితం లేక ఇక్కడికి వచ్చి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.


