సినిమా ఏదైనా ‘ఇరుముడి’ క్రేజ్‌ తగ్గేదేలే.. | Actress Vaishnavi Chaitanya With Her Family Watched The Irumudi Movie | Sakshi
Sakshi News home page

సినిమా ఏదైనా ‘ఇరుముడి’ క్రేజ్‌ తగ్గేదేలే..

Aug 28 2026 5:45 PM | Updated on Aug 28 2026 6:01 PM

Actress Vaishnavi Chaitanya With Her Family Watched The Irumudi Movie

సినిమా ఏది విడుదలైనా ‘ఇరుముడి’ క్రేజ్‌ తగ్గడంలేదు.  ప్రస్తుతం టాలీవుడ్‌ అంతా ఈ సినిమా పేరే వినిపిస్తోంది.  అంతలా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. తండ్రీకూతరు సెంటిమెంట్‌కి అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీయడంతో సినిమా చూసిన ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
చిన్నా, పెద్దా అని తేడా లేకుండా..
చిన్నా, పెద్దా అని తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రవితేజ తన పాత్రలో అదరగొట్టేశాడు. జీవీ ప్రకాశ్‌ అందించిన మ్యూజిక్‌ సైతం సినిమాకు బలమనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాపై ప్రముఖ నటీనటులు తనదైన సైలిలో ప్రశంసలు కురిపించారు.

చదవండి: నిన్న రామ్‌చరణ్‌...నేడు చిరంజీవి... ‘ఇరుముడి’పై ‘మెగా’ ప్రశంసలు

ఇది ఇలా ఉంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్న ‘ఇరుముడి’కి సెలబ్రిటీల కుటుంబ సభ్యులు సైతం వెళ్లి చూస్తున్నారు. ఈ తరహాలోనే యువ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య తన అమ్మమ్మతో వెళ్లి సినిమా చూశారు. ఇప్పుడీ ఫొటో వైరల్‌గా మారింది.

ఇరుముడి విషయానికొస్తే..
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటించగా, బేబీ నక్షత్ర, సాయి కుమార్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. ఐదు రోజుల్లోనే రూ.108.5 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement