భారతదేశపు ప్రముఖ టెలికాం ప్రొవైడర్ రిలయన్స్ జియో లెక్కకు మించిన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఇందులో రూ.200 ప్లాన్ ఒకటి. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ జియో రూ.200 ప్లాన్ అనేది ఓటీటీ పాస్ యాడ్-ఆన్ ప్యాక్. దీని ద్వారా కుకు టీవీతో పాటు 15 ఓటీటీ తో సహా ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌లు లభిస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు, కాగా 30 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ కేవలం డేటా ప్రయోజనాలను మాత్రమే అందిస్తుంది. ఇందులో ఎలాంటి వాయిస్ కాలింగ్ సదుపాయం లభించదు.
టీవీ, టాబ్లెట్, మొబైల్‌లో ప్రకటనలు లేకుండా యూట్యూబ్ ప్రీమియం వీక్షించవచ్చు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు కూడా లభిస్తాయి. మొత్తం మీద లైవ్ టీవీ ఛానెల్‌లు, అదనపు వినోద ప్రయోజనాల కోసం ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


