గత నెల గ్యాప్‌లో జన నాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహోమ్ కుడుంబ యూనిట్ అని తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ మమిత బైజు ఆస్పత్రిపాలైంది. తీవ్ర జ్వరంతో ప్రస్తుతం బాధపడుతోంది. ఈ శనివారం ఆస్ట్రేలియాలో జరిగే 'క్లైడ్ ఓనం' వేడుకల్లో ఈమె పాల్గొనాలి. అనారోగ్యం కారణంగా ఈ టూర్ రద్దయింది. ఈ విషయాన్ని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ వెల్లడించింది. మమిత వీడియోని పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో మాధవన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)
'డాక్టర్స్ సలహా మేరకు ప్రయాణం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి. త్వరలోనే అభిమానులని కలుసుకుంటాను' అని మమిత బైజు సదరు వీడియోలో చెప్పుకొచ్చింది. ఈమె చేసిన మలయాళ మూవీ 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' తెలుగు డబ్బింగ్ ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు)


