మమిత మరో ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్ | Bethlehem Kudumba Unit Telugu Trailer | Sakshi
Sakshi News home page

Mamitha Baiju: మూడు వారాల గ్యాప్‌లో మమిత మరో మూవీ రెడీ

Aug 28 2026 5:56 PM | Updated on Aug 28 2026 6:09 PM

Bethlehem Kudumba Unit Telugu Trailer

రెండు వారాల క్రితం 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాతో వచ్చి హిట్ కొట్టిన మమిత బైజు.. మరో వారం తిరిగేసరికల్లా కొత్త మూవీని థియేటర్లలోకి తీసుకురానుంది. గతవారం మలయాళంలో మమిత హీరోయిన్‌గా చేసిన 'బెత్లెహోమ్ కుడుంబ యూనిట్' రిలీజైంది. ఫీల్ గుడ్ స్టోరీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు దీన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.

(ఇదీ చదవండి: దీపిక సంచలన వ్యాఖ్యలు.. ప్రభాస్ 'స్పిరిట్'ని ఉద్దేశించా?)

సెప్టెంబరు 4న రిలీజవుతున్న ఈ సినిమాకు తెలుగులో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'గా తీసుకొస్తున్నారు. సూర్య మూవీలానే దీన్ని కూడా ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీగానే తెరకెక్కించారు. జస్టిన్(నివీన్ పౌలీ) పక్కింట్లోకి ఆష్లే(మమిత) కుటుంబం అద్దెకు దిగుతుంది. జస్టిన్ కంటే ఆష్లే 12 ఏళ్లు చిన్నది. అలాంటి వీళ్లిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? చివరకు ఏమైందనేదే ఈ మూవీ ‍స్టోరీ అని తాజాగా వదిలిన తెలుగు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. 'ప్రేమలు' తీసిన గిరీష్ ఏడి దీనికి దర్శకుడు.

(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement