రవితేజ 'ఇరుముడి' సినిమా ఎట్టకేలకు రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి కూర్చుని ఉండగా.. పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్నారు.
చాలామంది అయ్యప్ప భక్తులు.. తమ పిల్లలతో ఈ తరహా ఫొటోలు దిగుతూ ఉంటారు. అయితే సినిమాలో లేని ఈ ఫొటోని ఇప్పుడు రూ.200 కోట్ల వసూళ్లు దాటిన సందర్భంగా విడుదల చేసి అభిమానులని సర్‌ప్రైజ్ చేశారు. రెండో వీకెండ్ దాటేసి మూడో వారాంతంలోకి వచ్చినా సరే 'ఇరుముడి' జోరు ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ వారం వచ్చే సినిమాల్లో చెప్పుకోదగ్గవి ఏం కనిపించట్లేదు. చూస్తుంటే ఈ వీకెండ్ కూడా రవితేజ హవా చూపించేలా కనిపిస్తున్నాడు.


