అలా చేస్తే ప్రతి స్క్రిప్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది : శివ నిర్వాణ | Maremma Movie Trailer Release Highlights | Sakshi
Sakshi News home page

అలా చేస్తే ప్రతి స్క్రిప్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది : శివ నిర్వాణ

Sep 2 2026 1:20 PM | Updated on Sep 2 2026 1:52 PM

Maremma Movie Trailer Release Highlights

‘‘మారెమ్మ’ సినిమా ట్రైలర్‌ బాగుంది. కథలో ఎలాంటి కన్ఫ్యూజన్‌ లేకుండా ట్రైలర్‌లో అద్భుతంగా చెప్పారు. మ్యూజిక్, ఫొటోగ్రఫీ బాగున్నాయి. కథకి ఏం కావాలో అవి చేసుకుంటూ వెళ్తే ప్రతి స్క్రిప్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. బ్లాక్‌బస్టర్‌ కావడానికి కావాల్సిన అన్ని అంశాలు ‘మారెమ్మ’లోనూ ఉన్నాయి. ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూసి ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్‌ శివ నిర్వాణ పేర్కొన్నారు. హీరో రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌. మయూర్‌ రెడ్డి బండారు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 10న విడుదల కానుంది. 

ఈ మూవీ ట్రైలర్‌ని హీరో రామ్‌ డిజిటల్‌ వేదికగా లాంచ్‌ చేశారు. ఇటీవల ‘ఇరుముడి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీని ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ ‘మారెమ్మ’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాధవ్‌ మాట్లాడుతూ– ‘‘మారెమ్మ’ చిత్రంలో ఒక దున్నపోతుకు, మనిషికి మధ్య ఉండే అనుబంధం ఎలా ఉంటుందో థియేటర్లలో చూస్తారు. రవితేజగారు ఈ సినిమా చూశారు. ఆయనకి క్లైమాక్స్‌ నచ్చింది... భావోద్వేగానికి గురయ్యారు’’ అని చెప్పారు. నాగరాజు మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్‌ ఎలా ఉందో అంతకు పది రెట్లు ఎక్కువ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మన తెలంగాణ పల్లెటూరి సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మయూర్‌ రెడ్డి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement