‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ లోని సీన్‌పై మీమ్స్‌ వైరల్‌ | Suriya's Vishwanath And Sons Turns Every 27th Into Meme Fest | Sakshi
Sakshi News home page

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ లోని సీన్‌పై మీమ్స్‌ వైరల్‌

Aug 28 2026 4:42 PM | Updated on Aug 28 2026 5:23 PM

Suriya's Vishwanath And Sons Turns Every 27th Into Meme Fest

ప్రేక్షకులకు సినిమాల్లోని కొన్ని సీన్లు అలరించడమే కాదు.. కొన్ని మీమ్‌ మెటీరియల్‌గా కూడా మారుతుంటాయి. తాజాగా సూర్య నటించిన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ప్రతి నెల 27వ తేదీ రాగానే సూర్య పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ నెటిజన్లు మీమ్స్‌ చేస్తున్నారు.

27న విశ్వనాథ్‌ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటూ 
వెంకీ అట్లూరీ దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సూర్య పోషించిన సంజయ్‌ విశ్వనాథ్‌ పాత్రకు సంబంధించిన ఓ అంశం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి నెల 27న వ్యక్తిగత కారణాలతో అతడు విదేశాలకు వెళ్తుంటాడు. దీంతో ఆ తేదీరాగానే సంజయ్‌ విశ్వనాథ్‌ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటూ అభిమానులు సరదాగా మీమ్స్‌ పెడుతున్నారు. 

గతంలో దృశ్యం2’ సినిమాలోనివి కూడా..
మొన్నటి వరకు వెంకటేశ్‌ నటించిన ‘దృశ్యం2’ సినిమాలోని కొన్ని తేదీలు కూడా ఇలాగే వైరలయ్యాయి. ఆగస్టు 3 అంటే రాంబాబు విజయనగరం నుంచి వచ్చిన రోజు అని ఇలా ఆగస్టు నెలకు సంబంధించిన తేదీలు  మీమ్‌గా మార్చి సోషల్‌మీడియాలో పోస్ట్‌చేసేవారు.

కాగా ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు రాబెట్టింది. రాధికా శరత్‌కుమార్‌, రవీనా టాండన్‌, భవానీ శ్రీ, నాజర్‌, ఆది, సునీల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement