2013లో వచ్చిన చిత్రం ‘దృశ్యం’. అప్పటి నుంచి ప్రారంభమైన దృశ్యం ఫ్రాంచైజీ మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సీక్వెల్స్ తీస్తూనే వచ్చారు. ఇటీవలే దృశ్యం4’ కూడా ఉంటుందని నిర్మాత ఆంటోని పెరుంబవూర్ అప్‌డేట్ ఇచ్చారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో మరోసారి జార్ట్‌కుట్టి కుటుంబం, వరుణ్ హత్య కేసుపై మీమ్స్, జోకులు వైరల్ అవుతున్నాయి.
( ఇదీ చదవండి: దృశ్యం ఫ్రాంచైజీకి మరో సీక్వెల్ )
ఎలా ట్రోల్ చేస్తున్నారంటే..
జార్జ్‌కుట్టిగా మోహన్‌లాల్ మరోసారి తెరపై కనిపిస్తుండడంపై అభిమానులు ఆసక్తిని వ్యక్తం చేస్తూనే.. ‘ఇక ఈ కేసుకు ముగింపు పలకాలంటే అందరినీ అరెస్టు చేయడమే మార్గం’ అని సరదగా కామెంట్లు చేస్తున్నారు.
‘వరుణ్ అస్థిపంజరం కూడా జార్జ్‌కుట్టి కుటుంబాన్ని ప్రశ్నిస్తుందేమో’ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. ‘ఆ వ్యక్తిని చంపింది నేనే.. నన్ను అరెస్టు చేయండి’ అంటూ మరో వ్యక్తి కేరళ పోలీసులను, మోహన్‌లాల్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. మరి కొందరు ఈ ఫ్రాంచైజ్‌ను ‘ప్రధానమంత్రి అజయ్ దేవ్‌గణ్ రోజ్‌గర్ యోజన’ అంటూ సరదాగా ట్రోల్ చేశారు.

దృశ్యం4 కథేంటి..
మోహన్‌లాల్ జార్జ్‌కుట్టిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం’ 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘దృశ్యం2’, ‘దృశ్యం3’ వరకు కొత్త కొత్త అంశాలతో కథను కొనసాగించారు. ఇప్పుడు ‘దృశ్యం4’లో ఈసారి జార్జ్‌కుట్టిని పోలీసులు ఎలా ఎదుర్కొన్నారు? అతడి కుటుంబం ఎలాంటి సమస్యలో చిక్కుకోనుంది.? అనే కోణంలో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడొస్తుందోనని ఈ ప్రాంచేజీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘జార్జ్‌కుట్టి.. ఇక చాలించు.. ఈసారి అయినా లొంగిపో’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
ఎలా మొదలైందంటే..
‘దృశ్యం’ సినిమాలో జార్జ్‌కుట్టి, అతడి భార్య రాణి, ఇద్దరు కుమార్తెల జీవితాల్లోకి వరుణ్ ప్రభాకర్ మరణం అనుకోని సమస్యను తీసుకొస్తుంది. జార్జ్‌కుట్టి పోలీసులకు చిక్కకుండా పక్కా స్కెచ్ వేస్తాడు. పోలీసు అధికారి కుమారుడు వరుణ్ కావడంతో అప్పటి నుంచి ఆ కేసు అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటుంది.



