ధవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త, చిత్రకారుడు మిరప రమేష్ కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వీరాభిమానం. ఆదివారం తన రక్తంతో వైఎస్ జగన్ చిత్రపటం గీసి, హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా.. అంటూ శుభాకాంక్షలు తెలిపి, తన అభిమానాన్ని చాటుకున్నాడు.


