ఓటీటీలోకి హారర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Lee Cronins The Mummy Movie OTT Release Date India | Sakshi
Sakshi News home page

OTT: విదేశాల్లో ఇప్పటికే రిలీజ్.. ఇండియాలో స్ట్రీమింగ్‌పై ప్రకటన

Sep 2 2026 8:30 PM | Updated on Sep 2 2026 9:07 PM

Lee Cronins The Mummy Movie OTT Release Date India

90ల్లో పుట్టి పెరిగిన చాలామంది ఇప్పుడు 30స్‌లో ఉ‍న్నారు. వీళ్లంతా చిన్నతంలో హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ వీళ్లని చాలానే భయపెట్టింది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే పలు భాగాలు రిలీజయ్యాయి. కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో తెరకెక్కాయి. ఈ ఏడాది ఈ జానర్ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఓ మూవీ వచ్చింది. అదిప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. అనంతరం మే నెలలో విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మన దేశంలో మాత్రం ఈ నెల 17 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చూడొచ్చు.

'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా ఆనందపడుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు సదరు కుటుంబాన్ని దారుణంగా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా భయపెట్టేలా ఉన్నాయి.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement